పోస్ట్‌లు

జూన్, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

Helping Hands

చిత్రం
ఎన్నో పక్షులు ఆహారం కోసం విదేశాల నుంచి మనదేశానికి వలస వస్తాయి. కొన్నాళ్లు ఉండి తిరిగి వెళ్లిపోతాయి. అదే మనదేశంలో వలస జీవులు... ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఎన్నాళ్లు ఉంటారో లెక్కలేదు. అలాంటి వారి బాగోగుల కోసం కృషిచేస్తోంది 'ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌.' ప్యా రిస్‌ కేంద్రంగా పనిచేసే 'ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌' సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. దక్షిణాసియాలో మనదేశంతో పాటు శ్రీలంక, నేపాల్‌లలో సేవలందిస్తోంది. మనదేశంలో ప్రధానంగా వలస కార్మికుల పిల్లల చదువులు, యువతకు స్థానికంగా ఉపాధి... అనే అంశాలపై ఈ సంస్థ దృష్టిపెట్టింది. ఉపాధి కల్పనలో భాగంగా ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌ 'ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లైవ్లీహుడ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(ఐలీడ్‌)' కార్యక్రమం చేపడుతోంది. దీన్లో 18-25 ఏళ్ల మధ్య వయసు యువత వివిధ పరిశ్రమల్లో పనిచేసేందుకు కావాల్సిన నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. అలా గత పదేళ్లలో దేశవ్యాప్తంగా యాభైవేల మందికి వీరు శిక్షణ ఇచ్చారు. విప్రో, టాటా బీపీవో విభాగాలు, పిజ్జాకార్నర్‌, యమహా, నోకియా... వంటి కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని వారి అవసర

Food

చిత్రం
'వెుక్కజొన్నలు తియ్యగా ఉంటే ఏం బాగుంటాయి... కాల్చి తింటే బాగుంటాయి కానీ'... ... ఇదీ సుమారు పదిహేనేళ్ల క్రితం అప్పుడే కొత్తగా మార్కెట్లోకి వస్తోన్న స్వీట్‌కార్న్‌ గురించిన అభిప్రాయం. కానీ ఇప్పుడు అదే స్వీట్‌కార్న్‌ చాలామంది ఇళ్లలో మధ్యాహ్నం స్నాక్‌ఫుడ్డులా మారిపోయింది. థి యేటర్లు, బస్టాండ్లు, మార్కెట్లు... ఎక్కడచూసినా పాప్‌కార్న్‌ మెషీన్లే. వెుక్కజొన్నలు కాలి పేలి వచ్చే ఆ మధురమైన వాసనకు తెలియకుండానే అడుగులు అటువైపుగా సాగుతాయి. ఇప్పుడు పాప్‌కార్న్‌కు తోడుగా ఆ పక్కనే స్వీట్‌కార్న్‌ బండ్లూ కనిపిస్తున్నాయి. అంత రేటా అనుకుంటూ వెుదట్లో ఆ బండి దగ్గరకు వెళ్లడానికి కాస్త సంశయించేవారు. అయితే ఆ మసాలా స్వీట్‌కార్న్‌ వాసన ఆ రుచిని ఆస్వాదించకుండా ఉంచలేకపోయింది. క్రమంగా పాప్‌కార్న్‌కే పోటీగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే చేసుకుని తినేంతగా స్వీట్‌కార్న్‌ మసాలా పాపులర్‌ అయిపోయింది. మామూలు వెుక్కజొన్నకంకుల మాదిరిగానే ఇవి సూపర్‌మార్కెట్లు, రైతుబజార్లలో విరివిగా లభ్యమవుతున్నాయి. వంటిల్లో... స్వీట్‌కార్న్‌... పేరుని బట్టే ఇందులో షుగర్‌ శాతం ఎక్కువ అని తెలిసిపోతుంది. ఇండియన్‌కార్న్‌, షుగ

Interview_Mr. Bujjayi

చిత్రం
బడికెళ్లలేదు. పాఠాలు చదువుకోలేదు. నాన్న వెనకాలే సాహితీసభలకు వెళ్లడం, నాన్న పక్కన కూర్చుని వందల మైళ్లు ప్రయాణించడం... ఇదే ఆయన విద్యాభ్యాసం. ఆ అనుభవాల్లోనే చదువులలోని సారమెల్లా చదివానంటూ 'ఫాదర్స్‌ డే' సందర్భంగా గుండెల్లోని నాన్నను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి తనయుడు బుజ్జాయి. 'కృ ష్ణపక్షం' రోజులవి. భావకవిత్వ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. నాన్నగారు ఆ ఉద్యమ నాయకులు. ఏడాదిలోని పదకొండు నెలలూ ప్రయాణాలే. బళ్లారి నుంచి బరంపురం దాకా.. సుదీర్ఘయాత్రలు. కొత్త కవిత్వాన్ని పరిచయం చేయాలనీ అందులోని మెలకువల్ని విప్పిచెప్పాలనీ ఆయనకెంత తపనో! నాన్నగారు ఇంటిపట్టున ఉన్నదే తక్కువ. అప్పుడే నేను పుట్టాను. పుట్టీపుట్టగానే నాన్నగారి ముందరికాళ్లకు బంధమేశాను. ఇల్లు కదిలితే ఒట్టు. నేనే సర్వస్వం. నా నవ్వు, నా ఏడుపు, నా ఆట, నా మాట... అన్నీ అద్భుతమే తనకు. నా బోసినవ్వులతో ఆయన కడుపు నిండిపోయేది. అసలే పెద్ద కుటుంబం. అంతమంది ఆకలి ఎలా తీరుతుంది? ఆ సంగతి తెలిసినట్టుంది. రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు కబురుపెట్టారు. ఆయన నాన్నగారి గురువు. పట్టుబట్టి కాకినాడ కాలేజీలో తెలుగు ఉపాధ్యాయుడిగ

India Tourism_Mahabaleshwar (Telugu)

చిత్రం
'మండువేసవిలో మంచువానల్ని చూడాలన్నా, పంచగంగలో మునకలు వేయాలన్నా, ఎర్రెర్రని స్ట్రాబెర్రీ షేకుల్ని ఆస్వాదించాలన్నా పచ్చని ప్రకృతితో అలరారే మహాబలేశ్వర్‌కి ప్రయాణమవ్వాల్సిందే' అంటున్నారు హైదరాబాద్‌కి చెందిన ఎ.ఎన్‌.ఎస్‌.శంకర్రావు. రా త్రి 12 గంటలకు హైదరాబాద్‌లోని దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి ఉదయం ఏడు గంటలకు షోలాపూర్‌ చేరుకున్నాం. నేరుగా శ్రీ సిద్ధేశ్వర దేవస్థానం చేరుకుని స్వామిని దర్శించుకున్నాం. అది చూడ్డానికి అచ్చం కోటలానే ఉంది. 12వ శతాబ్దంలో జన్మించిన సిద్ధేశ్వరుడు గొప్ప యోగి, శ్రీశైల మల్లన్న భక్తుడు. దైవసాక్షాత్కారం పొందడమే కాకుండా స్వామి ఆజ్ఞానుసారం 68 క్షేత్రాల్లో ఉండే అన్ని రకాల లింగాలను గుడి ఆవరణలోనూ ఊరి నలుమూలలా ప్రతిష్ఠించాడట. మల్లన్న ఆజ్ఞానుసారమే శ్రీశైలం నుంచి వచ్చిన పాతాళగంగ ఈ గుడిచుట్టూ చేరిందన్నది పురాణగాథ. శక్తిపీఠం! అక్కడ నుంచి మళ్లీ 9 గంటలకు బయలుదేరి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుల్జాపూర్‌కి వెళ్లి అక్కడి భవానీ మాతను దర్శించుకున్నాం. ఈ దేవాలయం శక్తిపీఠాల్లో రెండోది. స్కాంధపురాణంలో ఈ గుడి ప్రస్తావన ఉంది. ఇక్కడ అమ్మవారిది స్వయంభూ విగ్రహం. ఇక్కడున్న బాలాఘాట్‌ కొండమ

Eenadu (19-06-11)

చిత్రం
ల్యాంప్స్‌... కాలేజీ నుంచి పార్లమెంటులో అడుగుపెడుతున్న దివ్వెలు. ప్రజాస్వామ్య వ్యవస్థపై పరిశోధన చేస్తున్న యువరత్నాలు. పాతికేళ్లు కూడా నిండని వీరు సీనియర్‌ ఎంపీలకు మార్గదర్శులు. పా ర్లమెంటులో ఏదైనా అంశంపై చట్టాలు చేసేటపుడు సదరు మంత్రిత్వశాఖకు చెందిన బృందం బిల్లు ముసాయిదా తయారుచేస్తుంది. అనేక అంశాలు సమగ్రంగా పరిశీలించి దాన్ని సిద్ధంచేస్తారు. ఆ అంశాన్ని చర్చించాలనుకునే ఎంపీలు మాత్రం ఒంటరిగానే లోటుపాట్లు తెలుసుకోవాలి. బ్రిటన్‌, అమెరికాలలో దీనికి భిన్నమైన పద్ధతి ఉంది. అక్కడ ఇలాంటి విషయాల్లో, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అభ్యర్థులు ప్రజా ప్రతినిధులకు సాయపడుతుంటారు. బిజూ జనతాదళ్‌కు చెందిన ఎంపీ కైలాస్‌కేష్‌ సింగ్‌దేవ్‌ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు సెనేటర్‌ జాన్‌ కెర్రీ దగ్గర యువ సహాయకుల్ని చూశారు. ఇక్కడకొచ్చాక సింగ్‌ కూడా రాజకీయాలపై అవగాహన ఉన్న ఓ కుర్రాణ్ని సహాయకుడిగా నియమించుకున్నాడు. తర్వాత ఆయన్ని ఈ విషయంలో మరో ఇద్దరు ఎంపీలు అనుసరించారు. ఆపై సింగ్‌ పార్లమెంటరీ వ్యవహారాలపై పనిచేస్తున్న 'పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌', 'కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా' సంస్థలతో చర

Eetaram (25_06_2011)

చిత్రం
ఐడియాల వీరులు! మేటి ఆవిష్కర్తలు!! * పరిశోధనే పెట్టుబడిగా అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోతున్నది ఒకరు... * తెలుగు భాష మీదున్న మమకారానికి సాంకేతికతను అద్దింది మరొకరు... * ఆక్వా రైతుల కోసం ఆలోచించి అంతర్జాతీయ అవార్డును అందుకున్నది ఇంకొకరు... ముగ్గురూ యువ పరిశోధకులే! సమాజాన్ని మేలి మలుపు తిప్పడానికి కృషి చేస్తున్న నవ శాస్త్రవేత్తలే! ఈ మేటి ఆవిష్కర్తలతో 'ఈతరం' ముచ్చటించింది... పరిశోధనల 'ప్రవీణు'డు! పే ద వికలాంగులకు చౌకైన కృత్రిమ కాలు... పత్తి నుంచి ప్రత్యామ్నాయ ఇంధనం... మైనంతో మిసైల్స్‌ను నడిపించే సాధనం... ఇవన్నీ ఓ యువకుడి ఆలోచనల ఫలితాలే. అతడే అబ్దుల్‌ కలాం మెప్పు పొంది, మేటి శాస్త్ర సాంకేతిక సంస్థల గుర్తింపు సాధించిన గోరకవి ప్రవీణ్‌కుమార్‌. హైదరాబాదీ. 'మా యూనిర్సిటీలో పీహెచ్‌డీ చేయండి' అంటూ ఆహ్వానం పలికింది ప్రతిష్ఠాత్మక బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం. తిరస్కరించాడు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఐ.ఐ.ఎం., ఐ.ఐ.ఎస్‌.సి. విద్యాసంస్థల్లో సీటొచ్చింది. వదులుకున్నాడు. ఏడాదికి నాలుగున్నర లక్షల జీతమిస్తామన్నాయి విప్రో, కాగ్నిజెంట్‌ కంపెనీలు. చేరలేదు. ఇన్ని అవకాశాల్ని

Eenadu (19-06-11)

చిత్రం
పుస్తకాల సంచి భుజానికేసుకుని బడికెళ్లాల్సిన వయసులో చంకలో ఓ పసిబిడ్డ. మనసు వికసించాల్సిన దశలో...ఒత్తిళ్లూ ఆత్మహత్య ఆలోచనలు. పచ్చగా కాపురం చేసుకోవాల్సిన సమయానికి...విడాకులూ వైధవ్యాలు. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని పలు గ్రామాల్లో బాల్యవివాహాలు ఆడపిల్లల జీవితాల్ని బుగ్గిపాలు చేస్తున్నాయి. ప్ర తిభాపాటిల్‌. భారత రాష్ట్రపతి. సో నియాగాంధీ. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు. సు ష్మాస్వరాజ్‌. లోక్‌సభలో ప్రతిపక్ష నేత. మా యావతి. అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ...తాజా ఎన్నికల్లో మమత, జయలలితల విజయం వార్తావిశ్లేషకులకు చేతినిండా పని కల్పించింది. స్త్రీజాతికి ఇదో స్వర్ణయుగమన్నట్టు ఊదరగొట్టారు. భారతీయ మహిళ వెలిగిపోతోందని కథనాలు అల్లారు. అంతా భ్రమ. అక్షరాల కనికట్టు. వెలుగులు చూసి మురిసిపోవడం కాదు. చికట్లవైపు కూడా తొంగిచూడాలి. రాజధానులు కొలమానాలు కాదు. మారుమూల పల్లెలే తూకంరాళ్లు. ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమే. పేదరికం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు - మూడుపడగల నాగుపామై బుసలుకొడుతున్న మారుమూల గ్రామాల్లో...ఆడపిల్లగా పుట్టి, బాల్యాన్ని గెలవడం అంతకంటే వేయిరెట్లు కష్టం. ఒక సుజాతమ్మ