పోస్ట్‌లు

జులై, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

ఉప్పు..నూనెల్లేని గొప్ప రుచులు

చిత్రం
అధిక బరువు.. దాంతోపాటు వచ్చే అనారోగ్యాల్ని నివారించాలంటే.. వంటకాల్లో ఉప్పు, నూనె తగ్గించాలి. ఇది తెలిసినా.. ఆ భోజనం చప్పగా ఉంటుందని చవులూరించే రుచుల్నే కోరుకుంటాం. కానీ ఉప్పు, నూనె ఏ మాత్రం వాడకుండా కూడా నోరూరించే పదార్థాలను తయారుచేసుకోవచ్చు. వాటినుంచి పోషకాలనూ పొందవచ్చు. పాలకూర అన్నం కావల్సినవి: బాస్మతీబియ్యం- రెండు కప్పులు, పాలకూర రసం- రెండు కప్పులు (పాలకూరను రుబ్బి రసం తీసుకోవాలి), కొబ్బరిపాలు- కప్పు, నీళ్లు- కప్పు, పచ్చిమిర్చి- ఆరు, క్యారెట్‌- ఒకటి (పెద్దది), బఠాణీలు- అరకప్పు(నానబెట్టాలి) యాలకులు- రెండు, అల్లం ముద్ద- అరచెంచా, పాలమీగడ- చెంచా, కరివేపాకు- నాలుగు రెబ్బలు, కొత్తిమీర, పుదీనా - కొద్దిగా. తయారీ: నానబెట్టిన బఠాణీలను ఉడికించుకోవాలి. తాజాగా దొరికితే వాటినే వాడొచ్చు. ఇప్పుడు పొయ్యిపై పాత్ర పెట్టి మీగడ వేసి యాలకులు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముద్ద వేయించాలి. తరవాత పాలకూర రసం, కొబ్బరిపాలు, నీళ్లు, క్యారెట్‌ ముక్కలు, ఉడికించిన బఠాణీ, కొత్తిమీర, పుదీనా ఒకదాని తరవాత ఒకటి చేర్చాలి. రసం మరుగుతున్నప్పుడు కడిగిన బియ్యం వేసి కలిపి సన్ననిమంటపై ఉంచి ఉడకనివ్వాలి. అన్నం పూర

Eenadu Sunday (24-07-2011)

చిత్రం
ఈరోజు 'పేరెంట్స్‌ డే' పిల్లలు పెద్దవుతున్నకొద్దీ... పెద్దలు పసివాళ్లయిపోతారు. బిడ్డల్ని వదిలి ఉండలేరు. ఉన్నా ప్రశాంతంగా బతకలేరు. ఒంటరితనం వేయివైపుల నుంచి దాడిచేస్తుంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఉద్యోగాలు, వేరుకాపురాలు కన్నమమకారానికి కఠిన పరీక్ష పెడతాయి. 'ఎమ్టీనెస్ట్‌ సిండ్రోమ్‌' నడివయసు జీవితాలను సంక్షోభంలో ముంచెత్తుతుంది. కా లింగ్‌బెల్‌ వోగుతుంది. 'వాడే, కాలేజీ నుంచి వచ్చుంటాడు'... తనలో తానే మాట్లాడుకుంటూ తలుపు తీస్తారామె. ప్చ్‌... ఎదురుగా పోస్టుమాన్‌. మళ్లీ బెల్లు వోగినా అంతే ఆశగా తీస్తారు. అది పిచ్చి కాదు. పిచ్చి ప్రేమ. ''అయినా, వారం రోజుల క్రితం అమెరికా విమానం ఎక్కిన కొడుకు అప్పుడే ఎలా తిరిగొస్తాడమ్మా!'' * * * మహానగరం. చిమ్మచికటి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఓ యువకుడు పరుగులు తీస్తున్నాడు. ఎవరో వెంటాడి తరుముతున్నారు. పరుగెత్తిపరుగెత్తి అలసిపోయాడు. నిస్త్రాణంగా నడిరోడ్డుమీదే కూలబడిపోయాడు. అంతలోనే ఓ లారీ రివ్వున దూసుకొచ్చింది. ఆ యువకుడు ఎవరో కాదు, తన బిడ్డ. ఒక్కగానొక్క... 'కెవ్వు'మంటూ కేక. కల. పీడకల. ఒళ్లంతా

Eenadu Etaram (23_07_2011)

చిత్రం
అంతర్జాతీయ వేదికపై మెరిసిన ఆంధ్రా కుర్రాళ్లు! బ్యాంకాక్‌లో అంతర్జాతీయ వేదిక. దేశదేశాల నుంచి వచ్చిన మెరికల్లాంటి యువ ప్రతినిధులు. మన దేశ ప్రతినిధులు అయిదుగురు. అందులో అత్యుత్తమ ప్రతిభ చూపి స్వర్ణ, రజత పతకాలు సాధించిన ఇద్దరు మన రాష్ట్రం వారే. బూర్లె సాయికిరణ్‌, ఇమ్మడి పృథ్వీతేజ్‌. దేశ వ్యాప్తంగా నలభై వేలమందితో పోటీ పడి ఎంపికైన తెలుగు తేజాన్ని చూపిన ఈ ఇద్దరూ ముంబై ఐఐటీలో చేరబోతున్నారు. వారితో 'ఈతరం' ముచ్చటించింది. సిద్ధమయ్యారిలా... సాయికిరణ్‌: ఒలింపియాడ్‌లో రాణించాలనే కోరిక పదోతరగతిలో మొదలైంది. ఐఐటీతోపాటే ఒలింపియాడ్‌ శిక్షణ తీసుకున్నా. దీనికోసం ప్రత్యేకంగా సరదాలేం పక్కన పెట్టలేదు. సినిమాలు వదల్లేదు. పృథ్వీతేజ: ఒలింపియాడ్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఉన్నపుడే నా ఒలింపియాడ్‌ శిక్షణ మొదలైంది. ఐఐటీ కోచింగ్‌తోపాటే ఒలింపియాడ్‌కు ప్రిపేరయ్యా. ఎంపిక తీరిదీ... సాయి, పృథ్వీ: ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ టీచర్‌ ఆధ్వర్యంలో ఏటా నేషనల్‌ స్టాండర్డ్‌ ఎగ్జామినేషన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వాళ్లను ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌కి పంపిస్తారు. ఈసారి ఈ పరీక్షకు

Eenadu Thursday (20-07-11)

చిత్రం
ఆలోచనలకు అద్దండి అందాలు! కొత్త కంపెనీ విశేషాలు... ప్రాజెక్ట్‌ వర్క్‌ వివరాలు... ప్రకటనల రూపురేఖలు... ఆలోచనలకు అందాలు... ఇలా అవసరాలు బోలెడు! వాటిని ఆకట్టుకునేలా మార్చాలంటే? పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్‌ తప్పనిసరి! ఇవన్నీ ఇప్పుడు చాలా సులభం... అందుకు మార్గం ఆన్‌లైన్‌ సర్వీసులే! ప వర్‌పాయింట్‌ ప్రెజంటేషన్‌ అవసరం పడని నెట్‌ యూజర్లు చాలా తక్కువ మంది. అందుకోసం సాఫ్ట్‌వేర్‌లను వెతుక్కోవడం పెద్దపనే. కానీ అవేమీ అక్కర్లేకుండానే అనుకున్న ఆలోచనలకు చక్కని అందాలద్ది, అద్భుతమైన ప్రెజంటేషన్లను సాధ్యం చేసే ఆన్‌లైన్‌ సర్వీసులు చాలా అందుబాటులో ఉన్నాయి. నలుగురితో పంచుకోవడం కూడా చాలా సులభం. పైగా ఇవన్నీ ఉచితం. ఆ హంగుల సంగతులేంటో చూద్దాం! చక్కని వారధి పేరు: EMPRESSR ఇందులో సభ్యులైతే చాలా సులువుగా ప్రెజంటేషన్‌లను సృష్టించుకుని వాటిని సోషల్‌ నెట్‌వర్క్‌ల ద్వారా పంచుకోవచ్చు. ఫ్లికర్‌, గూగుల్‌, యాహూ, ఫేస్‌బుక్‌, ఫొటోబకెట్‌లోని డేటాని నేరుగా సైట్‌ నుంచే యాక్సెస్‌ చేస్తూ ప్రెజంటేషన్స్‌లో వాడుకోవచ్చు. ఇతరులు చేసిన స్త్లెడ్‌షోలను కూడా చూడొచ్చు. ఫొటోలు, మ్యూజిక్‌, వీడియో, ఆడియోలతో స్త్లెడ్‌లను తయారు చేయవచ్చు

Eenadu Etaram (16_06_2011)

చిత్రం
ప్రపంచ విద్యా సదస్సు. దేశ వ్యాప్తంగా పదకొండు మందికి ఆహ్వానం. అందులో ఒకే ఒక తెలుగు తేజం ఎన్నంశెట్టి అఖిల్‌. వేగాన్ని విద్యుత్తుగా మలిచిన ప్రయోగం. వాహనాల కాలుష్యాన్ని తగ్గించే సిద్ధాంతం. ఆ యువకుడి ఆలోచనలకు దక్కిన గౌరవం అది. గ్రా మం, పట్టణం తేడాల్లేకుండా విద్యుత్తు కొరత దేశంలో సాధారణం. ఇదే సమస్య అఖిల్‌ని ఎన్నోసార్లు ఆలోచనల్లో పడేసింది. ఓసారి హైదరాబాద్‌ నుంచి సొంతూరు హన్మకొండకు వెళుతున్నాడు. రైలులో కూర్చున్న అతడి ఆలోచనలు అంతకంటే వేగంగా పరిగెత్తాయి. 'వాహనాల వేగాన్ని విద్యుత్‌గా మార్చలేమా?' అనుకున్నాడు. ఏవేవో పరికరాలు మదిలో మెదిలాయి. ఆపై ఇంట్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా అదే తలపు. తన ఊహల్ని తల్లిదండ్రులు, టీచర్లతో పంచుకున్నాడు. ప్రోత్సహించారు. ప్రయోగానికి కావాల్సిన చిన్న గాలిమర, డైనమో, బ్యాటరీ, బల్బు సిద్ధం చేసుకున్నాడు. తొలుత కారుతో పరీక్షిద్దామనుకున్నాడు. కా రు ముందు భాగంలో గాలిమర అమర్చాడు. సైకిల్‌ డైనమోని దానికి అనుసంధానించాడు. కారు వేగానికి గాలిమర తిరుగుతుంది. ఆ పవన శక్తిని డైనమో విద్యుత్‌గా మార్చుతుంది. ఆ కరెంటు నిల్వ చేయడానికి ఓ బ్యాటరీ ఉంటుంది. నాలుగైదుసార్లు ప్రయత్నించినా

Eenadu Sunday (17-07-2011)

చిత్రం
వైకుంఠపాళిలోనే కాదు...కార్పొరేట్‌ ఆఫీసుల్లోనూ పాములూ నిచ్చెనలూ ఉంటాయి. ఆ పాముల్ని ఎంత ఒడుపుగా తప్పించుకున్నామా, ఆ నిచ్చెనమెట్లు ఎంత వేగంగా ఎక్కగలిగామా అన్నదే కెరీర్‌గేమ్‌లో మన గెలుపోటముల్ని నిర్ణయిస్తుంది. అప్పుడే, క్యాంపస్‌ నుంచి బయటికొచ్చిన యువతీయువకులు...ఫస్ట్‌డే - ఫస్ట్‌షోకు వెళ్లినంత ఉత్సాహంగా ఆఫీసుకెళ్తారా! అంతా కొత్త. బాసు మనసు తెలియదు. సహోద్యోగుల స్వభావం తెలియదు. ఎవరితో మాట్లాడాలో తెలియదు. ఏం మాట్లాడాలో తెలియదు. ఎంత మాట్లాడాలో అంతకంటే తెలియదు. కాలేజీల్లో చెప్పరు. పుస్తకాల్లో రాయరు. సీనియర్లు నేర్పించరు. మరి, ఎవరొచ్చి బోధిస్తారీ కార్పొరేట్‌ భగవద్గీత? వివిధ రంగాల్లో నియామకాలు వూపందుకుంటున్న నేపథ్యంలో... 'ఎల్‌'బోర్డు ట్రైనీ కుర్రాళ్ల కోసం (బొత్తిగా 'ఆఫీస్‌ ఎటికెట్‌' తెలియని ముదుర్స్‌ కోసమూ) కొన్ని చిట్కాలు... 1 నిజావతార దర్శనం కో రి వరించిన ఉద్యోగం. అడగ్గానే సెలవులిచ్చే బాసు. అడక్కపోయినా జీతాలు పెంచే కంపెనీ. అర్థంచేసుకునే సహోద్యోగులు. ఒకటేమిటి, సకల వైభోగాలూ ఉండవచ్చు. అయినా సరే, మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి... ఆ ఉద్యోగం ఇష్టంగానే చేస్తున్నారా

గూగుల్‌ ప్లస్‌ (Eenadu Thursday 14-07-2011)

చిత్రం
గూగుల్‌ మరో అడుగు ముందుకేసింది... కొత్త సోషల్‌ నెట్‌వర్క్‌తో ఆకట్టుకుంటోంది... పేరు 'గూగుల్‌ ప్లస్‌'! ఫే¶¶స్‌బుక్‌కి పోటీ! ఒ కటే జీమెయిల్‌ ఐడీ. కొత్త విండోలోకి వెళ్లక్కర్లేదు. అడ్రస్‌లు కూడా టైప్‌ చేయక్కర్లేదు. క్లిక్‌తో సోషల్‌ నెట్‌వర్క్‌ సిద్ధం అయిపోతుంది. స్నేహితుల 'సర్కిల్‌'... వీడియో ఛాటింగ్‌ల 'హ్యాంగ్‌అవుట్స్‌'... 'పికాసా' ఆల్బమ్‌లు... ఒకటా రెండా అన్నీ 'ప్లస్సే'! అవేంటో వివరంగా తెలుసుకుందాం! ఇలా ప్రవేశించండి జీమెయిల్‌ ద్వారానే గూగుల్‌ ప్లస్‌లోకి వెళ్లాలి. https://plus.google.com లింక్‌లోకి వెళ్లి సైన్‌ఇన్‌ అవ్వడమే. ఇందులో అన్ని నెట్‌వర్క్‌ల్లో మాదిరిగానే ప్రొఫైల్‌ని ఏర్పాటు చేసుకోవాలి. Home, Photos, Profile, Circles విభాగాలతో హోం పేజీ కనిపిస్తుంది. Family, Friends... అంటూ ప్రత్యేక సర్కిల్స్‌ ఉంటాయి. ఉదాహరణకు School friends పేరుతో క్లాస్‌మేట్స్‌ సర్కిల్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎడమవైపు స్నేహితుల ప్రొఫైల్స్‌పై క్లిక్‌ చేసి చూడొచ్చు. స్నేహితులతో సర్కిల్‌ Circles ద్వారా సభ్యుల జాబితా చూడొచ్చు. Find and invite ద్వారా ఆహ్వానం పంపే వ