పోస్ట్‌లు

జూన్, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రజల సన్యాసి! (Sunday Special 17/06/2012)

చిత్రం
ప్రజల సన్యాసి! ఆ కాషాయాంబరధారి ముక్తి గురించి మాట్లాడరు. కోటానుకోట్ల నిరుపేదలకు భుక్తి దొరకాలని ఆకాంక్షిస్తారు. సేవలోనే కైలాసం ఉందంటారు. శ్రమలోనే దేవుణ్ని చూడమంటారు. శివకుమారస్వామి నాయకత్వంలో కర్ణాటకలోని సిద్ధగంగ మఠం...చదువులకు నిలయమైంది. సామాజిక సంస్కరణలకు కేంద్రమైంది. 'బు ద్ధీ! మన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతాల బిల్లు ఇది. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టాలి...'   'బుద్ధీ! మనం నిర్మించాలనుకుంటున్న ఆసుపత్రి ప్లాన్‌. మీరు ఒక్కసారి చూస్తే...'   'అన్నీ ఉన్నాయి. మనశ్శాంతి కరవైపోయింది. మీరే దారి చూపాలి బుద్ధీ!'   'ఈ పూటకు ఏం వండమంటారు బుద్ధీ? పదిహేనువేలమంది భోంచేస్తారని అంచనా'   ...ఎన్నో విన్నపాలు, ప్రార్థనలు, అభ్యర్థనలు.   ఎవరికి ఇవ్వాల్సిన ఆదేశాలు వారికిస్తూ, ఎవరికి అవసరమైన ఉపదేశాలు వారికి బోధిస్తూ చకచకా ముందుకెళ్తారు ఆయన. వెనకాలే, శిష్యులూ సిబ్బందీ పరుగులాంటి నడకతో.   మాటల్లో...ఢమరుక ధ్వని.   చూపుల్లో...త్రిశూల శక్తి.   విభూతిరేఖలు...వైరాగ్యానికి చిహ్నాలు.   కాషాయం...అందరివాడన్న సంకేతం.   అనుభవ చిహ్నంగా వెన్నెముక వంగిపోయింది. సంకల్పం మాత్రం... న

హల్లో స్టూడెంటు! విజయానికి ఇదే రూటు!! (Eetaram 16/06/2012)

చిత్రం
కాలేజీ రోజులంటే... కమ్మని అనుభూతులు... నాణ్యమైన జీవితానికి నిచ్చెన మెట్లు... సరదాలు.. సంతోషాలు.. మరుపురాని జ్ఞాపకాలు... అంతే కాదండోయ్‌! ఆకర్షణల వలలూ.. సమస్యల తోరణాలు.. చిక్కుముడుల సవాళ్లూ ఇక్కడే... మరి ఓ మంచి స్టూడెంట్‌ అనిపించుకోవాలంటే ఏం చేయాలి? జీవితమనే పుస్తకంలో విలువైన పాఠాన్ని ఎలా రాసుకోవాలి? నిపుణులతో సూచనలు ఇప్పిస్తోంది 'ఈతరం'... కాలేజీ ద్వారాలు తెరుచుకుంటున్న తరుణంలో ఈ ప్రత్యేక కథనం! 'ఎ వరి భవిష్యత్తు అయినా నాలుగు గోడల మధ్యే నిర్ణయం అవుతుంది' అంటాడో తత్వవేత్త. ఆ నాలుగు గోడలే వ్యక్తి జీవితంలో కీలకమైన కాలేజీ రోజులు. అనుబంధాలు మొలకెత్తేదీ.. అనుభూతులు వెల్లివిరిసేదీ.. ఈ కళాశాల కార్యక్షేత్రంలోనే. ఓ ఇంజినీర్‌, ఓ ఐఏఎస్‌, ఓ కలాం రూపుదిద్దుకునేది ఈ నాలుగ్గోడల మధ్యే. చొరవగా అడుగెయ్‌! కాలేజీ క్యాంపస్‌.. కొత్త వాతావరణం, కొత్త ముఖాలు. మనసులో గందరగోళం, మాట పెగలదు. మీ ఒక్కరికేనా? అందరిదీ ఇదే పరిస్థితి. నలుగురిలో ఒక్కరమే. కానీ ఆ నలుగురూ మెచ్చేలా ఉంటేనే విజయం. 'నేనసలే పల్లెటూరి పిల్లగాణ్ని! మాట్లాడ్డమెలాగో చేతకాద'ంటూ ముడుచుకుపోతే కుదరదు. అలాగని 'నేనే మ...మ...మ

ట్యాబ్లెట్‌లో బ్రౌజింగ్‌... విహారిణిలు అనేకం!! (Eenadu 21/06/2012)

చిత్రం
ట్యాబ్లెట్‌లో బ్రౌజింగ్‌... విహారిణిలు అనేకం!! ట్యాబ్లెట్‌ కొంటే సరికాదు! వాడకం ముఖ్యం!! సమాచారం వెతకాలన్నా... సోషల్‌ నెట్‌వర్కుల్లో విహరించాలన్నా... బ్రౌజర్లు కావాల్సిందే! పీ సీలో బ్రౌజర్లు... సెల్‌ఫోన్‌లో బుల్లి బ్రౌజర్లు తెలిసినవే. ట్యాబ్లెట్‌కి కూడానా? అన్నారంటే... మీరు వెనకబడినట్టే! ఎందుకంటే బోల్డన్ని అదనపు సౌకర్యాల్ని అందించే ట్యాబ్లెట్‌ బ్రౌజర్లు చాలానే ఉన్నాయి. వాటిని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే బ్రౌజింగ్‌ మరింత సులువు అవుతుంది. అవన్నీ ఉచితం కూడా. మరి, ఆయా ట్యాబ్‌ బ్రౌజర్ల సంగతులేంటో వివరంగా తెలుసుకుందాం!! ఒపేరా ఒక్కటే! పీసీ, మొబైల్‌లోనే కాదు. ట్యాబ్‌లో ఒపేరా బ్రౌజర్‌దే హవా.  Opera Mini Browser గా ట్యాబ్లెట్‌లో ఒదిగిపోతుంది. ఫేస్‌బుక్‌, గూగుల్‌, యాహూ... ఏ వెబ్‌ సర్వీసు యాక్సెస్‌ చేసినా వేగంగా పేజీలను వెతికి తెస్తుంది. డేటా యూసేజ్‌ని కూడా తక్కువ వాడుకుంటుంది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌... లాంటి సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో సమాచారాన్ని సులభంగా షేర్‌ చేసుకునే వీలుంది. ఒపేరా మొబైల్‌ స్టోర్‌ నుంచి కావాల్సిన సర్వీసుల్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎన్‌క్రిప్షన్‌ పద్ధతిలో సురక్షితంగా సైట్‌లను ఓపెన్‌

గిన్నిస్‌... భారత్‌కు వచ్చింది (Eenadu Sunday Magazine 10/06/2012)

చిత్రం
గిన్నిస్‌... భారత్‌కు వచ్చింది గిన్నిస్‌ ప్రపంచ రికార్డుల సంస్థ తాజాగా మన దేశంలో ఓ ప్రత్యేక ప్రతినిధిని నియమించింది. భారతీయుల కోసమే ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ 'ఆల్‌టైమ్‌ రికార్డు' ప్రేమ వెనుక చాలా కారణాలే ఉన్నాయి. గి న్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ భారత దేశంలో డేరా వేసింది. ప్రత్యేకంగా ఇక్కడో ప్రతినిధిని నియమించింది. త్వరలోనే పూర్తిస్థాయి కార్యాలయమూ రాబోతోంది. కాదుకాదు, భారతీయులే పట్టుబట్టి రప్పించుకుంటున్నారు.ఎందుకంటే, గిన్నిస్‌ రికార్డు దరఖాస్తుల్లో మూడొంతులు మనవే. ఆ సాహసం చేద్దామనుకుంటున్నాం, ఈ సాహసం చేద్దామనుకుంటున్నాం - అంటూ మనవాళ్లు పంపే ప్రతిపాదనలు నాలుగేళ్లలో నాలుగువందల రెట్లు పెరిగాయి. రికార్డుల నమోదు 250 శాతం ఎక్కువైంది. గుట్టలకొద్దీ ఈ-మెయిళ్లు, కట్టలకొద్దీ ఉత్తరాలు...సిబ్బందిని ఉక్కిరిబిక్కిరి చేసేవి. గిన్నిస్‌ వెబ్‌సైట్‌ 'క్లిక్‌'లలో భారత్‌ మొదటి వరుసలో ఉంది. ఇక, గిన్నిస్‌ రికార్డుల పుస్తకం అమ్మకాలైతే ఏటికేడాది పెరుగుతున్నాయి. గిన్నిస్‌ మన దేశంలో కాలుపెట్టడం వెనుక ఇన్ని కారణాలు, ఇన్ని వ్యాపార కోణాలు. సంస్థ హెడ్డాఫీసు లండన్‌లో ఉంది. న్యూయార్క్‌, ట

'సైట్' కొట్టు గురూ సినిమా కబుర్లు షురూ!! (Eetaram 09/06/2012)

చిత్రం
పాలూ నీళ్లని వేరు చేయగలమా? కంటిని, చూపుని విడదీయగలమా? సినిమా, కుర్రకారూ అంతే... షూటింగ్‌కి కొబ్బరికాయ కొట్టిన దగ్గర్నుంచి థియేటర్‌లో బ్యానర్లు కట్టి హిట్‌ చేసే వరకూ యువ అభిమానులదే కీలక పాత్ర! అలాంటి ఫ్యాన్స్‌ని ఏ స్టార్లు మాత్రం వదులుకుంటారు? దగ్గరవడానికి ఉన్న దారులన్నీ వెతుకుతారు! అదే బాటలో ఇప్పుడంతా ఆన్‌లైన్‌ మంత్రం జపిస్తున్నారు... ప్రత్యేక వెబ్‌సైట్లు... ఫేస్‌బుక్‌ పేజీలు... ట్విట్టర్‌ ట్వీట్స్‌తో... ఒకటే సందడి చేస్తున్నారు! జోరందుకుంటున్న ఈ ట్రెండ్‌పై 'ఈతరం' కథనం. *  దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి 'ఈగ' సినిమా ప్రకటించాడు. హడావుడి మొదలైంది. ట్రైలర్లు విడుదలయ్యాయి. జోరు మరింత పెరిగింది. ఇప్పుడా ఆసక్తిని ఏమాత్రం తగ్గించకుండా చూస్తోంది, ఆ సినిమా అధికారిక వెబ్‌సైట్‌. ఇప్పటికే ఆ సైట్‌ని లక్షలమంది క్లిక్‌మనిపిస్తే వేల మంది వెబ్‌సైట్‌ పోటీలో పాల్గొంటున్నారు. *  'దమ్ము' సినిమాకి ఎన్టీఆర్‌ సరికొత్త ప్రచారం ఎంచుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవు ఆ సినిమా ఫేస్‌బుక్‌ పేజీ మొదలైంది. ప్రశంసలు, అభిమాన వర్షం కురిసింది. కామెంట్లు పోటెత్తాయి. అడపాదడపా విమర్శలు కూడా. హిట్టా,

బ్యాటరీ ఛార్జింగ్‌ ఇలా అధనం (Eenadu 14/06/2012)

చిత్రం
ఆధునిక ఫోన్‌ వాడుతున్నారా? ఇట్టే ఛార్జింగ్‌ అయిపోతోందా? ఇవిగో చిట్కాలు! పాటించండి! ప్రయోజనం పొందండి! ఎం త మంచి స్మార్ట్‌ మొబైల్‌ ఉన్నా దాంట్లో ఛార్జింగ్‌ లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? నిత్యం ఛార్జర్‌ వెనకే పెట్టుకుని తిరగలేం! ఒకవేళ ఉన్నా అన్ని చోట్లా పవర్‌ అందుబాటులో ఉండదు. అందుకే ఛార్జింగ్‌ని పొదుపు చేసే మార్గాల్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. సులువైన చిట్కాలు, అప్లికేషన్లు చాలానే ఉన్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం! ఇవి తప్పనిసరి! ఎక్కువ 'బ్రైట్‌నెస్‌' పెట్టుకుని మొబైల్‌వాడితే ఛార్జింగ్‌ అంతే సంగతులు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఎక్కువ శాతం స్మార్ట్‌ మొబైళ్లు 'లైట్‌ సెన్సర్‌' సదుపాయంతో బ్రైట్‌నెస్‌ను ఆటోమాటిక్‌గా మార్చేస్తుంటాయి. అంతమాత్రాన బ్యాటరీ ఆదా అయిపోదు. మాన్యువల్‌గా బ్రైట్‌నెస్‌ తగ్గించి పెట్టుకోవాలి.  *  ఎడ్జ్‌, త్రీజీ, వై-ఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌... సర్వీసులతో మొబైల్‌ని వాడుతుంటే ఎక్కువ బ్యాటరీ ఖర్చవుతుంది. వాటిని అవసరం లేనప్పుడు ఆఫ్‌ చేయడం ద్వారా బ్యాటరీ వాడకం తగ్గించొచ్చు. త్రీజీ నుంచి 2జీలోకి మారడం ద్వారా కూడా కొంత ఆదా చేయవచ్చు  *  సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట