పోస్ట్‌లు

నవంబర్, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

బుల్లి అప్లికేషన్లు.. భలే సౌకర్యాలు! (Eenadu_22/11/12)

చిత్రం
ఇంట్లో ల్యాపీ... పీసీ ఉందా? ఉన్న టూల్స్‌నే వాడితే... అవసరాలు అరుదుగా తీరతాయి... మరి కొత్తవేంటో తెలుసుకుంటే? ఇట్టే పనులైపోతాయి! కం ప్యూటర్‌లో పనిని మరింత సులువు చేసేందుకు ఎప్పటి కప్పుడు వచ్చే సరికొత్త అప్లికేషన్లను తెలుసుకోవలసిందే. ఉచితమైనా, అరుదైనవైనా ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఎన్నో సౌకర్యాలను వేళ్లతో నడిపించవచ్చు. అలాంటి వాటిపై ఓ కన్నేద్దామా! కొత్తగా కొన్ని... ఏదైనా ఇమేజ్‌ రిజల్యుషన్‌ తగ్గించాలంటే ఏదో ఒక ఫొటో ఎడిటింగ్‌ టూల్‌పై ఆధారపడాల్సిందే. అలా కాకుండా ఫొటో ఫైల్‌పై రైట్‌క్లిక్‌ చేసి రిజల్యుషన్‌ తగ్గించే మార్గం ఒకటుంది. అలాగే ఫైల్‌ సేవ్‌ చేసిన లొకేషన్‌ పాత్‌ని టెక్స్ట్‌ ఫైల్‌ కూడా పొందవచ్చు. ఫైల్‌పై రైట్‌క్లిక్‌ చేసి పాత్‌ని కాపీ చేస్తే చాలు. వీటిని సాధ్యం చేసేదే  Shell Tools . ఇన్‌స్టాల్‌ చేయగానే రైట్‌క్లిక్‌ మెనూలో అదనపు ఆప్షన్లు కనిపిస్తాయి. 'ఫైల్‌ నోట్‌' ఆప్షన్‌తో నోట్స్‌ రాసుకోవచ్చు. http://goo.gl/yW5i2 తాళం వేయవచ్చు! ఇంట్లో... ఆఫీస్‌ సిస్టంలో ముఖ్యమైన ఫైల్స్‌ని ఇతరులెవరూ చూడకూడదనుకుంటే డెస్క్‌టాప్‌ని 'పేటరన్‌ లాక్‌'తో సురక్షితం చేయవచ్చు.  Eusing Maze Lock  తో

అనగనగా.. ఓ కార్పొరేట్ 'కథ'! (Eenadu_11/11/12)

చిత్రం
అమ్మ చందమామను చూపిస్తూ చెప్పిన కథ, అమ్మమ్మ గోరుముద్దలు తినిపిస్తూ చెప్పిన కథ, తాతయ్య గుండెల మీద కూర్చోబెట్టుకుని చెప్పిన కథ...ఇప్పుడు, కార్పొరేట్‌ హంగులు అద్దుకుంటోంది.మార్కెటింగ్‌ వ్యూహాలు నేర్పించడానికీ విజయ రహస్యాలు బోధించడానికీ ఉపయోగపడుతోంది. కథ-1 అక్బరు చక్రవర్తి దర్బారుకు ఓ గుర్రాల వ్యాపారి వచ్చాడు. తన దగ్గర మేలుజాతి అశ్వాలున్నాయంటూ...వాటి గుణగణాల్ని వర్ణించాడు. పాదుషాకు గుర్రాలంటే మక్కువ. భారీ మొత్తంలో బయానా చెల్లించి...వీలైనంత త్వరగా అశ్వాలను అప్పగించమని చెప్పాడు. వ్యాపారి డబ్బు మూట తీసుకుని వెళ్లిపోయాడు. నెలలు గడిచినా అతని జాడలేదు. బీర్బల్‌కు మొదట్లోనే అనుమానం వచ్చింది. చక్రవర్తి నిర్ణయాన్ని ప్రశ్నించడం సభామర్యాద కాదు కాబట్టి, మౌనంగా ఉండిపోయాడు. కనీసం ఇప్పుడైనా, ఆ సంగతి చెప్పాలనుకున్నాడు. అక్బర్‌ ఉల్లాసంగా ఉన్న సమయం చూసి ...'ప్రభూ! దేశంలోని తెలివితక్కువ వ్యక్తుల జాబితా తయారు చేశాను. మీరూ చూడాలి' అంటూ ఓ పత్రాన్ని చేతిలో పెట్టాడు. తీరా చూస్తే మొదటి పేరు అక్బర్‌దే! ప్రభువులవారికి కోపం వచ్చింది. అయినా, తమాయించుకుని...కారణం అడిగాడు. బీర్బల్‌ గుర్రాల వ్యాపారి మ

కెమెరా కన్నుకి...కొత్త చూపు! (Eenadu_07/11/12)

చిత్రం
వాడేది స్మార్ట్‌ మొబైల్‌! కెమెరా ఉండనే ఉంది! అప్పుడప్పుడు క్లిక్కులు కొడుతుంటారు! మరి, అదనపు హంగులు అద్దుతున్నారా?అందుకు చక్కని చిట్కాలు.. అప్లికేషన్లు ఉన్నాయి! ప్రయత్నిస్తే మీ ఫొటోలు కెవ్వు కేకే! మె గాపిక్సల్స్‌లో కూడిన నాణ్యమైన కెమెరాలు మొబైల్‌లో ఇమిడిపోతున్నాయి. వాటితో ఫొటోలు తీయడమే కాకుండా ఆ కెమెరాకు సరికొత్త సౌకర్యాలు అందించవచ్చని మీకు తెలుసా? ఫొటోని క్లిక్‌ మనిపించగానే అప్పటికప్పుడే వివిధ రకాల బ్యాక్‌గ్రౌండ్‌ డిజైన్లతో ప్రివ్యూ చూడొచ్చు. కొన్ని సందర్భాలకు సంబంధించి వరసగా ఫొటోలు తీయవచ్చు. తీసిన ఫొటోలను సోషల్‌నెట్‌వర్క్‌ల్లో షేర్‌ చేయవచ్చు. ఇలా చాలానే ఉన్నాయి... వివరాల్లోకి దూకండి. మొత్తం 72 ఎఫెక్ట్‌లు! ఆండ్రాయిడ్‌ మార్కెట్లో ఉచితంగా దొరికే  Pudding Camera  ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీ మొబైల్‌ కెమెరా ప్రొఫెషనల్‌ కెమెరా మాదిరిగా మారిపోతుంది. 72 స్పెషల్‌ ఎఫెక్ట్‌లతో ఫొటోలు తీయొచ్చు. మల్టీఫ్రేమ్‌ షాట్స్‌, ఫిష్‌ ఐ, టోయ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయి.  Face Recognition, Grid Feature, Self Camera mode... లాంటి ఆప్షన్లు చాలా ఉన్నాయి. ఎక్కువ ఫొటోలను ఒకేసారి షేర్‌ చేసే వీలుంది. డేట్‌, టైం, ఇమే

'దేశి ఆప్స్!' (మొబైల్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్లు_28/120/12)

చిత్రం
'లోకల్‌ టాలెంట్‌' గ్లోబల్‌గా సత్తా చాటుతోంది. 'మేడ్‌ ఇన్‌ ఇండియా' మొబైల్‌ అప్లికేషన్లు మార్కెట్‌లో మహాసందడి చేస్తున్నాయి. గృహిణులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఔత్సాహిక వ్యాపారులు... 'ఆప్‌ ఎంట్రప్రెన్యూర్స్‌' అవతారం ఎత్తుతున్నారు. అ ర్జెంటుగా యోగా నేర్చుకోవాలి. కానీ, పొద్దున్నే లేవాలంటే బద్ధకం. అవసరానికో ఆప్‌. ఫేర్‌వెల్‌ పార్టీకి చీరకట్టులో వెళ్లాలని కోరిక. కుచ్చిళ్లు ఎలా సర్దుకోవాలో నేర్పడానికి మమ్మీ వూళ్లో లేదు. అభిరుచికో ఆప్‌. హైదరాబాద్‌ కొత్త. ఎటుచూసినా ఇరానీ కేఫ్‌లే. సాంబార్‌ ఇడ్లీ రెస్టారెంట్‌ ఎక్కడుందో వెతుక్కోవాలి. సందర్భానికో ఆప్‌. ఆండ్రాయిడ్‌, సింబియాన్‌, విండోస్‌, ఐవోఎస్‌, బ్లాక్‌బెర్రీ...రకరకాల ఆపరేటింగ్‌ సిస్టమ్‌లకు రకరకాల మొబైల్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్లు (ముద్దుగా...ఆప్స్‌) సిద్ధంగా ఉన్నాయి. కొన్నయితే, మల్టిపుల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ పనిచేస్తాయి. ఆన్‌లైన్‌ దుకాణాల్లో...లక్షలకొద్దీ ఆప్స్‌ ఉన్నాయి. నిమిషానికో కొత్తసరుకు వస్తోంది. పాతవి అప్‌డేట్‌ అవుతున్నాయి. ప్రతి ఆప్‌ వెనుకా...ఓ హీరో! ఆ హీరో (హీరోయిన్లు కూడా) వెనుక బోలెడంత కృషి. ఆ కృ

ట్విట్టర్‌ హిట్ అవ్వాలంటే..(Eenadu_01/11/12)

చిత్రం
సెలబ్రిటీలే కాదు... సామాన్యులు కూడా... ట్విట్టర్‌ని వాడేస్తున్నారు! అప్‌డేట్స్‌తో హల్‌చల్‌ చేస్తున్నారు! మరి మీరు వెనకబడితే ఎలా? అదనపు హంగులతో అదరగొట్టండి! అందుకు ఇవిగో మార్గాలు! ట్వి ట్టర్‌లో పోస్టింగ్‌ అంటే మొబైల్‌ ఎసెమ్మెస్‌ మాదిరిగా కేవలం 140 అక్షరాల్ని మాత్రమే పోస్ట్‌ చేయగలమనో... విశాలమైన భావాల్ని సంక్షిప్తంగా చెప్పాలనో... అనుకుంటే పొరబాటే. కొన్ని ప్రత్యేక యాడ్‌ఆన్స్‌తో ట్విట్టర్‌ని హిట్‌ చేయవచ్చు. అనేక వెబ్‌ సర్వీసులతో పరిధుల్ని చెరిపేయవచ్చు. అదేం పెద్ద క్లిష్టమైన ప్రక్రియేం కాదు. ఎలాగో కాస్త వివరంగా తెలుసుకుందాం! క్రియేట్‌ చేస్తే సరా! సోషల్‌ నెట్‌వర్క్‌ల్లోనో.. మైక్రో బ్లాగింగ్‌లోనో ఎకౌంట్‌ క్రియేట్‌ చేస్తే సరి కాదు. వాటిని ఎప్పటికప్పుడు మానిటర్‌ చేస్తుండాలి. అప్పుడే మీ ఎకౌంట్‌ని సురక్షితం చేసుకోగలరు. అందుకే మీ ట్విట్టర్‌ ఎకౌంట్‌ని ట్రాక్‌ చేసేందుకు  http://twittercounter.com లో సభ్యులైపోండి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 61 మిలియన్ల యూజర్లు వాడుతున్నారు. దీంట్లో సభ్యులవ్వగానే మీ ఎకౌంట్‌ పోస్టింగ్‌ వివరాల్ని, ఫాలోయర్స్‌ని ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తుంది. రోజువారీ నివేదికల్ని పొ