పోస్ట్‌లు

మార్చి, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

శ్రీరామ మార్గం (Eenadu Sunday Magazine 01/04/2012)

చిత్రం
పోలింగ్‌బూత్‌కు బయల్దేరే ముందు రాముణ్ని తలుచుకుంటే, ఎలాంటి నాయకుడికి ఓటేయాలో స్పష్టమైపోతుంది. వృత్తి ఉద్యోగ ధర్మాల విషయంలో డోలాయమానంలో ఉన్నప్పుడు రామాయణాన్ని నెమరేసుకుంటే, చక్కని పరిష్కారం కళ్లముందు కనిపిస్తుంది. టీనేజీ కుర్రకారుకు రామకథ సీడీ బహుమతిగా ఇస్తే, పెద్దల్ని ఎందుకు గౌరవించాలో ధర్మాన్ని ఎలా ఆచరించాలో ఎవరోవచ్చి చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆలూమగల అనురాగానికి సంబంధించి రామాయణం ఓ దాంపత్యవాచకం! సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలకూ సంక్షోభాలకూ రామకథలో పరిష్కారం ఉంది. రామమార్గంలో సమాధానం ఉంది. సూ ర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తే అది ఉత్తరాయణమైంది. దక్షిణం వైపు ప్రయాణిస్తే అది దక్షిణాయనమైంది. అయోధ్యలో మొదలై, మళ్లీ అయోధ్యకు తిరిగొచ్చి జనరంజకంగా పాలించేదాకా... శ్రీరాముడు సాగించిన విలువలయాత్రే రామాయణమైంది. రామకథ వింటే మనసు ఉప్పొంగుతుంది. రాముడిని తలుచుకుంటే తనువు పులకిస్తుంది. ఉత్తరాలైనా రాతకోతలైనా 'శ్రీరామ' నామంతోనే. బిడ్డకు లాలపోస్తూ 'శ్రీరామరక్ష' అనుకుంటే, అమ్మకెంత నిశ్చింత! పల్లెపల్లెకో రామాలయం. ఇంటింటికో రామ్‌, రామారావు, రామిరెడ్డి, రామయ్య! తరాలనా

Eenadu Eetaram (31/03/2012)

చిత్రం
ఒకనాడు... అమ్మ చేసి ఇడ్లీలను వీధుల్లో అమ్మిన గతం! ఈనాడు... ప్రపంచ బ్యాంకు సదస్సులో ప్రసంగించిన వర్తమానం!! గతానికి, వర్తమానానికి మధ్య... అతడు ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం! లక్షల జీతాన్ని వదులుకున్నా... వెక్కిరింపులనే సోపానాలుగా మలుచుకున్నా... వందలాది మంది యువతకు వూతమిచ్చిన విజయం! సమాజహితమే థ్యేయంగా సాగుతున్న నేపథ్యం! న్యూయార్క్‌ సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన అతడితో మాట కలిపింది 'ఈతరం'... ప్ర పంచ బ్యాంకు సదస్సు... మూడువందల మందికి పిలుపు. ముగ్గురికే మాట్లాడే ఆహ్వానం... ఈ అరుదైన అవకాశం చెన్నై యువకుడ్ని వరించింది... మురికివాడల్లోని యువత జీవితాల్లో... వెలుగుల దివ్వెలు పూయిస్తున్న కృషికి ఫలితమది! ఆ యువకుడే శరత్‌బాబు ఎలుములై. 'వ్యక్తిగా, పారిశ్రామికవేత్తగా సమాజంలో కొంచెం మార్పు తేవచ్చు. అదే రాజకీయాల్లో ఉంటే వాటిని మరింత వేగంగా పూర్తి చేయొచ్చు' ముప్ఫై ఒక్క సంవత్సరాల శరత్‌బాబు ఎలుములై అభిప్రాయమిది. రాజకీయాలంటే మురికి కూపంగా భావించే దేశంలో ఓ యువకుడు ఇలాంటి ఆలోచన కలిగి ఉండటం దమ్మున్న విషయమే. ఇదే అభిప్రాయం ప్రపంచ బ్యాంకు సమావేశంలో వ్యక్తం చేసినపుడు అభినందనలు వెల్లువెత్తాయి. గుడి

పాత బంగారులోకం (Eenadu Sunday Magazine 25/03/2012)

చిత్రం
పాతకార్లూ పాతబైకులూ పాత ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలూ పాత సెల్‌ఫోన్లూ పాత లాప్‌టాప్‌లూ... ఒకరు వద్దనుకున్న వస్తువులను మరొకరు అపురూపంగా కళ్లకద్దుకుంటారు. ఇక్కడ పాత రోత కానేకాదు. వేలకోట్ల వ్యాపారం! మ నసు కారుకొనమని వూరిస్తుంది. పరిస్థితి ఆటోలోనే వెళ్లమని ఆర్డరేస్తుంది. కోరిక ఐఫోన్‌ కావాలంటుంది. పర్సు అయ్యబాబోయ్‌ అని వాపోతుంది. శ్రీమతి సరికొత్త ఫ్రిజ్‌ మీద మనసు పారేసుకుంటుంది. నెలసరి వాయిదాలతో శ్రీవారి బుర్ర వేడెక్కిపోతుంది. అబ్బాయికి బైక్‌. అమ్మాయికి లాప్‌టాప్‌. కుటుంబానికంతా ఓ ఎల్‌సీడీ టీవీ. అర్జెంటుగా కావాలి. అవసరాలు అనంతాలు. కోరికలు అనంతానంతాలు. మధ్యమధ్యలో విలాసాల వూరింపులు. పాపం! మధ్యతరగతి మనిషి ఎలా నెగ్గుకొస్తాడో, ఎప్పుడు ఒడ్డున పడతాడో. ఇదీ నేపథ్యం. ఇప్పుడేం చేద్దాం! 'టు పర్చేజ్‌ ఆర్‌ నాట్‌ టు...' అని గిరీశంలా ఏకపాత్రాభినయం వేసుకోవాలా? 'ఏమీసేతురా లింగా...' అంటూ గోసాముల్లా తత్వం పాడుకోవాలా? పరిస్థితులతో రాజీపడాలా? కోరికలకు ఎగనామం పెట్టాలా? మధ్యేమార్గం... 'త్రిశంకు మార్కు' పరిష్కారం. సరికొత్త వస్తువును కొనలేనప్పుడు, కాస్త నాణ్యమైన పాత సరుకునే ఎ

Eenadu Eetaram (17/03/2012)

చిత్రం
విభిన్నంగా.. విజయపథంలో! ఉద్యోగం... వ్యాపారం... అభిరుచి... దారి ఏదైనా భిన్నంగా ఉండాలి... విజయాలు వాటంతట అవే వస్తాయి... ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాయి... కాస్త సమాజ హితం కూడా తోడైతే... ఇతరులకు స్ఫూర్తిగా నిలవొచ్చు... ఇదే నమ్మకంతో దూసుకెళుతున్నారు కొందరు యువ తరంగాలు... వాళ్లతో మాట కలిపింది 'ఈతరం'. ఆంధ్రా స్పైడర్‌మ్యాన్‌ 'నలుగురికి నచ్చింది నాకసలే నచ్చదు' అనే టైపు హైదరాబాద్‌ కుర్రాడు  యశస్వి మోదుకూరు. ఓసారి యూట్యూబ్‌లో 'పార్కోర్‌' క్రీడ చూశాడు. అప్పట్నుంచి అతడికదే లోకం. క రాటే, జిమ్నాస్టిక్స్‌లాగే పార్కోర్‌ ఓ ఆట. యశస్వి మాటల్లో చెప్పాలంటే 'ఇట్స్‌ నాట్‌ ఎ స్పోర్ట్‌... ఇట్స్‌ యాన్‌ ఆర్ట్‌'. ఏ ఆధారం లేకుండా గోడలు ఎక్కేయడం, నిలుచున్నచోటే కళ్లు తిప్పుకోలేని విన్యాసాలు చేయడం, పెద్దపెద్ద అడ్డంకుల్ని అమాంతంగా దూకేయడం పార్కోర్‌ ప్రత్యేకతలు. ఇంగ్లండ్‌, జపాన్‌, అమెరికాల్లో బాగా ప్రాచూర్యంలో ఉన్నా ఇండియాలో ఈ కళని అభిమానించి, ఆరాధిస్తున్నవాళ్లు చాలా తక్కువమంది. అక్కడైతే తరచూ పోటీలు జరుగుతుంటాయి. ఇందులో ప్రెసిషన్‌, క్యాట్‌లీప్‌, వాల్‌రన్‌, డైనో, వాల్ట్స్‌, మంకీ వాల

జలసంక్షోభం (Eenadu Sunday Magazine 19/03/2012)

చిత్రం
జలసంక్షోభం నీళ్లసీసాల్ని బ్యాంకు లాకర్లో దాచుకోవాలి. లేదంటే, ఏ దొంగలో ఎత్తుకెళ్తారు. నిండుబిందెల్ని నేలమాళిగల్లో భద్రపరుచుకోవాలి. లేదంటే, ఏ దోపిడీ ముఠాలో దోచుకెళ్తాయి. ఇదంతా కల్పన కాదు. తరాల నిర్లక్ష్యానికి త్వరలోనే మనం చెల్లించబోతున్న మూల్యం. పురోగమనం... జలవనరుల్ని వెతుక్కుంటూ మనిషి సాగించిన ప్రయాణమే...నాగరికత. నీటి ప్రాధాన్యం తెలుసుకోవడం మానవ వికాస చరిత్రలో ఓ మైలురాయి. ఆ గలగలల వెంబడే పరిగెత్తాడు. నదీతీరాల్లో నివాసాలు కట్టుకున్నాడు. పంటలు పండించాడు. కార్ఖానాలు నడిపాడు. సరుకుల్ని ఓడలకెత్తించి వర్తకం చేశాడు. అక్షరాల్ని కనిపెట్టాడు. ఆలోచనల్ని విస్తరించుకున్నాడు. సృష్టిమూలాలపై ఆసక్తి పెంచుకున్నాడు. తెలియని శక్తికి దేవుడని పేరుపెట్టాడు. నీటికి దైవత్వాన్ని ఆపాదించాడు. ప్రవాహాల పక్కనే పుణ్యక్షేత్రాలు కట్టాడు. జలసంపద ఉందంటే, సకల సంపదలూ ఉన్నట్టేనని భావించాడు. జలమే బలం. జలమే జయం! తిరోగమనం.. జీవనదులు కళతప్పాయి. చెరువులు రియల్‌ఎస్టేట్‌ వెంచర్లుగా మారాయి. కుంటలు కనిపించకుండా పోయాయి. భూగర్భం...గర్భవిచ్ఛిత్తికి గురైంది. పాతాళానికి పైపులేసినా...చుక్క నీరు కూడా దొరకదు. గొంతెండిపోతోంది. పంటె