పోస్ట్‌లు

అక్టోబర్, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

టెక్నాలజీతో... కాలానికి కళ్లెం! (Eenadu_18/10/12)

చిత్రం
ఉరుకుల పరుగుల జీవితం... రెండు చేతులు చాలనంత వేగం... ఈ నేపథ్యంలో సాంకేతికత తెలిస్తే... చిటికెలో పనులు చక్కబెట్టవచ్చు! భు జానికో ల్యాప్‌టాప్‌ బ్యాగు... చేతిలో ట్యాబ్లెట్‌... జేబులో మొబైల్‌... అన్నీ ఉంటాయి. కానీ, రోజు గడిచి ఇంటికొచ్చాక 'ఏంటో ఎంత ట్రై చేసినా రోజులో చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయి!' అనుకునే కోవలోకి మీరు వస్తారా? అయితే, మీరు టెక్నాలజీని సరిగా వాడుకోవట్లేదన్నమాట. ఉన్న గ్యాడ్జెట్స్‌్‌ సాయంతో మరింత సులువుగా పనులు చేసుకోవాలంటే కొన్ని కిటుకులు తెలియాలి. వెంటే వెబ్‌ సర్వీసులు రోజులో ఏయే పనులకు ఎంత సమయం కేటాయిస్తున్నామో, ఎక్కడ సమయం వృథా అవుతోందో లాంటి వివరాలను విశ్లేషించుకోవాంటే www.toggl . com  లోకి వెళ్లాలి. ఈ టైం ట్రాకింగ్‌ సర్వీసును పీసీ, మ్యాక్‌, మొబైల్‌, ట్యాబ్లెట్‌ల్లో వాడుకోవచ్చు. దీంట్లో సభ్యులై చేయాల్సిన పనుల్ని జాబితా పెట్టుకుని వాటిపై ఎంతెంత సమయం కేటాయిస్తున్నామో ట్రాక్‌ చేయవచ్చు. *  వేర్వేరు సోషల్‌ నెట్‌వర్క్‌లను ఒకేచోట యాక్సెస్‌ చేయాలంటే అందుకు ఓ వేదిక సిద్ధంగా ఉంది. అదే http://hootsuite.com. దీంట్లో సభ్యులై ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ ప్లస్‌.. ఎక

hai bujji (Eenadu special for children)

చిత్రం
అనగనగా ఓ అతిథి...త్వరలోనే రాబోతున్నారు...ఆకాశంలో మెరిసిపోనున్నారు...మనకి కనువిందు చేయనున్నారు... ఇంతకీ ఎవరా అతిథి? ఓ తోకచుక్క! *  సూర్యకుటుంబం ఏర్పడిన తర్వాత మిగిలిన మంచు, అంతరిక్ష ధూళి, చిన్న చిన్న రాళ్లు రప్పలతో తోకచుక్కలు ఏర్పడ్డాయి. *  వీటిలో ఒక కిలోమీటరు నుంచి 300 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండేవి ఉన్నాయి. *  వూర్ట్‌క్లౌడ్‌ ప్రాంతంలో సుమారు 1,000,000,000,000 తోకచుక్కలు ఉన్నాయని అంచనా! *  తోకచుక్కల్లో ముఖ్యమైనది హేలీ తోకచుక్క. 76 ఏళ్లకు ఒకసారి కనిపించే ఇది వూర్ట్‌క్లౌడ్‌ నుంచే వచ్చిందని చెపుతారు. మ నింటికి ఓ బంధువు వస్తున్నాడని తెలిసిందనుకోండి. ఎప్పుడు వస్తున్నాడు? ఎలా వస్తున్నాడు? అనే ఆసక్తి కలుగుతుంది కదా! అలాగే మన భూమి దగ్గరకి కూడా ఒక బంధువు త్వరలో రాబోతున్నాడు. ఆ బంధువు ఎవరో కాదు ఓ తోకచుక్క! శరవేగంగా దూసుకువస్తున్న ఈయనగారు తన ప్రయాణంలో భాగంగా భూమికి దగ్గరగా వస్తారు. అప్పుడు ఆకాశంలో రాత్రి వేళ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తారు. ఈయన పేరేంటో తెలుసా '2012 ఎస్‌1'. కెనడాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఈ కొత్త తోకచుక్కను గుర్తించారు. వీరిలో మన భారతీయ సంతతికి చెం

నెట్టింట్లో నేత! యువ స్పందన మోత!! (Eenadu Eetaram_06/10/12)

చిత్రం
నెట్టింట్లో నేత! యువ స్పందన మోత!! గుడ్‌ మార్నింగ్‌ నుంచి గుడ్‌నైట్‌ వరకు... ఆన్‌లైన్‌లో ఒక్కసారైనా 'హలో' అనని యువత అరుదే! దీన్ని గమనించారు యువ రాజకీయ నేతలు... అందుకే ఆన్‌లైన్లో అందర్నీ పలకరిస్తున్నారు! ప్రచారం, వ్యక్తిగతం, అభిప్రాయాలు పంచుకోవడం... ఇలా నెట్టింట్లో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు! అలాంటి కొందరితో మాట కలిపింది 'ఈతరం' ఓ  రాజకీయ నాయకుడు సభ పెడితే ఎంత మంది జనం వస్తారు? వేలు, అరుదుగా లక్షలు! కానీ ఆన్‌లైన్‌లో రోజూ మీట్‌ అయ్యే భారతీయుల సంఖ్య కోటిపైనే. ఎందుకంటే మనదేశంలో సామాజిక అనుబంధాల వెబ్‌సైట్లలో సభ్యులుగా ఉన్నవాళ్ల సంఖ్య పదిహేను కోట్లు. అందులో ఫేస్‌బుక్‌లో ఫేస్‌లు ఉన్నవాళ్లే ఐదుకోట్ల డెబ్భై లక్షలు. ట్విట్టర్‌ ట్వీట్లలో మునిగి తేలేవాళ్లు కోటీ ముప్ఫై లక్షలు. ఆపై గూగుల్‌ ప్లస్‌, ఆర్కుట్లలాంటివి ఉండనే ఉన్నాయి. ఈ నెటిజన్లలో ఎక్కువమంది యూతే. వీళ్లని చేరాలంటే అందర్నీ ఒకచోటికి తరలించే పన్లేదు. తమ సందేశం అందించాలన్నా, అభిప్రాయం చెప్పాలన్నా మైకులు ఊదరగొట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒక్క క్లిక్‌తో, ఒక్క ట్వీట్‌తో, ఒక్క పోస్ట్‌తో దగ్గర కావొచ్చు. ఆ 'పవర్‌' త

గూగుల్‌ గూటిలో...అలరించే పది! (Eenadu Thursday_11/10/12)

చిత్రం
నెట్‌ ఓపెన్‌ చేస్తే...గూగుల్‌లే ముఖద్వారం! మీకు తెలుసా?నిత్యం వాడే గూగుల్‌ గూటిలో...ఎక్కువగా వెలుగులోకిరాని...పది విలువైన సర్వీసులున్నాయి! గూ గుల్‌లోకి వెళ్లగానే సమాచారమో... ఇమేజ్‌లో... వీడియోలో... వార్తలో ఇలా కావాల్సినవి వెతుక్కుని విహారాన్ని కొనసాగిస్తాం. ఇవేం కాకుండా గూగుల్‌లో స్థావరంలో మరికొన్ని ఆకట్టుకునే సర్వీసులు ఉన్నాయి. ఒక్కసారి మీ జీమెయిల్‌లోకి లాగిన్‌ అయితే చాలు. అన్ని సర్వీసుల్ని ఉచితంగా వాడుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వంటల వివరాల్ని ఒకేచోట పొందొచ్చు. గూగుల్‌ మ్యాపింగ్‌తో వేర్వేరు ప్రాంతాల్ని ఎక్స్‌ప్లోర్‌ చేసి మరిన్ని వివరాల్ని మ్యాపింగ్‌లో పొందుపరచొచ్చు. మీ ఆసక్తుల మేరకే బ్రౌజింగ్‌ చేయడం, మెయిల్‌ ఐడీ నుంచి చేసిన పనులను తెలుసుకోవడం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మరి, ఆయా సర్వీసుల సంగతులేంటో వివరంగా తెలుసుకుందాం! క్లిక్‌ చేస్తే ఘుమఘుమలు! ఏదైనా ప్రత్యేక రెసిపీ గురించి తెలుసుకోవాలన్నా, వంటకానికి సంబంధించిన వీడియో చూడాలన్నా... గూగుల్‌ సెర్చ్‌లోకి వెళ్లి కనిపించే లింక్‌లన్నీ వెతకాల్సిన అవసరం లేదు. గూగుల్‌ అందించే ప్రత్యేక అడ్డాలోకి వెళితే సరి

'అరవింద్‌' నేత్రవైద్యం...హార్వర్డ్‌ పాఠం! (Eenadu Sunday_07/10/12)

చిత్రం
  అమెరికా... హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌... ఎంబీఏ తరగతి గది...'డియర్‌ స్టూడెంట్స్‌! ఏ వ్యాపార సంస్థ అయినా బ్యాలెన్స్‌ షీట్‌ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే... సమాజానికి ఏమీ చేయలేదు. సమాజసేవే పరమార్థమనుకుంటే... ఆర్థికంగా నిలదొక్కుకోలేదు, ఎంతోకాలం మనుగడ సాగించలేదు...''సమతూకం సాధ్యం కాదా ప్రొఫెసర్‌!'... ఓ విద్యార్థి అడిగాడు.'తప్పకుండా సాధ్యం అవుతుంది. ఇండియాలోని అరవింద్‌ ఆసుపత్రే అందుకు ఉదాహరణ. ఆ సంస్థ విజయచరిత్రను ఓ కేస్‌స్టడీగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు బోధపడతాయి. ఈరోజంతా ఆ పనిమీదే ఉండండి...'ప్రొఫెసరుగారు సెలవు తీసుకున్నారు. విద్యార్థులంతా గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ మీద పడ్డారు...  aravind   అని టైప్‌ చేస్తూ. స మాజానికి మనమేం ఇస్తున్నాం?పదివేలు సంపాదిస్తున్న వ్యక్తిని అడిగితే 'నెలకో పాతికవేలు సంపాదిస్తున్నప్పుడు ఆలోచిస్తా' అంటాడు. కోటిరూపాయల టర్నోవరు ఉన్న సంస్థను ప్రశ్నిస్తే 'వందకోట్లకు చేరుకున్నాక తప్పకుండా ప్రయత్నిస్తా' అంటుంది. సంపాదన పాతికవేలు దాటాక, ఇంకేవో సాకులు చెబుతాడా వ్యక్తి. వందకోట్ల మైలురాయిని అధిగమించాక... మరేవో మజిలీలు గుర్తుకొస్తా

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)

చిత్రం
ఈ సృష్టి ఒక నాటకరంగం. సకల ప్రాణులూ ఆ జీవన్నాటకంలో పాత్రధారులు. ఏనుగు మొదలు చలిచీమ దాకా... ప్రతి పాత్రా కీలకమైందే. ఏ ఒక్కటి లేకపోయినా వైవిధ్యం దెబ్బతింటుంది. నాటకం రసాభాస అవుతుంది. రేపటి నుంచి హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ఆందోళన కూడా అదే. మ నిషి! మనిషి! మనిషి! ...జీవవైవిధ్య న్యాయస్థానం బిళ్లబంట్రోతు గొంతుచించుకుంటున్నాడు. 'నేనేలేవయ్యా! ఆ మనిషిని' అంటూ చికాకుచికాగ్గా వూబకాయుడూ అధిక రక్తపోటు బాధితుడూ మధుమేహపీడితుడూ అయిన ఓ శాల్తీ బోనెక్కాడు. ముద్దాయిగా నిలబడాల్సి వచ్చిందన్న పశ్చాత్తాపం అతన్లో ఏ కోశానా లేదు. కోటు సర్దుకున్నాడు. టై సవరించుకున్నాడు. టిష్యూపేపరుతో మొహం తుడుచుకున్నాడు. కోర్టుగదిలో ఏసీ లేదన్న చికాకు మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆ తాపానికీ, భూతాపానికీ కూడా తానే కారణమన్న సంగతి మాత్రం మరచిపోయాడు. తెలిసిన మూర్ఖుడంటే మనిషే! సందర్శకుల స్థానంలో... నదులు, సముద్రాలు, అడవులు, పర్వతాలు, పంటపొలాలు దిగాలుగా కూర్చున్నాయి. సకల జీవకోటికీ సాక్షులుగా వచ్చాయవి. మనిషిని చూడగానే జీవరాశి కోపం కట్టలు తెంచుకుంది. వీడే.., ఈ దుర్మార్గుడే, ఈ స్వార్థపరుడే... అంటూ ప

మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్‌ అదిరింది! (Eenadu Thursday_04/10/12)

చిత్రం
మెయిల్‌ ఐడీ...  సర్వీసు ఏదైనా ఒకటి ఉండాల్సిందే... మరి సరికొత్త సౌకర్యాలతో మైక్రోసాఫ్ట్‌ గూటి నుంచి మరోటి వచ్చిందని తెలుసా?అదే హాట్‌ హాట్‌ 'అవుట్‌లుక్‌' అదిరే లుక్స్‌తో అలరిస్తోంది! జీ మెయిల్‌, యాహూ, ఇన్‌, ఏఓఎల్‌... ఇలా చెబుతూ పోతే మెయిల్‌ సర్వీసులు చాలానే. దేని ప్రత్యేకత దానిదే. జాబితాలో మిస్‌ అయిన మైక్రోసాఫ్ట్‌ హాట్‌మెయిల్‌ మరో కొత్త అవతారంతో ముందుకొచ్చింది. అది కేవలం మెయిల్‌ సర్వీసు మాత్రమే కాదు. బుల్లి హార్డ్‌డ్రైవ్‌ లాంటిది కూడా. ఫొటోలు మాత్రమే కాదు. డాక్యుమెంట్‌లు, వీడియోలు, మ్యూజిక్‌ ఫైల్స్‌ని కూడా భద్రం చేసుకోవచ్చు. అంతేనా? ఆఫీస్‌ డాక్యుమెంట్‌లను ఎప్పుడైనా ఎక్కడైనా ఎడిట్‌ చేసుకోవచ్చు. అందుకు అనువైన ఆఫీస్‌ సూట్‌ని మెయిల్‌లోనే యాక్సెస్‌ చేయవచ్చు. ఇలా చెప్పాలంటే చాలానే సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం!! సభ్యులవ్వండి! అన్ని మెయిల్‌ ఐడీల్లో మాదిరిగానే దీంట్లోనూ పేరు వివరాలతో సభ్యులవ్వాలి. హోం పేజీ చాలా భిన్నంగా కనిపిస్తుంది. ప్రధానంగా మెయిల్‌, పీపుల్‌, క్యాలెండర్‌, స్కైడ్రైవ్‌ సదుపాయాల్ని థంబ్‌నెయిల్‌ బాక్స్‌ల్లో నిక్షిప్తం చేశారు. ఇక కంపోజ్‌