పోస్ట్‌లు

జులై, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

హింస ధ్వని! (14/07/13_Sunday magazine)

చిత్రం
హింస ధ్వని! వేలిముద్రల్లో నేరస్థుల ఆనవాళ్లు ఉన్నట్టే...'నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో' వార్షిక నివేదికల్లో రక్తపు మరకల గుర్తులు కనిపిస్తాయి, హాహాకారాల ప్రతిధ్వనులు వినిపిస్తాయి. యముని మహిషపు గంటల సవ్వడిని తలపించే ఆ అంకెల రంకెలివి... వీ ధులన్నీ ఎర్రగా - రక్తంతో కళ్లాపి చల్లినట్టు. చెట్లకు పుర్రెల గుత్తులు. ఎటుచూసినా శవాల గుట్టలు. ట్రక్కులకొద్దీ నోట్ల కట్టలు. ఎక్కడి నుంచో తుపాకుల మోతలు. పత్రికల నిండా చావు రాతలు. ఎవడో దొంగాడు...ముసలమ్మ మెడలోని పుస్తెలతాడు తెంచుకెళ్తున్నాడు. ఇంకెవడో ముసుగు వెధవ, తాళాలు పగులగొట్టి ఇల్లంతా దోచేస్తున్నాడు. డెబిట్‌కార్డు బేబులోనే ఉంటుంది, ఖాతాలోని డబ్బు మాయమౌతుంది. ఇ-మెయిల్‌లో లాటరీ వూరింపులు, ఫేస్‌బుక్‌ నిండా అమ్మాయిల మార్ఫింగ్‌ ఫొటోలు. మన జాగాలో ఏ గూండాలో పాగావేస్తారు. ప్రశ్నించలేం. తిరగబడలేం. ఎవరి నేరాలివి? ఏ ముఠాల ఘోరాలివి? 34వేల హత్యలు, 35వేల హత్యాయత్నాలు, 25వేల అత్యాచారాలు, 27వేల దోపిడీలు - ఇవేం ప్రగతి సూచికలు కాదు. ఏడాది కాలపు పాపాల చిట్టాలు. 2012 సంవత్సరానికి సంబంధించి నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో తాజాగా విడుదల చే

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

చిత్రం
అందరూ...ఇంటర్నెట్‌లో సమాచారాన్ని చూస్తారు, మెయిల్స్‌ చూసుకుంటారు. మహా అయితే వీడియోలు వీక్షిస్తారు. అతి కొద్దిమంది మాత్రం, వ్యాపార అవకాశాల్ని వెతుక్కుంటారు. వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ను 'వరల్డ్‌ వైడ్‌ డబ్బు'గా మార్చుకుంటారు, 'నెట్‌ ఎంట్రప్రెన్యూర్స్‌'గా అవతరిస్తారు. సం స్థ పేరు: పేరేదైనా, చివర్లో 'డాట్‌కామ్‌' తోక. చిరునామా: బెడ్‌రూమ్‌ కమ్‌ ఆఫీస్‌రూమ్‌ కమ్‌ మీటింగ్‌రూమ్‌ కమ్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌. హోదా: మేనేజింగ్‌ డైరెక్టర్‌ కమ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కమ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ కమ్‌ క్లర్క్‌ కమ్‌ ఆఫీస్‌బాయ్‌ మౌలిక సదుపాయాలు: డొక్కు కంప్యూటర్‌, పాత బైకు. వాటాదారులు: ఏక వ్యక్తి సైన్యం. మహా అయితే, ఒకరిద్దరు మిత్రులు. మేధోమథనం: ఇరానీ కేఫ్‌లోనో, కాఫీడేలోనో. ఆఫీసు మెట్ల మీదో, క్యాంపస్‌ చెట్ల నీడనో. లక్ష్యాలు: మార్కెట్‌లో నిలవాలి. జీవితంలో 'సక్సెస్‌' సాధించాలి. * * * s..u..c..c..e..s..s ...అన్న మాటకు అంతర్జాలంలో రకరకాల నిర్వచనాలు ఉంటాయి. ఆ ఆంగ్లాక్షరాల్ని మనం గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో టైపు చేయగానే ఎవరో చెప్పిన విజయ సూత్రాలూ, ఇంకెవరివో గెలుపు చరిత