పోస్ట్‌లు

అక్టోబర్, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

కాశీకి వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన ఏదేని కాయగూరగానీ, ఫలముగానీ, ఏదైనా పదార్థంగానీ వదిలివేయడానికి కారణమేమిటి?

చిత్రం
కాశీకి వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన ఏదేని కాయగూరగానీ, ఫలముగానీ, ఏదైనా పదార్థంగానీ వదిలివేయడానికి కారణమేమిటి? ఈ శరీరాలు, ఇంద్రియాలు, అవయవాలు, బుద్ధి, మనసు... ఇలా అన్నీ పరమాత్మ ఇచ్చినవే. ఆయన ఇచ్చిన వానితో ఆయన సేవే చేయాలి. నాలుకతో నామకీర్తన చేయాలి. మనసుతో ధ్యానం, చేతులతో పూజ చేయాలి. చెవులతో ఆయన కథలనే వినాలి. కన్నులు ఆ స్వామిని, స్వామి భక్తులనే చూడాలి. కాళ్లు దేవాలయాలకు, భక్తుల ఇళ్లకు వెళ్లాలి. నాసిక స్వామి పాదాలపై ఉంచిన తులసిని వాసన చూడాలి. ప్రతి నాలుగు మాటలలో ఒక మాట భగవానునిది కావాలి. ఇలా చేస్తే సంసారంలో ఉన్నా సన్యాసంలో ఉన్నా ఒకటే! కానీ కన్ను, ముక్కు, చెవులు, నాలుకకు ప్రకృతిలో లభించేవే ఇష్టం. మన ఇష్టాల కోసం భగవంతుని వదులుకుంటున్నాం. ఇలా చేస్తే మన ఇష్టాలన్నీ కష్టాలనే కలిగిస్తాయి. బాగా తింటే అజీర్ణం, బాగా అనుభవిస్తే అంటువ్యాధులు.. ఇలా కలుగుతాయి. భగవంతుని వదిలి ఇష్టాలను పట్టుకుని కష్టాల పాలుకాకుండా భగవంతుని కోసం మన శరీరానికిష్టమయ్యే వాటిని వదిలితే మనసు, బుద్ధి, శరీరం ప్రసన్నంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఒక్కసారే అన్నీ వదలటం కష్టం కాబట్టి ఒక్కొక్క క్షేత్రంలో ఇష్టాన్ని విడుస్తూపోతే కోరికలు