పోస్ట్‌లు

జూన్, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

రైతుల కంట పున్నమి పంట

చిత్రం
నేడు ఏరువాక పౌర్ణమి   రైతుల కంట  పున్నమి  పంట భూమిలోని సారాన్ని ఆహారంగా మార్చి, సమాజాన్ని పోషించేది రైతు... మన శరీరాలకు అన్నం రూపంలో ప్రాణశక్తిని  అందించే దైవమాయన... అందుకే రైతులేనిదే రాజ్యం లేదని ఏనాడో గుర్తించారు... ‘మెతుకు పెట్టే రైతన్న బతుకు నిలిపే పెద్దన్న’ అంటూ వర్ణించారు. రైతును, భూమిని, పంటను, పశువును పూజించడం భారతీయ జీవన విధానంలో ముఖ్య భాగాలు..  అన్నదాత తల్లిలా పూజించే భూమికి మొక్కి సాగుకు శ్రీకారం చుట్టే అద్భుత ఘట్టమే ఏరువాక... ప్ర కృతిలో దొరికే పదార్థాలను యథాతథంగా వాడుకునే దశనుంచి వాటిని తయారు చేసుకునే ప్రయత్నం చేశాడు మానవుడు. కూడు, గూడు, గుడ్డ... ప్రతి మనిషికీ నిత్యావసరాలు. ఈ మూడు అవసరాలను తీర్చే ఏకైక మార్గం పంట పండించడం. ఆదిమ దశ నుంచి ఆధునిక దశకి వచ్చిన అతడు దానికి వ్యవసాయం అని పేరు పెట్టాడు. కృషి, సాగు లాంటివి దానికి సమానార్థకాలు. వ్యవసాయ సంబంధ పనులు చేసేవారిని రైతు, కర్షకుడు, హాలికుడు, వ్యవసాయదారుడు... ఇలా ఎన్నో పేర్లతో పిలిచారు. పాడిపంటలు ఏ ఆర్థికవ్యవస్థకైనా పునాదుల్లాంటివి.  తొలిసారిగా తన పొలాన్ని దున్ని సాగుకు సిద్ధం చేసుకోవడం రైతు జ...