Eenadu Sunday (31-07-2011)
ఢిల్లీలో తెలుగు జెండా... ఏపీ భవన్ దేశరాజధానిలో తెలుగు జెండా... ఏపీ భవన్. అక్కడ తెలుగు మాటలు వినిపిస్తాయి. తెలుగు రుచులు వూరిస్తాయి. తెలుగు చాణక్యులు ఆ చెట్ల నీడల్లోనే వ్యూహరచనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు జలుబు చేస్తే ఏపీ భవన్‌కు తుమ్ములొస్తాయన్న మాట అక్షరాలా నిజం అ దిగో ద్వారక..'పడకసీను పద్యం విన్నంత ఆనందం- అల్లంతదూరంలో ఏపీ భవన్ కనిపించగానే. ఢిల్లీ మహానగరంలో అడుగుపెట్టినప్పటి నుంచీ ఒక్క తెలుగువాడైనా కనిపించకపోతాడా, ఒక్క తెలుగు మాటైనా వినిపించకపోతుందా అని ఆశపడేవారికి 'ఆంధ్రప్రదేశ్ భవనము'... గుండ్రటి తెలుగక్షరాల బోర్డు సున్నుండల డబ్బాలా అనిపిస్తుంది. ఏపీ భవన్‌కు చేరుకున్నామంటే బోలెడంత ధైర్యం. కొండంత భరోసా. 'ఏమండీ! ఎలా ఉన్నారు?' 'తమ్మీ! ఎప్పుడొచ్చినవే!' 'ఏమప్పా! రైలుకొచ్చినావా, ఫ్త్లెటుకొచ్చినావా' మాండలికాల మట్టివాసన గుబాళిస్తుంది. ఆవరణకు ఆనుకునే మహానుభావుడు టంగుటూరి ప్రకాశంపంతులు నిలువెత్తు విగ...