పోస్ట్‌లు

ఏప్రిల్, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

విహారయాత్రకు వెళ్తున్నారా? ఈ ఆప్‌లు సర్దుకోండి! (Eenadu 20.04.17)

చిత్రం
వేసవి వచ్చేసింది కదా... ఇంట్లో పిల్లలకు సెలవులు కూడా వచ్చేసుంటాయి! ‘ఎక్కడికైనా సరదాగా వెళ్లొద్దామండీ’ అనే మాట ఇంట్లో వినిపిస్తుంటుంది. స్నేహితులైతే ‘ఎప్పటి నుంచో అనుకుంటున్నాం... ఈ సారైనా టూర్‌కి వెళ్దాం’ అంటుంటారు. ఇంకెందుకు ఆలస్యం... టికెట్‌లు బుక్‌ చేసేయండి, సామాన్లు సర్దుకోండి, విహారయాత్రకు సిద్ధమైపోండి! అదేమంత చిన్న విషయమా అంటారా? ఈ ఆప్‌లు, వెబ్‌సైట్ల గురించి తెలుసుకుంటే మీ టూర్‌ ప్రణాళిక చిటికెలో అయిపోతుంది! అవేంటో, వాటి ఆప్షన్లేంటో చూద్దాం! ఎవరేం చెప్పారు... అక్కడేం బాగున్నాయి   ఎ క్కడికైనా టూర్‌కి వెళ్తున్నాం అంటే... గతంలో ఆ ప్రాంతాన్ని చూసి వచ్చిన వారి నుంచి సమాచారం సేకరిస్తాం. అక్కడ ఏం బాగుంటాయి, ప్రత్యేకతలు ఏంటి, ఏ హోటల్‌లో దిగమంటారు లాంటి విషయాలు విచారిస్తాం. అంతర్జాలంలోనూ ఇలాంటి సమాచారం అందించే వెబ్‌సైట్‌ ఒకటి ఉంది. అదే  www.travelistly.com. మీరు వెళ్లాలనుకుంటున్న నగరం/దేశం పేరును ఇందులో ఎంటర్‌ చేస్తే... అక్కడికి గతంలో వెళ్లినవారు తమ వెబ్‌సైట్లు/బ్లాగుల్లో రాసుకున్న సమాచారాన్ని క్రోడీకరించి అందిస్తుంది. అక్కడి వాతావరణం, ఆహార పదార్థాలు, చూడాల్సిన ప్రాంతాల ...