ఉగ్రపోరుకు సాంకేతిక దన్ను
ఉగ్రపోరుకు సాంకేతిక దన్ను ఆక్టోపస్, ఎన్‌ఎస్‌జీ విభాగాల అమ్ముల పొదిలో అత్యాధునిక ఆయుధాలు ముష్కరులపై పోరులో మానవ రహిత యుద్ధ పరికరాలు యుద్ధంలో శత్రువును కట్టడి చేయాలంటే వ్యూహం ముఖ్యం. మన జాడ తెలియకుండానే శత్రువు కదలికలు, ఆనుపానులు పసిగట్టగలిగితేనే వ్యూహం అమలుచేయడం సులభమవుతుంది. దాడికి అవసరమైన వ్యూహాత్మక ఆయుధాలు మన దగ్గర ఉంటే... శత్రువును మట్టుబెట్టగలగడమే కాదు...మనవైపు తక్కువ ప్రాణనష్టంతో విజయం సాధించొచ్చు. ఇప్పుడు ఉగ్రవాదులపై పోరులో సాంకేతిక ఆయుధాలు భద్రతాబలగాల చేతిలో కీలక అస్త్రాలుగా మారుతున్నాయి. భద్రతాబలగాలు, సామాన్య ప్రజానీకం ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా కేవలం ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించడంలో ఈ తరహా ఆయుధాలు ఉపయోగపడతాయి. ఒకప్పుడు అమెరికా వంటి అభివృద్ధి చెందిన విదేశాలకే పరిమితమైన ఇలాంటి అత్యాధునిక ఆయుధాలు ఇప్పుడు ఎన్‌ఎస్‌జీ, ఏపీ, తెలంగాణ ఆక్టోపస్ విభాగాలు సమకూర్చుకున్నాయి. వాటి వద్దనున్న వివిధ రకాల ఆయుధాలు, వాటి ప్రత్యేకతలు, పనితీరు ఇలా.. బ్లాక్ హోర్నెట్ నానో యూఏవీ ఈ బుల్లి మానవరహిత విమానం బరువు: 16 గ్రాములు గరిష్ఠ వేగం: గంటకు 11 కిలోమీటర్లు దీనిలోని కెమెర...