ఉగ్రపోరుకు సాంకేతిక దన్ను
ఆక్టోపస్, ఎన్‌ఎస్‌జీ విభాగాల అమ్ముల పొదిలో అత్యాధునిక ఆయుధాలు
ముష్కరులపై పోరులో మానవ రహిత యుద్ధ పరికరాలు
ఈ బుల్లి మానవరహిత విమానం బరువు: 16 గ్రాములు గరిష్ఠ వేగం: గంటకు 11 కిలోమీటర్లు దీనిలోని కెమెరాలు: 3 * నిమిషాల వ్యవధిలో ఆకాశంలోకి పంపొచ్చు. విపత్కర వాతావరణ పరిస్థితులలోనూ ఎగురుతాయి. * శత్రుస్థావరాల్లోకి, ఉగ్రమూకలు మాటేసిన ప్రదేశంలోకి పంపించవచ్చు. * దీనిలోని కెమెరాలు శత్రువుల కదలికలు, స్థావర స్థితిగతులను పసిగట్టి వాటికి సంబంధించిన చిత్రాలు, దృశ్యాలను దాన్ని రిమోట్‌తో నడిపించే భద్రత బలగాల కమాండోలకు చేరవేస్తుంది.
ఎప్పుడు ఉపయోగిస్తారంటే..
ఏదైనా బహుళ అంతస్తుల భవనంలో ఉగ్రవాదులు చొరబడి, అందులో ఉన్న వారిని బందీలుగా చేసుకున్నప్పుడు లోపల ఎంతమంది ఉగ్రవాదులున్నారు? ఎక్కడెక్కడ ఉన్నారు? వారి చేతిలోని ఆయుధాలు? ఎంత మంది బందీలుగా ఉన్నారు? అనే అంశాలను ఈ బుల్లి విమానం పంపించే చిత్రాలు, దృశ్యాల ద్వారా తెలుసుకుని వాటి ఆధారంగా ఆపరేషన్ వ్యూహాలు రూపొందించుకుంటారు. |
తయరీ దేశం: ఇజ్రాయెల్ ఉండే పరికరాలు: ఓ కెమెరా మానిటర్, కెమెరాలు, టాక్టికల్ లైట్ లక్ష్యం తీరు: 50 మీటర్ల రేంజిలో పనిచేస్తుంది * ఈ ప్యాక్‌ను వెనుక వైపున తగిలించుకుని నిర్దేశిత మీటలు నొక్కితే చాలు సెకన్ల వ్యవధిలో భారీ భవంతులపైకి ఎగరవచ్చు.
ఉపయోగపడుతుందిలా..
బహుళ అంతస్తుల భవనాల్లో ఏదో ఒక గదిలో దాక్కొని కాల్పులు జరిపే ముష్కరులను ఎదుర్కొనే క్రమంలో ఇది అత్యంత కీలకం. ఎత్తయిన భవనాల పైకి చేరడంలోనూ...ఆ భవనాలపై వాలుగా నడవడం, వాల్‌డ్రాప్, స్పైడర్ టెక్నిక్, స్పీడ్ డ్రాపింగ్, బంగీ జంప్ వంటి వాటికోసం కమాండోలు ఉపయోగిస్తారు. భవనం లోపల ఉన్న ఉగ్రవాదులను గుర్తించి దాడి చేయడం, బందీలను సురక్షితంగా కాపాడటం కోసం. |
తయారీ దేశం: ఇజ్రాయెల్ గరిష్ఠ వేగం: గంటకు 3 కిలోమీటర్లు * క్లిష్ఠ వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయడం. * వాలు ప్రాంతాల్లోనూ సులువుగా ప్రయాణించడం * లక్ష్యాన్ని నిర్దేశిస్తే అత్యంత కచ్చితంగా, వేగంగా ఈ రోబోలో అమర్చిన పిస్తోలు ద్వారా కాల్పులు జరిపి ఉగ్రమూకలను మట్టుబెడుతుంది. * 360 డిగ్రీల కోణంలో చీకట్లోనూ స్పష్టంగా దృశ్యాలను చిత్రీకరించగలిగే 8 కెమెరాలు. * సంభాషణలు సాగించేందుకు అవసరమైన ఆడియో, వీడియో పరికరాలు. * కాల్పులు జరిపినా చెక్కుచెదరని పరిస్థితి.
ఏ సమయంలో ఉపయోగిస్తారంటే..
ఏదైనా బహుళ అంతస్తుల భవనంలోకి ముష్కరులు చొరబడి అక్కడున్న వారిని బందీలుగా చేసుకుంటే.. లోపల ఏం జరుగుతుందో, ఉగ్రవాదుల కదలికలు ఎలా ఉన్నాయో గుర్తించడం, అవసరమైతే వారికి లొంగిపోమని హెచ్చరికలు జారీ చేయడం, అనువు చూసుకుని మట్టుబెట్టడం కోసం వినియోగిస్తారు. ఈ రోబోను నడిపించే వ్యక్తి చేతిలో ఉండే స్క్రీన్‌పైన భవనం లోపల జరిగే ప్రతీ దృశ్యమూ కనిపిస్తుంది. వాటి ఆధారంగా వ్యూహాలు రూపొందించుకుంటారు. |
తయారీ దేశం: అమెరికా * వైర్‌లెస్ కమ్యూనికేషన్ ద్వారా.. * బాంబులను గుర్తించి నిర్వీర్యం చేయడం. * అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయడం.
ఉపయోగించేది..
ఈ రోబోల వల్ల ప్రాణనష్టం గణనీయంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. వీటిలో బాంబులను అమర్చి శత్రుస్థావరాలపై దాడి చేయొచ్చు. ఉగ్రవాదులను మట్టుబెట్టొచ్చు. అమెరికాలోని డల్లాస్‌లో మికా జాన్సన్ అనే దుండగుడిని మట్టుబెట్టేందుకు తొలిసారిగా ఈ రోబోను ఆ దేశ భద్రత బలగాలు ఉపయోగించాయి.
జాగిలాలు..
ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ వద్ద ఉన్న జాగిలాల్లో రాంబో, టైగర్, చీతా అనేవి ప్రత్యేకం. బహిరంగ ప్రదేశాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపే ఉగ్రవాదులను నియంత్రించి వారిపైన దాడులు చేయడంలో ఈ జాగిలాలది ప్రత్యేక పాత్ర. అక్కడ ఎంత మంది ఉన్నా, ముష్కరులు ఎవరో గమనించి వారిపైకి ఒక్క ఉదుటన దూకి వారిని నియంత్రిస్తాయి. అత్యంత ప్రముఖులను ఉగ్రవాదుల చెరనుంచి విడిపించే క్రమంలోనూ ఇవి ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకుని దాడి చేయగలవు.
- ఈనాడు, అమరావతి
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి