పోస్ట్‌లు

డిసెంబర్, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆ నాలుగు అడుగులు

చిత్రం
పరుగుపందేన్ని చూసేవాళ్లు ఓ విషయం గమనించి ఉంటారు. లక్ష్యం దిశగా వేలాది అడుగులు వేసినా.. కేవలం ఓ నాలుగైదు అంగలే గెలుపుని నిర్ణయిస్తాయి. పిల్లలు తప్పటడుగులు వేయడానికి ముందు కూడా ఇదే జరుగుతుంది. పాదాలు తాటిస్తూ వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వాళ్లకి నడకనిచ్చేవి మాత్రం ఓ నాలుగడుగులే! 2017లో మన శాస్త్ర-సాంకేతిక ప్రపంచం సాగించిన నడకలో.. ఈ నాలుగు అడుగులూ అలాంటివే. చరిత్రలో నిలిచిపోదగ్గవే! భవిష్యత్తు మానవులు స్మరించుకునేవే! సంచిలోనే.. అమ్మకడుపు చల్లదనం ప రీక్షా నాళికలో వీర్యకణాన్నిచేర్చి.. అండాన్ని పండించడం యాభై ఏళ్లకిందటే చేశాం. నెలలు నిండకముందే బిడ్డ పుడితే ఇన్‌క్యూబేటర్‌లో పెట్టి బతికిస్తున్నాం. అదీ ఎనిమిది నెలలోపైతే సమస్య లేదు. ఆరు నుంచి ఏడునెలల శిశువైతే అష్టకష్టాలు పడాలి. ప్రపంచంలో శిశుమరణాలు ఎక్కువగా నమోదయ్యేది కూడా ఈ దశలోనే. ఆ సమస్యని అధిగమించేందుకే తల్లిగర్భసంచి బ్యాగుని సృష్టించగలిగారు అమెరికా ఫిలడెల్ఫియాలోని ఓ పిల్లల ఆసుపత్రి వైద్యులు. జీవసంచి(బయోబ్యాగ్‌) అని పిలుస్తున్న ఇందులో.. శిశువులు సురక్షితంగా సేదదీరగల ద్రావణం ఉంటుంది. ఇందులో 105 రోజుల ఎదుగుదల ఉన్న గొర్రెపిల్లని ఆరో...