కిక్కిచ్చే క్రీడల స్నాక్స్.. ఇవిగో!
కిక్కిచ్చే క్రీడల స్నాక్స్.. ఇవిగో! క్రీడాకారులు ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలి. దాని కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా క్రీడా ప్రాంగణం లేదా జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. ఎక్కువ సమయం జిమ్‌లో కసరత్తులు చెయ్యాలంటే తగిన శక్తి అవసరం. ఇలాంటి సమయంలో ప్రొటీన్లతో కూడిన ఆహారం ఎంతో అవసరం. శక్తిని కోల్పోకుండా దృఢంగా ఉండాలంటే రోజువారి తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి! కమ్మని కాఫీ కాఫీ తాగడం వలన ఉత్సాహం రెట్టింపు అవుతుందని యూనివర్శిటి ఆఫ్ జార్జియా శాస్త్రవేత్తలు ప్రయోగాల ద్వారా నిర్థారించారు. ఇది అథ్లెట్స్‌కి శక్తినిస్తుందని చెబుతున్నారు. క్రీడాకారులు కసరత్తులు చేయడానికి వెళ్లే ముందు కప్పు(75-200 మిల్లి గ్రాముల) కాఫీ తాగితే ఉన్న శక్తితో పొలిస్తే 24శాతం శక్తి పెరుగుతుందని వారు నిర్థారించారు. కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిదేనంటున్నారు. చక్కటి చాక్లెట్ రోజూ డార్క్ చాక్లెట్ తినడం మంచిదేనంటున్నారు కింగ్‌స్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. వీరు సైక్లింగ్ చేసే యువతపై ప్రయోగాలు జరిపి తెలుసుకున్నారు. డార్క్ చాక్లెట్ తీసుకోని వారికన్నా అది తీసుకున్న వా...