పోస్ట్‌లు

డిసెంబర్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ChatGPT - Google: గూగులమ్మకు కొత్త గుబులు

చిత్రం
గూగుల్‌... ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్‌ ఇంజిన్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌, మ్యాప్స్‌లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. Updated : 30 Dec 2022 సవాలు విసురుతున్న ‘చాట్‌జీపీటీ’ కృత్రిమ మేధతో సరికొత్త ఆవిష్కరణ గూగుల్‌... ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది! ప్రపంచంలో ఏ మూలనైనా సెర్చ్‌ ఇంజిన్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌, మ్యాప్స్‌లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో గూగులమ్మ భాగమైపోయింది. ఏ సందేహం వచ్చినా గూగులమ్మను అడగటం పరిపాటైంది. అలాంటి గూగులమ్మ ఇప్పుడు అప్రమత్తం కావల్సిన దశ వచ్చింది! తన అస్థిత్వానికి ముప్పు వాటిల్లుతుందా అని గూగుల్‌ ఆందోళన చెందుతోంది. కారణం- సాంకేతిక ప్రపంచంలో వచ్చిన సరికొత్త ఆవిష్కరణ- చాట్‌జీపీటీ! చాట్‌జీపీటీ... కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో తయారైన చాట్‌బాట్‌ గూగుల్‌కు సవాల్‌ విసురుతోంది. ఇంకా సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి రాకుండా, ప్రయోగ దశలోనే రెండు వారాల్లో 10లక్షల మంది యూజర్లను దాటిన ఈ చాట్‌జీపీటీని చూసి గూగుల్‌ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. రెండేళ్లలో ఇది గూగుల్‌ను దాటి పోతుందని అనుకు...