వివాదాల సేతుసముద్రం
వివాదాల సేతుసముద్రం ఓడల ప్రయాణ దూరం తగ్గించేందుకు రామసేతు మీదుగా ‘సేతు సముద్రం షిప్పింగ్ కాలువ’ తేవాలని తమిళనాడు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ ప్రతిపాదనపై తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దాంతో రాజకీయం మరింత వేడెక్కింది... Published : 07 Feb 2023 00:23 IST ఓడల ప్రయాణ దూరం తగ్గించేందుకు రామసేతు మీదుగా ‘సేతు సముద్రం షిప్పింగ్ కాలువ’ తేవాలని తమిళనాడు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ ప్రతిపాదనపై తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దాంతో రాజకీయం మరింత వేడెక్కింది. వివాదాల సేతుసముద్రం దేశీయంగా తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకల మధ్య ఉన్న భూభాగాన్ని రామసేతుగా, ఆడమ్స్ బ్రిడ్జిగా వ్యవహరిస్తున్నారు. దాని మీదుగా ‘సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్’ ప్రాజెక్టును చేపట్టి తీరాల్సిందేనని తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతం గట్టి పట్టు పడుతోంది. ఈ క్రమంలో గతనెల 12న అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. ఇక ఆలస్యం చేయకుండా సేతు సముద్రం ప్రాజెక్టును కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేలా స్టాలిన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంద...