పోస్ట్‌లు

ఒంట్లో గడియారం

చిత్రం
ఒంట్లో గడియారం   గతి తప్పితే ప్రమాదం! జీవితమే ఒక లయ! ప్రతీ దశా క్రమబద్ధమే!! నవ మాసాలు నిండగానే తల్లి కడుపులోంచి బయటపడతాం. మూణ్నెల్లు రాగానే బోర్లా పడతాం, ఏడాది వచ్చేసరికి నిలబడతాం. బాల్యం దాటుతూనే పలకరించే నవ యవ్వనం.. దాంతో పాటు మారిపోయే శరీరం.. అన్నీ లయాత్మకమే. అంతెందుకు? రాత్రవుతూనే నిద్ర ముంచుకొస్తుంది. పొద్దు పొడవగానే మెలకువ వచ్చేస్తుంది. భోజనం వేళకు కడుపులో ఆకలి మంట రగులుతుంది. ఇవన్నీ ఠంచనుగా.. ఏదో గంట కొట్టినట్టుగా.. సమయం ప్రకారం ఎలా జరుగుతున్నాయి? వీటన్నింటినీ వెనక నుంచి నడిపిస్తున్న అదృశ్యశక్తేంటి? అదే మన జీవగడియారం! సర్కాడియన్‌ రిథమ్‌! చీకటి, వెలుతురు.. రాత్రి, పగలుకు అనుగుణంగా సాగే 24 గంటల చక్రభ్రమణం. మన నిద్ర తీరుతెన్నులు, ఆహార అలవాట్లు, హార్మోన్ల ఉత్పత్తి, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత.. ఇలా అన్నింటినీ నియంత్రించే అద్భుత జీవలయ. ఇది సజావుగా పనిచేసినంతవరకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మొరాయిస్తే- నిద్రలేమి, వూబకాయం, అధిక రక్తపోటు, క్యాన్సర్‌ వంటి సమస్యలెన్నో బయలుదేరతాయి. నిజానికి ఈ జీవగడియారం ఉనికి మనకు చాలాకాలం క్రితమే తెలుసు. కానీ ఇదెలా పనిచేస్తుందన్నది మాత్రం తెలియదు. దీని ర...