పోస్ట్‌లు

వచ్చేస్తోంది... అంతం-6

చిత్రం
వచ్చేస్తోంది...  అంతం-6 మనిషి సంఘజీవే కాదు. పర్యావరణ జీవి కూడా! మట్టిలో మట్టిలా.. గాలిలో గాలిలా.. మనిషి కూడా సమస్త జీవజాతుల్లో ఒక జీవే. కాకపోతే మేధోశక్తి పుణ్యమాని తనకు హాని తలపెట్టే ముప్పులను, ఉపద్రవాలను తప్పించుకుంటూ ఒకింత ఆధిపత్యం చెలాయించటం నేర్చుకున్నాడు. ఎక్కడికక్కడ ఆవాసాలను ఏర్పరచుకుంటూ.. అవసరార్థం వస్తు సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడదే ఇతర జీవజాతులకు శాపమవుతోంది. ఆరో భారీ అంతర్థాన ముప్పునకు శరవేగంగా దారితీస్తోంది. దీని మూలంగా 21వ శతాబ్దం మధ్యలోనే ప్రపంచంలోని 75% జీవజాతులు అంతర్థాన ముప్పును ఎదుర్కోవచ్చని.. ఇందుకు మానవ తప్పిదాలే బీజం వేస్తున్నాయని తాజా నివేదిక ఒకటి గట్టిగా హెచ్చరిస్తోంది!   కొ త్త నీరు రావటం, పాత నీరు పోవటం సహజమే. కొత్త జీవుల రాకతో పాత జీవులు కనుమరుగు కావటమూ మామూలే. ఇది మన భూమ్మీద అనాదిగా జరుగుతున్న సృష్టి కార్యమే! అయితే దీనికీ ఒక లయ ఉంది. ఒక వేగముంది. ఏటా 1-5 జీవజాతులు అంతరించిపోతుంటాయి కూడా. కానీ ఇప్పుడు దీని వేగం గణనీయంగా పుంజుకుంది. చెట్లు, మొక్కలు, జంతువుల వంటివన్నీ 100 నుంచి 1000 రెట్ల వేగంతో అంతరించిపోవటం ఆరంభించాయి. మన...

ఆయుర్వేదం - వేసవికాలం

చిత్రం
ఆయుర్వేదం - వేసవికాలం ఎండల్లో... వెన్నెల్లా..! ‘అబ్బ.. ఏం ఎండరా బాబూ! కాసేపటికే చొక్కంతా చెమటతో తడిసిపోయింది’ ‘మార్చిలోనే ఎండలిలా మండిపోతుంటే ఇక మేలో ఎలా ఉంటాయో.. ఏమో?’ మధ్యాహ్నం వేళ పది నిమిషాలు బయటకు వెళ్లివచ్చినా ఇప్పుడు చాలామంది నోట ఇలాంటి మాటలే వినబడుతున్నాయి. అవును.. వేసవి ఆదిలోనే అదరగొడుతోంది. వేడి, ఉక్కపోతలతో పజలను బెంబేలెత్తిస్తోంది. నిజానికి ఇవే కాదు.. వడదెబ్బ, విరేచనాలు, కామెర్ల వంటి పలు సమస్యలనూ వేసవి మోసుకొస్తుంది. అయితే ఆహార, విహార నియమాలతో ఇలాంటి ఇబ్బందులను తప్పించుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఇవి నివారణ చర్యగానే కాదు.. చికిత్సలుగానూ ఉపయోగపడగలవని భరోసా ఇస్తోంది. మరి ఈ వేసవిలో     ఆయుర్వేదం నీడలో చల్లచల్లగా ఎలా గడపాలో తెలుసుకుందాం. ఎండకాలంలో పిత్తదోషం తీవ్రంగా ఉంటుంది. అందువల్ల ఈ కాలం పిత్తదోషం గలవారికి మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది. భా రతీయ సంప్రదాయంలో వాతావరణ పరంగానే కాదు.. ఆరోగ్యపరంగానూ రుతువులకు ప్రత్యేక ప్రాధాన్యముంది. మనకు సంవత్సరానికి 6 రుతువులు, 2 ఆయణాలు. శిశిర, వసంత, గ్రీష్మ రుతువులతో కూడిన కాలాన్ని ఉత్తరాయణంగానూ.. వర్ష, శరద్‌, హే...