యువకలం...కోలాహలం! (06/04/13)
సెల్ చాటింగ్‌కు సై... ఆన్లైన్ కాలక్షేపానికి సిద్ధం... సరదాలకు ముందు... కొత్త గ్యాడ్జెట్స్‌ని రఫ్ఫాడిస్తాం... ఏ కుర్రకారైనా ఇంతేగా? మరి పుస్తకాలు చదువుతారా? అని అడగండి...'అబ్బో... మాకంత తీరికెక్కడిది?' అనేస్తారు! అయితే ఈ తీరును బ్రేక్ చేసే వారూ ఉన్నారు! చదవడమేనా? ఆకట్టుకునే రచనలతో మది దోచేస్తున్నారు...వీళ్ల దృష్టంతా యువతపైనే... అలాంటి కొందరి పరిచయం. పు స్తకమంటే బద్ధకించే కుర్రాడైనా ప్రేమ, రొమాన్స్... పదాలు కనపడితే కళ్లు నులుముకుంటాడు. ఆకట్టుకునే శైలి అందిందా, అక్షరాల వెంట పరుగులు తీస్తాడు. ఇదే మంత్రంతో యువత నాడి పట్టేస్తున్నారు నేటి రచయితలు. చేతన్‌భగత్, రశ్మీబన్సాల్, రవీందర్‌సింగ్, అమీశ్ త్రిపాఠి, దుర్జయ్దత్తా... పేరేదైనా ముడిసరుకు ప్రేమ, కెరీర్, వ్యక్తిత్వ వికాసం, రొమాన్స్, స్నేహం, మేనేజ్మెంట్, భావోద్వేగాలే. ఇంటర్నెట్ పరిచయాలు, సెల్‌ఫోన్ ప్రేమలతో రవీందర్‌సింగ్ 'ఐ టూ హ్యాడ్ ఏ లవ్‌స్టోరీ' అల్లితే మూడునెలల్లో లక్షన్నర లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. 'స్టే హంగ్రీ స్టే ఫూలిష్' అంటూ రశ్మీబన్సాల్ స్ఫూర్తి పాఠాలు బోధిస్తే కళ్లకద్దుకుంది యువత. 'డ...