సులువుగా వ్యాపారం.. క్షణాల్లో వ్యవహారం! (11/04/13)


వాణిజ్య ప్రపంచంలో మీరో వ్యాపారా?చదువుతూనే చిరు వ్యాపారం చేస్తున్నారా?ఇంట్లో చిన్నతరహా పరిశ్రమ నడుపుతున్నారా?మరి మీ లావాదేవీలకు ప్రత్యేకమైన ఆప్స్‌ ఉన్నాయని తెలుసా?స్మార్ట్‌ మొబైల్‌ ఉంటే దూసుకుపొండి మరి! 
సూత్రాలు కావాలంటే?
చక్కని వ్యాపార సూత్రాల్ని అందిస్తోంది Mind Toolsఅప్లికేషన్‌. నాయకత్వ లక్షణాలు, బృంద సారథ్యం, డెసిషన్‌ మేకింగ్‌, ప్రొజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, టైం మేనేజ్‌మెంట్‌... లాంటి మరిన్ని అంశాలున్నాయి. హోం పేజీలో వచ్చిన ఐకాన్‌ గుర్తులతో కావాల్సిన అంశాన్ని ఎంచుకుని చదవుకోవచ్చు.http://goo.gl/X3kBF
ఎడిట్‌ చేయాలా?
ముఖ్యమైన బిజినెస్‌ డాక్యుమెంట్‌లు, డేటాబేస్‌లను ఎడిట్‌ చేసి పని ముగించాలంటే ఆఫీస్‌ ఆప్స్‌ని వాడుకోవచ్చు. వాటిల్లో Olive Officeఒకటి. గూగుల్‌ ప్లే నుంచి నిక్షిప్తం చేసుకోండి. docx, xlsx, pptx ఫైల్స్‌ని ఎడిట్‌ చేసుకునే వీలుంది. డౌన్‌లోడ్‌, ఇతర వివారలకు http://goo.gl/uCDV5* ఆండ్రాయిడ్‌ యూజర్లు వాడుకునేందుకు మరోటిKingsoft Office. http://goo.g l/gbdP5 
మీకున్న బిజినెస్‌ కార్డ్‌ని క్షణాల్లో మొబైల్‌ నుంచే అడ్రస్‌బుక్‌లోని సభ్యులతో పంచుకుంటే? మీరెక్కడున్నప్పటికీ ముఖ్యమైన డాక్యుమెంట్‌ని మొబైల్‌ నుంచే ఆఫీస్‌లోనో... ఇంట్లోనో ఉన్న ప్రింటర్‌కి ప్రింట్‌ ఇవ్వాలంటే? గూగుల్‌ క్యాలెండర్‌లో పెట్టుకున్న షెడ్యూల్స్‌, సమావేశాల్ని ప్రత్యేక ఆప్‌తో మేనేజ్‌ చేసుకోవాలంటే? వ్యాపారానికి సంబంధించిన ప్రైవేటు కాంటాక్ట్స్‌, మేసేజ్‌లు, ఫొటోలు, వీడియోలను ప్రైవసీ కోడ్‌తో తాళం వేసుకోవాలంటే? అవసరానికి తగినట్టుగా డెస్క్‌టాప్‌ పీసీని మీ ఫోన్‌, ట్యాబ్లెట్‌లోనే యాక్సెస్‌ చేయాలంటే? ఇలా చెప్పాలంటే ఎన్నో పనులను చక్కగా చేసిపెట్టే మొబైల్‌ అప్లికేషన్లు బోలెడు! అవేంటో తెలుసుకుందాం!
కార్డ్‌ ఇస్తున్నారా?
వ్యాపారమన్నాక బిజినెస్‌ కార్డ్‌ తప్పని సరి. ప్రిటింగ్‌ కార్డ్‌ని చేతికి ఇవ్వడం మామూలే. మరింత స్మార్ట్‌గా మొబైల్‌లో కార్డ్‌ని ఇతరులకు షేర్‌ చేయాలంటే CamCardFree అప్లికేషన్‌ ఉంది. మెగాపిక్సల్‌ కెమెరాతో ఒక్కసారి స్కాన్‌ చేస్తే చాలు. ఇక మీ బిజినెస్‌ కార్డ్‌ పోగొట్టుకోవడమనే మాటే ఉండదు. ఫొటో తీసిన కార్డ్‌ని ప్రత్యేక 'రికగ్నేషన్‌ టెక్నాలజీ'తో కావాల్సినట్టుగా మార్చుకునే వీలుంది. ఇలా డిజైన్‌ చేసిన కార్డ్‌లను 'క్యూఆర్‌-కోడ్‌' వారధితో షేర్‌ చేయవచ్చు. డిజైన్‌ చేసుకున్న కార్డ్‌ని క్లౌడ్‌ స్టోరేజ్‌లో భద్రం చేసుకోవచ్చు కూడా. ఉచిత వెర్షన్‌లో నియమిత పరిమితితో కార్డ్‌లను షేర్‌ చేయాలి. ప్రీమియం వెర్షన్‌ని పొందితే అదనపు సౌకర్యాలు అనేకం. http://goo.gl/7162U
ఎక్కడినుంచైనా?
వ్యాపార పత్రాలనో... బిల్లులనో... ఇన్‌వాయిస్‌లనో... ఎక్కడినుంచైనా ప్రింట్‌ తీసుకోవాలంటే గూగుల్‌ ప్లే నుంచిPrinterShare ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌, పీడీఎఫ్‌, టెక్స్ట్‌ ఫైల్స్‌ని ప్రింట్‌ తీసుకోవచ్చు. గూగుల్‌ డ్రైవ్‌లో భద్రం చేసుకున్న ఫైల్స్‌ని కూడా ఆప్‌తో యాక్సెస్‌ చేయవచ్చు. ఈమెయిళ్లు, గూగుల్‌ డాక్యుమెంట్‌లను కూడా ప్రింట్‌ ఇవ్వొచ్చు. ప్రింట్‌ ఇచ్చేందుకు నెట్‌, వై-ఫై, బ్లూటూత్‌లను వారధిగా చేసుకోవచ్చు. జేపీజీ, పీఎన్‌జీ, జిప్‌... ఫార్మెట్‌ ఇమేజ్‌లను కూడా ప్రింట్‌ ఇవ్వొచ్చు. యూఎస్‌బీ పోర్ట్‌తో కూడా ప్రింట్‌ ఇచ్చే సదుపాయం ఉంది. ప్రిమియం వెర్షన్‌లో అదనపు సౌకర్యాల్ని పొందొచ్చు. http://goo.gl/3gyJi
* ఐఫోన్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి ఉచితంగా పొందొచ్చు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/YtDoJ
మీటింగ్స్‌ పెట్టాలా?
ఏదైనా ఉత్పత్తి అమ్మకాలపై బృంద సభ్యులతో అత్యవరసర సమావేశాన్ని స్మార్ట్‌ మొబైల్‌లో నిర్వహించాలంటే అందుకు GoTo Meeting ఆప్‌ ఉంది. టెక్స్ట్‌, వాయిస్‌ ఛాటింగ్‌తో సమావేశాల్ని పెట్టుకునే వీలుంది. ఒక్క డయల్‌తోనే బృంద సభ్యులంతా కాన్ఫెరెన్స్‌లోకి రావొచ్చు. మీటింగ్స్‌లో అమ్మకపు వివరాల్ని ప్రజంటేషన్స్‌ రూపంలో షేర్‌ చేసుకోవచ్చు కూడా. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక బృంద సభ్యులకు ఆహ్వానాలు పంపాలి. ఆండ్రాయిడ్‌ యూజర్లు http://goo.g l/9PWbC నుంచి పొందండి.
* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు. డౌన్‌లోడ్‌ ఇతర వివరాలకు http://goo.gl/bxq9w
పేమెంట్‌ తీసుకోవాలా?
అమ్మకాలను తక్షణమే బిల్లింగ్‌ చేసి కార్డ్‌ ద్వారా సొమ్ము పొందాలంటే? వెంట స్వైపింగ్‌ మెషిన్‌ తీసుకుని వెళ్లక్కర్లేదు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌తోనే కార్డ్‌ని స్వైప్‌ చేసి నగదు జమ చేసుకోవచ్చు. అందుకు Square Register ఆప్‌ని నిక్షిప్తం చేసుకుంటే సరి. ఎప్పుడైతే అప్‌ కోసం సభ్యులవుతామో అప్పుడే కంపెనీ మీకో కార్డ్‌ రీడర్‌ని పంపుతుంది. దాన్ని మొబైల్‌కి కనెన్ట్‌ చేసి కార్డ్‌లను స్వైప్‌ చేయవచ్చు. కార్డ్‌ రీడర్‌కి మొబైల్‌కి మధ్య ఆప్‌ వారధిగా పని చేస్తుంది. ఆప్‌ని నిక్షిప్తం చేశాక ఎకౌంట్‌ని ఆప్‌కి లింక్‌ చేయాలి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. http://goo.gl/W9pxk
* ఐఫోన్‌, ఐప్యాడ్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి నిక్షిప్తం చేసుకోండి. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://goo.gl/utsPj
స్కాన్‌ చేయాలా?
అనుకోకుండా అవసరమయ్యే బిజినెస్‌ డాక్యుమెంట్‌లు, బిజినెస్‌ కార్డ్‌లు, కరపత్రాల్ని స్కాన్‌ చేసి పంపాలంటే స్కానర్‌ కోసం వెతకక్కర్లేదు. స్మార్ట్‌ మొబైల్‌నే బుల్లి స్కానర్‌లా మార్చేయవచ్చు. అందుకు DocScan ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిందే. 'ఆటో ఎడ్జ్‌ డిటెక్షన్‌, Perspective correction' ఆప్షన్స్‌తో స్కాన్‌ చేయవచ్చు. ఇలా స్కాన్‌ చేసిన వాటిని పీడీఎఫ్‌ ఫార్మెట్‌లోకి మార్చేసి ఇతరులకు షేర్‌ చేసే వీలుంది. ఫ్యాక్స్‌, ఈమెయిల్‌ చేసుకునే వీలుంది. ఇలా స్కాన్‌ చేసిన అన్ని డాక్యుమెంట్‌లను క్లౌడ్‌ స్టోరేజ్‌లో భద్రం చేసుకోవచ్చు. ముఖ్యం అనుకున్నవాటిని పాస్‌వర్డ్‌తో తాళం వేయవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా పొందొచ్చు. http://goo.gl/8h5aC
* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి నిక్షిప్తం చేసుకోవచ్చు. http://goo.gl/zWzHf
'ఇన్‌వాయిస్‌' కోసం...
అమ్మకాలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌, ఎస్టిమేట్‌, పర్చేజ్‌ ఆర్డర్‌, క్రెడిట్‌ మెమోలను స్మార్ట్‌ మొబైల్‌ నుంచి మేనేజ్‌ చేయాలంటే అందుకు Invoice2go ఆప్‌ని నిక్షిప్తం చేసుకోండి. ఫోన్‌, ట్యాబ్లెట్‌ల్లో వాడుకోవచ్చు. సుమారు 20 రకాల 'ఇన్‌వాయిస్‌ స్త్టెల్స్‌' ఉన్నాయి. అన్ని ఇన్‌వాయస్‌లను ప్రివ్యూ చూసి పీడీఎఫ్‌ ఫార్మెట్‌లో మెయిల్‌ చేయవచ్చు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకుhttp://goo.gl/Gw6x8
షెడ్యూల్‌ చేయండి
మీ రోజువారీ సమావేశాలు, ఇతర అపాయిట్‌మెంట్స్‌ని సులువుగా మేనేజ్‌ చేసుకునేందుకు Business Calenderవాడొచ్చు. ఇప్పటికే వాడుతున్న 'గూగుల్‌ క్యాలెండర్‌' సర్వీసుని ఆప్‌కి అనుసంధానం చేసుకునే వీలుంది. గ్రాఫిక్స్‌, టెక్స్ట్‌ మేటర్‌తో డాక్యుమెంట్‌ని మేనేజ్‌ చేసుకోవచ్చు. రంగులతో వాటి ప్రాధాన్యత తెలుసుకునే వీలుంది. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. http://goo.gl/LZQO4 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు