దేవునికొండకేదీ అండ?
గ్రానైట్ కోసం 1300 ఏళ్ల చరిత్రకు చరమగీతం
తాజాగా బయటపడిన జైనతీర్థంకరుడి విగ్రహం
కోట్లనర్సింహులపల్లిలో రాష్ట్రకూటుల నాటి ఆలయం, కోటలకు ముప్పు
కొండను గుత్తేదారుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం
ఆగమేఘాల మీద దస్త్రాన్ని సిద్ధం చేసిన గనుల శాఖ
కొండను వారసత్వ సంపదగా ప్రకటించాలంటున్న స్థానికులు
అదో చారిత్రక ప్రాంతం.. అక్కడ అడుగు తీసి అడుగేస్తే ఏదో ఒక చారిత్రక సాక్ష్యం స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంటుంది.. అటువంటి అద్భుత వారసత్వ సంపద విధ్వంసానికి పథక రచన జోరుగా సాగుతోంది. 79 ఎకరాల్లో విస్తరించి ఉన్న శతాబ్దాల నాటి చరిత్రను గ్రానైట్ రాళ్ల కోసం కాలగర్భంలో కలిపేందుకు గనుల శాఖలో దస్త్రం శరవేగంగా కదులుతోంది. ఇప్పటికే అక్కడ అనేక గ్రానైట్ కొండలు, వాటితో పాటే చరిత్రా కనుమరుగైపోయాయి. మిగిలి ఉన్న ఒకే ఒక్క కొండనూ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పేల్చివేయాలనే ఆలోచన రావడమే దారుణం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లిలోని కొండను గ్రానైట్ క్వారీగా మార్చడానికి అధికార గణాలు సిద్ధమయ్యాయి. ‘ఈనాడు’ ప్రతినిధి ఆ కొండపై, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు అనేక ఆసక్తికర అంశాలను గుర్తించారు. 1300 ఏళ్లనాటి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, కోట తదితరాలన్నీ భావితరాలకు పదిలపర్చడం పాలకుల కర్తవ్యం.
ఈనాడు, హైదరాబాద్
అవి రాష్ట్రకూటుల కాలం నాటివి..
తెలంగాణలోని పాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని ప్రాంతాలు రాష్ట్రకూటుల (క్రీ.శ.750-973) కాలంలో ‘సపాదలక్ష’ అనే రాజ్యంలో ఉండేవి. సపాదలక్ష అంటే లక్షా పాతిక వేల గ్రామాలున్న దేశమని అర్థం. దీనికే ‘పోలవస’ అనే మరో పేరూ ఉండేది. రాష్ట్రకూటులకు సామంతులైన వేములవాడ చాళుక్యులు తెలంగాణలోని ప్రాంతాలను పరిపాలించేవారు. వీరి పాలనలోనే ప్రస్తుత కోట్లనర్సింహులపల్లి.. జైన, వైష్ణవ ఆలయాలు, కోటలతో అలరారింది. దీనికి నందికొండ అనే పేరు కూడా ఉంది. కొండపై లక్ష్మీనర్సింహస్వామి ఆలయం అప్పట్లోనే నిర్మితమైంది. ఆలయం పైనున్న శిలపై ఎనిమిది తలలు, 16 చేతులతో చెక్కిన ఉగ్రనర్సింహుడి ప్రతిమ.. ఒక అద్భుత కళాఖండం. ప్రస్తుతం ఉగ్రనర్సింహుడి 8 తలల్లో కుడివైపునున్న మూడు తలలే కనిపిస్తున్నాయి. మిగిలి ఉన్న రూపురేఖలనైనా అపురూపంగా చూసుకోవాలంటూ భారత పురావస్తు సర్వేక్షణ(ఏఎస్‌ఐ) శాఖ ఇటీవల తేల్చింది. ఇటువంటి ఉగ్రనర్సింహుడే ఎల్లోరాలోని 15వ గుహలోనూ ఉన్నట్లు వెల్లడించింది. ఆలయం 150 ఏళ్ల క్రితం వరకు దట్టమైన అడవిలో ఉండేది. 1860లో రామడుగుకు చెందిన కల్వకోట కృష్ణయ్య దేశపాండే దీన్ని కనుగొన్న తర్వాతే ప్రజలకు తెలిసి దేవుని కొండగా ప్రచారంలోకి వచ్చింది.

జంతుజాలమే కారణం
దేవుని కొండ శిఖరంపై గల కోట వైపు ఎవరూ వెళ్లకపోవడానికి అక్కడనున్న జంతుజాలం కూడా కారణం. చుట్టుపక్కల కొండలన్నింటినీ గ్రానైట్ కోసం నామరూపాల్లేకుండా కొట్టిపారేయడంతో అక్కడ నివసించిన ఎలుగుబంట్లు, పాములు, కొండచిలువలు, ముళ్ల పందులు, కోతులు, కొండెంగలు, నెమళ్లు తదితరాలన్నీ దేవుని కొండపైకి చేరాయని గ్రామస్థులు చెబుతున్నారు. సమీప చిప్పకుర్తిలో ఇటీవల గొర్రెలను హతమార్చింది చిరుతపులేనని, అది ఈ కొండపై నుంచే వచ్చిందని చెబుతున్నారు. గతంలో ఇక్కడ విస్తారంగా వర్షాలు పడేవని, గుట్టలను పిండి చేసిన తర్వాత కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలు గ్రామాల వారు వాపోతున్నారు.

విలువైన గ్రానైట్‌తోగల దేవుని కొండను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించి కోర్టు జోక్యంతో వెనకడుగు వేసిన గుత్తేదార్లు.. మళ్లీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు కోర్టుల ప్రశ్నించిన అంశాలు పునరావృతం కాకుండా చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. గుడిని విడిచిపెట్టి 46 ఎకరాల్లోని కొండను ముక్కలు చేసుకొంటామని గుత్తేదార్లు అడగడమే తరవాయి.. గనుల శాఖ సంచాలకుడి నుంచి జనవరి 3న ఒక లేఖ కరీంనగర్‌లోని ఆ శాఖ సహాయ సంచాలకుడికి చేరింది. ఆయన రెండ్రోజుల్లోనే సర్వే పూర్తి చేసి నివేదికను పంపించారు. ఆలయానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోనున్నందున కొండను గ్రానైట్ కోసం ఇచ్చేయవచ్చంటూ సర్కారుకు దస్త్రం వెళ్లినట్లు తెలిసింది.
కొండ బద్దలైతే?
దేవుని కొండ ధ్వంసమైతే శతాబ్దాల చరిత్ర తాలూకు ఆనవాళ్లు, ఇంకా శోధించాల్సిన అంశాలు కాలగర్భంలో కలిసిపోతాయి. అక్కడి జంతుజాలం సమీప గ్రామాల్లోకి చొచ్చుకొస్తాయి. కొండను పేల్చేటప్పుడు ఆ ధాటికి గ్రామంలోని ఇళ్లకు, గుడికీ నష్టం కలుగుతుంది. కొండపై చెక్కిన ఉగ్రనర్సింహుడి ప్రస్తుత రూపురేఖలు కూడా అంతర్ధానమైపోయే ప్రమాదం ఉంది. ఆలయం జోలికి రాకుండానే కొండను బద్దలు చేస్తామనే గుత్తేదార్ల వాదనలు నమ్మశక్యం కానివనడానికి వెదిరలోని మల్లన్నగుట్టే నిదర్శనం. అక్కడ కొండకు ఒకవైపు ఆలయం ఉండగా వెనకవైపు నుంచి కొండమొత్తాన్ని తొలచివేస్తున్న తీరు చూస్తే విధ్వంసం ఎలా ఉంటుందో తేటతెల్లమవుతుంది. మల్లన్న ఆలయంలోని శాసనం కనిపించకుండా పైన సున్నం ఎందుకు పూశారో కూడా పరిశీలించాల్సి ఉంది. మల్లన్న కొండవద్ద ఇలా గ్రానైట్ రాళ్లను తొలిచే సమయంలో వెలువడే ముక్కలన్నింటినీ పక్కనే ఉన్న చెరువు వద్ద పోస్తుండడంతో అక్కడిప్పుడు కొత్త కొండ తయారైంది.

కొండా లేదు.. దేవుని పాదాలూ లేవు
గంగాధర మండలంలోని బుత్కారులో ఇటీవల వరకు ‘దేవుని పాదాలు’ గల గుట్ట.. పాదాలతో సహా కనుమరుగైపోయింది. వెదిరలోని నెమళ్ల గుహలు ఎలుగుబంట్లకు ఆవాసంగా ఉండేవి. జగిత్యాల జిల్లా వెల్గుటూరులో బుగ్గిరాజశ్వేర స్వామి గుహల వద్ద పేలుళ్ల వల్ల అక్కడి విలువైన సంపద నాశనమైపోతోంది. ప్రభుత్వం అనుమతులిస్తే నర్సింహులపల్లిలోని కొండ కూడా వీటి సరసన చేరడం ఖాయం.

గంగాధర మండలం కురిక్యాలలోని బొమ్మలగుట్ట.. ఒకప్పుడు జైనులకు ప్రముఖ పుణ్యక్షేత్రం. అక్కడి కొండపై జైన యక్షిణి, వృషభనాథుడు, వర్ధమానవీరుడు తదితరుల విగ్రహాలున్నాయి. కొంతకాలం క్రితం ఆ కొండను కూడా పేల్చివేసే ప్రయత్నాలు జరగ్గా దాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఉద్యమించారు. దీంతో సర్కారు వెనక్కి తగ్గి దాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తున్నట్లు ప్రకటించి కొన్ని మెట్లను కట్టి వదిలేసింది.
150మీటర్ల ఎత్తులో కోట ఆనవాళ్లు
ఆలయానికి కొంత దూరంలో 150 మీటర్ల ఎత్తులో గల కొండపై కోట, మరికొన్ని ఇతర ఆనవాళ్లు ఉన్నాయి. కొండపైన మెట్లతో కూడిన సన్నటి నేలమాళిగ ఉంది. కొండ దిగువన దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణం చుట్టూ ఎత్తయిన మట్టిగోడ ఉండేది. ఇప్పటికీ కొన్ని చోట్ల నాటి భారీ గోడ, కందకం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గ్రామంలో ‘సవతి నూతులు’ అనే రెండు గుండాలు పక్కపక్కనే ఉన్నాయి. ఒక దాంట్లో ఉప్పునీరు, మరో దాంట్లో తియ్యటి నీళ్లు ఉండేవని గ్రామస్థులు చెప్పారు.

- కల్వకోట కీర్తికుమార్, అనువంశిక ధర్మకర్త, లక్ష్మీనర్సింహస్వామి ఆలయం
|
-సిహెచ్.రమణాచారి, కోట్లనర్సింహులపల్లి
|
- ఒగ్గు ఆంజనేయులు, రైతు, కోట్లనర్సింహులపల్లి
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి