అరచేతిలో ఆత్మరక్షణ! (Eenadu Mobile tips_19/07/2012)
సెల్‌లో కాల్స్ చేయడమే కాదు. మిమ్మల్ని, మీ డేటాని సురక్షితంగా కాపాడుకోవచ్చు... ఆపదలో ఆదుకునే నేస్తంగా మార్చేయవచ్చు. ముఖ్యమైన డేటాని తాళంతో భద్రం చేసుకోవచ్చు... ఇంకా ఎన్నో పనులు అప్పగించవచ్చు! అందుకు తగిన అప్లికేషన్లు ఉన్నాయి. ఒకో మోడల్‌కి ఒకోటి. తెలుసుకుంటే సరి!స్మార్ట్ మొబైళ్లను ఉపయోగించుకోవడం తెలియాలి కానీ, అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ దగ్గర్నుంచి బ్యాంకింగ్ వరకూ ఎన్ని చక్కబెట్టవచ్చో అందరికీ తెలిసిందే. ఇన్ని పనులు చేసే సెల్‌లో మనకి సైతం రక్షణగా నిలిచే సాధనాలు ఉన్నాయి. అందుకు కొన్ని మొబైల్ సాఫ్ట్‌వేర్‌లు ఆత్మరక్షణ అందిస్తున్నాయి. అంతేకాదు, ముఖ్యమైన డేటాని ఎవ్వరూ చూడలేని విధంగా భద్రం చేయవచ్చు. ఆ మార్గాలేంటో తెలుసుకుందామా! ఆందోళన పడకండి! పేరు:pMonitor ఇంట్లో కుటుంబ సభ్యులు రావాల్సిన సమయానికి ఇంటికి రాకపోతే ఆందోళనే. అంత ఆదుర్దా పడక్కర్లేదంటూ ముందుకొచ్చింది pMonitor. దీంట్లో నిక్షిప్తం చేసిన Location, Panic, Fall అలర్ట్‌లతో మనిషిని బాడీగార్డ్‌లా కంటికి రెప్పలా కాపాడుతుంది. Location Monitoringతో మనవాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. Panic Alertతో ఎమర్జెన్సీ విషయాన్ని చెప్పొచ్చు. Fall Monitoring తో ఆరోగ్య వివరాల్ని తెలుసుకోవచ్చు. http://goo.gl/dsmXF అప్రమత్తం చేస్తుంది పేరు: Pocket Panic Alarm ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అరిచి 'హెల్ప్' అనలేని సమయంలో మొబైల్‌లో మీకు సాయం చేస్తే! Panic Alarm అప్లికేషన్‌తో ఇది సాధ్యమే. తెరపై వచ్చే బటన్‌పై తాకితే మూడే సెకన్లలో Please Helpఅని అందరినీ అప్రమత్తం చేస్తుంది. http://goo.gl/6adel క్షేమ సమాచారం! పేరు:I AM SAFE ఉచితంగా దొరికే అప్లికేషన్. ఆండ్రాయిడ్‌కి ప్రత్యేకం. గూగుల్ ప్లే మార్కెట్ నుంచి పొందొచ్చు. మీరు ఏ లొకేషన్‌లో ఉన్నారో కుటుంబ సభ్యులకు చెబుతుంది. ముందుగా మీ గురించి ఎవరికి తెలియాలనుకుంటున్నారో ఆ నెంబర్ని అప్లికేషన్‌లో కాన్ఫిగర్ చేయాలి. ఆపై జీపీఎస్ సర్వీసుతో మీరెక్కడుందీ ప్రతి నిమిషం అప్‌డేట్ చేసేస్తుంది. వెర్షన్ రెండులో అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వయసు మళ్లినవారు, దృష్టి లోపం ఉన్నవారు మొబైల్‌ని ఒక్కసారి షేక్ చేస్తే చాలు కాన్ఫిగర్ చేసిన నెంబర్‌కి ఎసెమ్మెస్ వెళ్లిపోతుంది. http://goo.gl/uu4Sv కంగారు దేనికి? పేరు:Glympse 'అరగంటలో ఇంటికి వచ్చేస్తా' అన్న అమ్మాయి ఎక్కడుందో ఏంటో? అని కంగారు పడక్కర్లేదు. ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి. మ్యాప్‌పై రియల్ టైంలో మీరెక్కడున్నదీ మొబైల్‌లో చూడొచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ ఫోన్ 7, బ్లాక్‌బెర్రీ ప్లాట్‌ఫారాల పైనా రన్ అవుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులకు మీరెక్కడున్నారో, చెప్పిన లొకేషన్‌కి ఎంత సమయంలో వస్తారో తెలుపుతుంది. ఎస్‌ఎంఎస్, ఫోన్‌కాల్‌తో మీరున్న లొకేషన్‌ను ఇతరులకు చెప్పొచ్చు. ఉచితంగా దీన్ని పొందొచ్చు. www.gly mpse.com/get_glympse మరింత రక్షణ పేరు: My Security App ఆండ్రాయిడ్ యూజర్లు ఉచితంగా పొందొచ్చు. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు మిమ్మల్ని నిత్యం గమనించే అనుమతి ఇవ్వడం. జీపీఎస్ ద్వారా ఇది సాధ్యం. ఒక్కరికే కాకుండా మీకిష్టమైన మరికొంతమందికి మిమ్మల్ని గమనించేలా అనుమతించవచ్చు. మీరేదైనా ఆపదలో ఉంటే అటోమేటిగ్గా తెలియజేసేలా ఒక అలారమ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది. సేఫ్టీ కెమెరా ఉంది. ఇది ఆటోమేటిగ్గా మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, మిమ్మల్ని ఫొటోలు తీసి మీరు సూచించిన వ్యక్తులకు చేరవేస్తుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లతో కలిసి పని చేస్తుంది. http://goo.gl/LTnef * ఐఫోన్ యూజర్లు అప్‌స్టోర్ నుంచి ఉచితంగా పొందొచ్చు. http://goo.gl/GZxyc 'షేక్' చేస్తే సైరన్! పేరు: ShakeAlert ఐఫోన్ యూజర్లకు ఇది ప్రత్యేకం. ముందుగా మీరు ఎంచుకున్న నెంబర్‌కి ఎలర్ట్ వెళ్లేలా కాన్ఫిగర్ చేయాలి. మిమ్మల్నెవరైనా బెదిరిస్తున్నా, దాడి చేయబోయినా మీ చేతిలో ఉండే ఫోను గట్టిగా షేక్ చేస్తే చాలు. ఒక పెద్ద సైరన్ మోగుతుంది. అంతేకాదు! మీరు సూచించిన వ్యక్తి నెంబరుకు మీరున్న లొకేషన్‌తో మెసేజ్ ఎలర్ట్ చేరిపోతుంది. సైరన్‌ను ఆపాలనుకుంటే Press to Deactivate నొక్కితే సరిపోతుంది. ఐప్యాడ్, ఐపాడ్‌ల్లో కూడా దీన్ని వాడొచ్చు. http://goo.gl/a58bx భద్రంగా దాచేస్తుంది! పేరు: Hide it Pro ముఖ్యమైన డాక్యుమెంట్‌లు, వీడియోలు, ఫొటోలను ఇతరుల కంట పడకుండా చేస్తుంది. బిల్డ్‌ఇన్ వీడియో ప్లేయర్‌లో వీడియోలను ప్లే చేసుకోవచ్చు. మొత్తం గ్యాలరీలకు పాస్‌వర్డ్ ప్రొటక్షన్ పెట్టుకునే వీలుంది. సిస్టంలో మాదిరిగా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్, ఫోల్డర్లను ఎంపిక చేసి హైడ్ చేయవచ్చు. ఒక ఫోల్డర్ నుంచి మరో ఫోల్డర్‌లోకి ఫైల్స్ 'మూవ్' చేసుకునే వీలుంది.http://goo.gl/zqxuc ఇది మరోటి పేరు: Handy Safe Pro ముఖ్యమైన డాక్యుమెంట్‌లు, పిన్‌కోడ్‌లు, క్రెడిట్‌కార్డ్ నెంబర్లను సురక్షితం చేస్తుంది. ఇదో కమర్షియల్ సాఫ్ట్‌వేర్. ఆండ్రాయిడ్ మార్కెట్ నుంచి రూ.105తో పొందొచ్చు. 65 ప్రీలోడెడ్ గ్రాఫికల్ టెంప్లెట్స్, ఐకాన్స్‌తో డిజైన్ చేశారు. 448 bit Blowfish డేటా ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీతో డేటాని సురక్షితం చేస్తుంది. క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఎకౌంట్ నెంబర్లు, ఇతర పిన్‌కోడ్స్‌ని ప్రత్యేక పాస్‌వర్డ్ ఫార్మెట్‌లో భద్రం చేసుకునే వీలుంది. http://goo.gl/sbyW6 |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి