ఇష్టాల ప్రకారమే ఇంజినీరింగ్ ప్రాజెక్ట్!
ఇష్టాల ప్రకారమే ఇంజినీరింగ్ ప్రాజెక్ట్! బీటెక్‌కి సంబంధించి మొదటి ముఖ్య ఘట్టం సీటు సాధించుకోవడమైతే, మలిఘట్టం మూడు, నాలుగు సంవత్సరాల్లో ప్రాజెక్టులు చేయడం. రెండోది మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి చాలా అవసరం. చేసే ప్రాజెక్టు నాణ్యత ఉద్యోగస్థాయిని కూడా నిర్ణయిస్తుంది. తరగతిలో, ప్రయోగశాలల్లో, ఇంకా సెమిస్టర్ పరీక్షల్లో ప్రదర్శించే ప్రతిభ అంతా ఒక ఎత్తయితే ప్రాజెక్టు వర్క్ మరో ఎత్తవుతుంది. అందుకే ఒక బీటెక్ విద్యార్థి ప్రాజెక్టులు ఎన్ని చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎందుకు చేయాలి? వాటి అవసరమేంటి? ఉపయోగమేమిటి? తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే మంచి ప్రాజెక్ట్‌కి మార్గం తేలిగ్గా వేసుకోవచ్చు. ప్రతి ఇంజినీరింగ్ విద్యార్థి యూనివర్సిటీ నిబంధనలను అనుసరించి మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో మినీ ప్రాజెక్టు, నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో మేజర్ ప్రాజెక్టు అంటే కనీసం రెండు ప్రాజెక్టులు చేయాలి. వీటికి వరుసగా 50, 200 మార్కులు ఉంటాయి. అయితే మొదటి నుంచి ప్రతి సెమిస్టర్‌లో ఒక ప్రాజెక్టు చేయడం చాలా మంచిది. అలా వీలు కాకపోతే మూడు, నాలుగు సంవత్సరాల్లో సెమిస్టర్‌కి ఒకటి చొప్పున నాలుగు...