ఇష్టాల ప్రకారమే ఇంజినీరింగ్ ప్రాజెక్ట్!
ఇష్టాల ప్రకారమే ఇంజినీరింగ్ ప్రాజెక్ట్!
బీటెక్‌కి సంబంధించి మొదటి ముఖ్య ఘట్టం సీటు సాధించుకోవడమైతే, మలిఘట్టం మూడు, నాలుగు సంవత్సరాల్లో ప్రాజెక్టులు చేయడం. రెండోది మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి చాలా అవసరం. చేసే ప్రాజెక్టు నాణ్యత ఉద్యోగస్థాయిని కూడా నిర్ణయిస్తుంది. తరగతిలో, ప్రయోగశాలల్లో, ఇంకా సెమిస్టర్ పరీక్షల్లో ప్రదర్శించే ప్రతిభ అంతా ఒక ఎత్తయితే ప్రాజెక్టు వర్క్ మరో ఎత్తవుతుంది. అందుకే ఒక బీటెక్ విద్యార్థి ప్రాజెక్టులు ఎన్ని చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎందుకు చేయాలి? వాటి అవసరమేంటి? ఉపయోగమేమిటి? తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే మంచి ప్రాజెక్ట్‌కి మార్గం తేలిగ్గా వేసుకోవచ్చు.
ప్రతి ఇంజినీరింగ్ విద్యార్థి యూనివర్సిటీ నిబంధనలను అనుసరించి మూడో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో మినీ ప్రాజెక్టు, నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో మేజర్ ప్రాజెక్టు అంటే కనీసం రెండు ప్రాజెక్టులు చేయాలి. వీటికి వరుసగా 50, 200 మార్కులు ఉంటాయి. అయితే మొదటి నుంచి ప్రతి సెమిస్టర్‌లో ఒక ప్రాజెక్టు చేయడం చాలా మంచిది. అలా వీలు కాకపోతే మూడు, నాలుగు సంవత్సరాల్లో సెమిస్టర్‌కి ఒకటి చొప్పున నాలుగు ప్రాజెక్టులు చేసినా ఉపయోగకరమే.
నేర్చుకున్నది చేసి చూపడమే
ఇంజినీరింగ్ విద్యార్థులు తరగతిలో నేర్చుకున్న, ప్రయోగశాల్లో అభ్యాసం చేసిన విషయాలను కలిపి సమగ్రంగా అర్థం చేసుకోవడం ప్రాజెక్టువర్క్‌ల వల్ల సాధ్యమవుతుంది. తాము నేర్చుకున్న అంశాల అనువర్తన పరిశ్రమల్లో ఏవిధంగా జరుగుతుందో తెలుస్తుంది. ఒక ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తిచేయాలంటే దానిపట్ల సరైన అవగాహన ఉండాలి. సాధారణంగా ప్రాజెక్ట్ అనగానే సరికొత్తగా ఉండాలనుకుంటారు. అలా నవ్యతతో కూడిన వాటిని చేయాలంటే ప్రాజెక్ట్ పర్వాన్ని ఒక క్రమంలో అనుసరించాలి.

ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడంలో ముఖ్యమైన అంశాలు పరిధి, సమయం. వాటిని తెలుసుకోడానికి ఈ కింది మార్గదర్శకాలు అనుసరించాలి.
అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలు: ప్రాజెక్టు ఎంచుకోవడానికి ముందు మన బ్రాంచిలోని ఏ సబ్జెక్టులో మనకు ప్రత్యేక శ్రద్ధ ఉందో గ్రహించాలి. ఉదాహరణకు మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆటోమొబైల్‌లో ప్రాజెక్ట్ చేయాలనుకుంటే, ఆ రంగంలో కనీస పరిజ్ఞానం ఉండాలి. అప్పుడే ప్రాజెక్టు పట్ల స్పష్టత ఉంటుంది.

సంక్లిష్టం కానీయవద్దు: ప్రాజెక్ట్ లక్ష్యం పట్ల స్పష్టత ఉండాలి. ఒక్కోసారి ఈ క్రమంలో లక్ష్యం పట్ల సరైన అవగాహన లేక ప్రాజెక్ట్‌ను సంక్లిష్టం చేసుకునే అవకాశం ఉంది. అలా జరగకుండా జాగ్రత్త వహించాలి. తమకు వీలైన, ఒక మోస్తరు జటిలంగా ఉండే ప్రాజెక్ట్‌ను ఎంచుకోవాలి. సంబంధిత సమాచారాన్ని ముందే సేకరించుకోవాలి.
తక్కువ ఖర్చు: ప్రాజెక్ట్ చేయాలంటే కొన్ని పరికరాలు, వనరులు కావాలి. వాటికి సంబంధించిన ఖర్చు గురించి ముందే అంచనా వేసుకోవాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చే ప్రాజెక్ట్‌లను ఎంచుకోవాలి.
కాలపరిమితి:మూడో సంవత్సరంలో చేసే మినీ ప్రాజెక్ట్ కాల వ్యవధి దాదాపు మూడు వారాలు. నాలుగో సంవత్సరంలో చేసే మేజర్ ప్రాజెక్టుకు మూడు నెలల కాలపరిమితి ఉంటుంది. ఎక్కువ కాలం పట్టే ప్రాజెక్ట్‌లు ఎంచుకోకూడదు.
టూల్స్ అందుబాటు: ప్రాజెక్ట్‌కి అవసరమైన టూల్స్ అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఉదాహరణకు సిమ్యులేషన్ ద్వారా ఒక ప్రాజెక్టు చేయాలనుకుంటే దానికి సంబంధించిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయో లేదో నిర్ధారణ చేసుకోవాలి.

విభిన్న బ్రాంచిలకు వివిధ డొమెయిన్‌లు
ప్రతి ఇంజినీరింగ్ బ్రాంచిలోనూ కొన్ని ముఖ్యమైన ఉప శాఖలు ఉంటాయి. ఏదైనా ఒక ఉప విభాగంలో ప్రాజెక్ట్ చేయవచ్చు. ఇష్టమైన డొమెయిన్‌లో ప్రాజెక్టు చేస్తే అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
అభ్యర్థుల అవగాహన కోసం ఇంజినీరింగ్‌లో మూల శాఖలైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ బ్రాంచిలకు సంబంధించిన ముఖ్యమైన డొమెయిన్‌లను ఈ కింద పరిశీలించవచ్చు.

సివిల్ ఇంజినీరింగ్: సర్వేయింగ్ వంటి క్షేత్రస్థాయి ప్రాజెక్ట్‌లు * కాంక్రీట్ టెక్నాలజీ * డిజైన్ * స్టాడ్‌ప్రో సాఫ్ట్‌వేర్ వినియోగం * రవాణా * ఆర్‌సీసీ డిజైన్ * స్టీల్ డిజైనింగ్ * ప్రిస్ట్రెస్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్ డిజైన్ * స్టాడ్/ప్రొ ఈ-టాబ్ ఆధారిత ప్రాజెక్ట్ * ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ * కన్‌స్ట్రక్షన్, ఎస్టిమేషన్ *య జియోటెక్నికల్ ఇంజినీరింగ్ *వాటర్ రిసోర్సెస్.
ఈఈఈ/ఈసీఈ/ఈఐఈ: ఈ మూడు బ్రాంచిల వారికి కామన్‌గా ఉండే కొన్ని ప్రాజెక్టులు- ) * ఎంబెడెడ్ సిస్టమ్స్ ) *వీఎల్‌ఎస్‌ఐ ) * సిమ్యులేషన్ ప్రాజెక్ట్ (లాబ్ వ్యూ, మాట్‌లాబ్) ) * రియల్‌టైమ్ డీఐపీ ) * రోబోటిక్స్ ) *ఇన్‌స్ట్రుమెంటేషన్ ) * వర్చువల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ) * పీఎల్‌సీ - స్కాడా ) * ఆండ్రాయ్‌డ్ ) * అర్డుయినో
ఎలక్ట్రికల్: నీ పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నీ ఏసీ, డీసీ డ్రైవ్స్ నీ టెలిమెట్రీ నీ అన్‌ఇంటరప్టెడ్ పవర్ సప్లై నీ ఇన్‌వర్టర్స్ నీ ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా నీ లాస్‌లెస్ పవర్ ట్రాన్స్‌మిషన్ నీ పీసీబీ, పవర్ ప్యానెల్స్ నిర్మాణ,

నిర్వహణలు నీ పవర్ ఎలక్ట్రానిక్స్
ఈసీఈ/ఈఐఈ: * వీధి దీపాల స్వయం నిర్వహణ * రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత పాస్‌పోర్టులు * బయోమెట్రిక్ ప్రాజెక్ట్ * టచ్ స్క్రీన్ నిర్వహణ, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు * ఆర్‌ఎఫ్‌ఐడీ కమ్యూనికేషన్ డివైజెస్ * డేటా కలెక్షన్ అండ్ ప్రాసెసింగ్ ఫ్రమ్ శాటిలైట్స్ * మొబైల్ ఫోన్ ఆధారిత టెలిమెట్రీ * డిజిటల్ కంట్రోల్ సిస్టమ్స్ * థైరిస్టర్ కంట్రోల్ సిస్టమ్స్ * మైక్రో కంట్రోలర్ సిస్టమ్స్
మెకానికల్ ఇంజినీరింగ్: నీ ఆటోమొబైల్స్ * మాన్యుఫాక్చరింగ్ * రోబోటిక్స్ నీ కాడ్/ కామ్ * అగ్రికల్చర్ నీ థర్మల్ ప్రాజెక్ట్ *సీఎన్‌సీ మెషిన్స్ * ఆటోమేషన్ * మెకాట్రానిక్స్ *కాంపోజిట్స్ * మిసైల్ టెక్నాలజీ * డ్రోన్స్ *పౌడర్

మెటలర్జీ నీ ల్యూబ్రికేషన్ నీ పైప్‌లైన్ డిజైన్
కంప్యూటర్ సైన్స్: * ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ * క్లౌడ్ కంప్యూటింగ్ * డేటా సెక్యూరిటీ * డేటా మైనింగ్ *డేటాబేస్ సెక్యూరిటీ *డిస్ట్రిబ్యూటెడ్ నెట్‌వర్కింగ్ *గ్రిడ్ కంప్యూటింగ్ * ఇమేజ్ ప్రాసెసింగ్ * ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ *ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్స్ *నాలెడ్జ్ అండ్ డేటా ఇంజినీరింగ్ * మొబైల్ కంప్యూటింగ్ * నెట్‌వర్క్ సెక్యూరిటీ * కంప్యూటర్ నెట్‌వర్క్య్ న్యూరల్ నెట్‌వర్క్ * వర్చువల్ రియాలిటీ * పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ *రియల్ టైమ్ సర్వేయలెన్స్ సెక్యూరిటీ సిస్టమ్స్ * సిగ్నల్ ప్రాసెసింగ్ * డిజిటల్ ఫోరెన్సిక్స్ * వెబ్ సెక్యూరిటీ *వెబ్ మైనింగ్ * వైర్‌లెస్ సెన్సర్ నెట్‌వర్క్ * టెక్ట్స్‌మైనింగ్

ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్
ఐఓటీ - ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ ప్రస్తుతం చాలా ముఖ్యమైన డొమెయిన్. ఏ బ్రాంచ్ వారైనా తమ ప్రాజెక్ట్‌ను నెట్‌వర్క్ వాతావరణంలో ఇంటర్‌నెట్ ఆధారంగా వివిధ టెక్నాలజీల, సేవల అభివృద్ధి, నిర్వహణ ఈ డొమెయిన్ ప్రత్యేకతలు. హెల్త్‌కేర్, పారిశ్రామిక, రవాణా, సమాచార, భద్రత, వినోదం మొదలైన రంగాల్లో దీని వినియోగం ఎక్కువ. పరిశ్రమల్లోని కొన్ని ప్రత్యేక మైన పనులను ఐఓటీ ద్వారా చేయిస్తున్నారు. ప్రాజెక్ట్ ఎంపికలో ఈ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.
ప్రాజెక్టు అబ్‌స్ట్రాక్ట్
ముగ్గురితో టీమ్: ప్రాజెక్ట్ టీమ్‌లో ముగ్గురు మించకుండా చూసుకోవాలి. ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే సమంగా బాధ్యతలను పంచుకొని ప్రాజెక్ట్ పూర్తిచేయడం సులువవుతుంది. ఒక్కరే చేయాలనుకోవద్దు. ఇతరులతో కలిసి చేయడం మంచిది. మనతోపాటు ఆలోచించగలిగి, బాధ్యతలను పంచుకునే వారినే సభ్యులుగా ఎంచుకోవాలి.
అబ్‌స్ట్రాక్ట్: తాము చేయబోయే ప్రాజెక్ట్ వివరాలను క్లుప్తంగా టీమ్ సిద్ధం చేసుకోవాలి. ఇదే సారాంశం లేదా అబ్‌స్ట్రాక్ట్. ఇందులో సమస్య నిర్వచనం, ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ, పరిధి, పరిమితులు, అవసరాలు, ఉపయోగాలు, అవసరమైన టూల్స్, బృంద సభ్యుల వ్యక్తిగత బాధ్యతలు, గాంట్ చార్ట్ తదితర రూపాల్లో ప్రాజెక్ట్ ప్రణాళికలు ఉంటాయి. వాటిని కాలేజీ ప్రాజెక్ట్ కమిటీకి తమ గైడ్ ద్వారా సమర్పించాలి.
ప్రాజెక్టుల సంక్షిప్త సమాచారం, టైటిల్స్ ఇతర వివరాలు అందించే కొన్ని వెబ్‌సైట్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి