కేరళ వరద ఒక కనువిప్పు (GK sharing article)
మానవ తప్పిదమే..! పడమటి కనుమలకు చేటు ఫలితమే కేరళ విపత్తు!! మాధవ్ గాడ్గిల్ కమిటీ సిఫార్సుల్ని అటకెక్కించారు పర్యాటకుల స్వర్గధామం కేరళ నేడు కనీవినీ ఎరుగని ప్రకృతి ప్రకోపాన్ని చవిచూస్తోంది. కుండపోత వర్షాలతో భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇది మనిషి సృష్టించిన విపత్తేననేది పర్యావరణ నిపుణుడు మాధవ్ గాడ్గిల్ నిశ్చితాభిప్రాయం. పశ్చిమ కనుమల్లో పర్యావరణానికి కలిగిస్తున్న హాని నేడు ప్రకృతి వైపరీత్యం రూపంలో కేరళపై విరుచుకుపడుతోందని కుండబద్ధలు కొట్టారు. పశ్చిమ కనుమల పరిరక్షణపై సిఫార్సులు చేయడానికి మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ(డబ్ల్యూజీఈఈపీ) 2011 ఆగస్టు 31న ప్రభుత్వానికి 522 పేజీల నివేదికను సమర్పించింది. ప్రస్తుతం వర్షాల్లో నష్టపోయిన కేరళలోని పలు ప్రాంతాలు పర్యావరణపరంగా సున్నితమైన మండలాలు(ఈఎస్‌జెడ్) అంటూ కమిటీ ఆనాడే వర్గీకరించింది. మాధవ్ గాడ్గిల్ కమిటీ నివేదికను అధ్యయనం చేసి, అమలుకు సిఫార్సులు చేయడం కోసం ఆ తర్వాత ఏర్పాటుచేసిన కస్తూరీరంగన్ కమిటీ కూడా పశ్చిమ కనుమల పరిరక్షణకు పలు సిఫార్సుల...