టెక్నాలజీతో... కాలానికి కళ్లెం! (Eenadu_18/10/12)
ఉరుకుల పరుగుల జీవితం... రెండు చేతులు చాలనంత వేగం... ఈ నేపథ్యంలో సాంకేతికత తెలిస్తే... చిటికెలో పనులు చక్కబెట్టవచ్చు! భు జానికో ల్యాప్‌టాప్ బ్యాగు... చేతిలో ట్యాబ్లెట్... జేబులో మొబైల్... అన్నీ ఉంటాయి. కానీ, రోజు గడిచి ఇంటికొచ్చాక 'ఏంటో ఎంత ట్రై చేసినా రోజులో చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయి!' అనుకునే కోవలోకి మీరు వస్తారా? అయితే, మీరు టెక్నాలజీని సరిగా వాడుకోవట్లేదన్నమాట. ఉన్న గ్యాడ్జెట్స్‌్ సాయంతో మరింత సులువుగా పనులు చేసుకోవాలంటే కొన్ని కిటుకులు తెలియాలి. వెంటే వెబ్ సర్వీసులు రోజులో ఏయే పనులకు ఎంత సమయం కేటాయిస్తున్నామో, ఎక్కడ సమయం వృథా అవుతోందో లాంటి వివరాలను విశ్లేషించుకోవాంటే www.toggl . com లోకి వెళ్లాలి. ఈ టైం ట్రాకింగ్ సర్వీసును పీసీ, మ్యాక్, మొబైల్, ట్యాబ్లెట్‌ల్లో వాడుకోవచ్చు. దీంట్లో సభ్యులై చేయాల్సిన పనుల్ని జాబితా పెట్టుకుని వాటిపై ఎంతెంత సమయం కేటాయిస్తున్నామో ట్రాక్ చేయవచ్చు. * వేర్వేరు సోషల్ నెట్‌వర్క్‌లను ఒకేచోట యాక్సెస్ చేయాలంటే అందుకు ఓ వేదిక సిద్ధంగా ఉంది. అదే http://hootsuite.com. దీంట్లో సభ్యులై ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్.. ఎ...