మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్‌ అదిరింది! (Eenadu Thursday_04/10/12)

మెయిల్‌ ఐడీ... సర్వీసు ఏదైనా ఒకటి ఉండాల్సిందే... మరి సరికొత్త సౌకర్యాలతో మైక్రోసాఫ్ట్‌ గూటి నుంచి మరోటి వచ్చిందని తెలుసా?అదే హాట్‌ హాట్‌ 'అవుట్‌లుక్‌' అదిరే లుక్స్‌తో అలరిస్తోంది!
జీమెయిల్‌, యాహూ, ఇన్‌, ఏఓఎల్‌... ఇలా చెబుతూ పోతే మెయిల్‌ సర్వీసులు చాలానే. దేని ప్రత్యేకత దానిదే. జాబితాలో మిస్‌ అయిన మైక్రోసాఫ్ట్‌ హాట్‌మెయిల్‌ మరో కొత్త అవతారంతో ముందుకొచ్చింది. అది కేవలం మెయిల్‌ సర్వీసు మాత్రమే కాదు. బుల్లి హార్డ్‌డ్రైవ్‌ లాంటిది కూడా. ఫొటోలు మాత్రమే కాదు. డాక్యుమెంట్‌లు, వీడియోలు, మ్యూజిక్‌ ఫైల్స్‌ని కూడా భద్రం చేసుకోవచ్చు. అంతేనా? ఆఫీస్‌ డాక్యుమెంట్‌లను ఎప్పుడైనా ఎక్కడైనా ఎడిట్‌ చేసుకోవచ్చు. అందుకు అనువైన ఆఫీస్‌ సూట్‌ని మెయిల్‌లోనే యాక్సెస్‌ చేయవచ్చు. ఇలా చెప్పాలంటే చాలానే సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం!!సభ్యులవ్వండి!
అన్ని మెయిల్‌ ఐడీల్లో మాదిరిగానే దీంట్లోనూ పేరు వివరాలతో సభ్యులవ్వాలి. హోం పేజీ చాలా భిన్నంగా కనిపిస్తుంది. ప్రధానంగా మెయిల్‌, పీపుల్‌, క్యాలెండర్‌, స్కైడ్రైవ్‌ సదుపాయాల్ని థంబ్‌నెయిల్‌ బాక్స్‌ల్లో నిక్షిప్తం చేశారు. ఇక కంపోజ్‌ కోసం New ఉంది. మామూలు మెనూతోపాటు Quick Views అదనంగా కనిపిస్తుంది. మెయిల్‌లో భద్రం చేసుకున్న ఫొటోలు, డాక్యుమెంట్‌లు, ఇతర డేటా ఫైల్స్‌ని సులభంగా బ్రౌజ్‌ చేసుకుని చూడొచ్చు. కుడివైపు ఉన్న Arrange by తో విండోస్‌లో మాదిరిగా మెయిల్స్‌ వరుసక్రమాన్ని మార్చేవీలుంది.Viewమెనూలోని ఆప్షన్ల ద్వారా కావాల్సిన వాటిని మాత్రమే ఇన్‌బాక్స్‌లో కనిపించేలా చేయవచ్చు. ఉదాహరణకు సోషల్‌ నెట్‌వర్క్‌ అప్‌డేట్స్‌ మాత్రమే కావాలి అనుకుంటే View మెనూలోని 'సోషల్‌ అప్‌డేట్స్‌'ని చెక్‌ చేయాలి.
ఇక సెట్‌అప్‌ చేయండి!
మెయిల్‌లోకి లాగిన్‌ అవ్వగానే అవుట్‌లుక్‌ టీం మీకో మెయిల్‌ పంపుతుంది. మెయిల్‌ని సెట్‌అప్‌ చేసుకోవడానికి ఇదో వేదిక. అందుబాటులో ఉన్న కొన్ని అదనపు సౌకర్యాల్ని సెట్‌అప్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఇంతకు ముందే వాడుతున్న మెయిల్‌ ఐడీని అవుట్‌ ఐడీతో కలిపి వాడుకునే వీలుంది. పాత మెయిల్‌ ఐడీ వివరాల్ని ఎంటర్‌ చేసి సింక్రనైజ్‌ చేసుకోవచ్చు. అందుకు పీఓపీ సెట్టింగ్స్‌ని మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే, మెయిల్‌ నుంచే సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్‌ల్లోకి కనెక్ట్‌ అవ్వొచ్చు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, లింక్డిన్‌, ఫ్లిక్కర్‌... సర్వీసుల్ని యాక్సెస్‌ చేయవచ్చు. అందుకు సెట్‌అప్‌ మెయిల్‌లోని Connect to Facebook and twitter పై క్లిక్‌ చేయండి. ఒక్కసారి అవుట్‌లుక్‌ ఐడీతో ఫేస్‌బుక్‌లోకి లాగిన్‌ అయ్యాక మొత్తం అప్‌డేట్స్‌ అన్నీ మెయిల్‌లోనే చెక్‌ చేసుకోవచ్చు. అంతేనా! మెస్సెంజర్‌ నుంచే ఫేస్‌బుక్‌ సభ్యులతో ఛాటింగ్‌ చేసే వీలుంది. ఫేస్‌బుక్‌లోని ఫొటోలు, వీడియోలను అవుట్‌లుక్‌ నుంచే చూడొచ్చు. ఫొటోలు, వీడియోలను ఇన్‌బాక్స్‌ నుంచే పోస్ట్‌ చేయవచ్చు. స్కైడ్రైవ్‌లో భద్రం చేసిన డాక్యుమెంట్‌లు, ఇతర ఫైల్స్‌ని ఒకే క్లిక్కుతో షేర్‌ చేయవచ్చు. ఇదే మాదిరిగా ట్విట్టర్‌, ఫ్లిక్కర్‌ల్లోకి కూడా లాగిన్‌ అవ్వొచ్చు. ఇతర మెయిల్‌ సర్వీసుల్లోని కాంటాక్ట్స్‌ని కూడా సెట్‌అప్‌ నుంచే ఇంపోర్ట్‌ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌, జీమెయిల్‌, ఇన్‌, ట్విట్టర్‌ సర్వీసుల్లోని అడ్రస్‌లను ఇంపోర్ట్‌ చేసుకునే వీలుంది. విండోస్‌ ఫోన్‌, ఐఫోన్‌, ఇతర ఆండ్రాయిడ్‌ మొబైళ్లలో అవుట్‌లుక్‌ని పొందేందుకు సెట్‌అప్‌ని ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ స్టోర్‌ నుంచి అప్లికేషన్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. http://goo.gl/mA1gC
ఇవే థంబ్‌నెయిల్స్‌
కనిపించే థంబ్‌నెయిల్స్‌లో మెయిల్‌ మొదటిది. రెండోది 'పీపుల్‌'. కాంటాక్ట్స్‌ని మేనేజ్‌ చేసుకునే విభాగం. మెయిల్‌ ఐడీలో ఉన్న అందర్నీ దీంట్లో చూడొచ్చు. ఇతర వెబ్‌ సర్వీసుల నుంచి కాంటాక్ట్స్‌ని ఇంపోర్ట్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఫేస్‌బుక్‌ అడ్రస్‌లను పొందాలంటే Facebook email Addresses పై క్లిక్‌ చేయాలి. ఇక పీపుల్‌ విభాగంలో ఎడమవైపు కనిపించే ప్రొఫైల్స్‌పై క్లిక్‌ చేసి వాడుతున్న అన్ని సోషల్‌ సర్వీసుల్ని యాక్సెస్‌ చేసే వీలుంది. పేరు, అడ్రస్‌, పుట్టినరోజు.... వివరాలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ని ఓపెన్‌ చేసి మెసేజ్‌లు పంపొచ్చు. Write on wall పై క్లిక్‌ చేసి ఎఫ్‌బీ వాల్‌పై పోస్టింగ్స్‌ చేయవచ్చు. ఫేస్‌బుక్‌ లోగోపై క్లిక్‌ చేసి సరాసరి స్నేహితుడి ఫ్రొఫైల్‌లోకి వెళ్లొచ్చు. ఇదే మాదిరిగా ఇతర సోషల్‌ నెట్‌వర్క్‌ ప్రొఫైల్స్‌ని కూడా యాక్సెస్‌ చేసే వీలుంది. కుడివైపు ఛాటింగ్‌ మెస్సెంజర్‌ని ఏర్పాటు చేశారు. Start New Conversation పై క్లిక్‌ చేస్తే ఆన్‌లైన్‌ అందుబాటులో ఉన్న సభ్యుల జాబితా కనిపిస్తుంది. కనిపించే Addపై క్లిక్‌ చేసి ఇతర నెట్‌వర్క్‌ కాంటాక్ట్స్‌ని మెస్సెంజర్‌లోకి యాడ్‌ చేసుకోవచ్చు. ఇక థంబ్‌నెయిల్‌లో మూడోది 'క్యాలెండర్‌'. అన్ని సౌకర్యాలతో కూడిన హాట్‌మెయిల్‌ క్యాలెండర్‌. పండగలు, పుట్టినరోజులు అన్నీ డీఫాల్ట్‌గా యాడ్‌ అయ్యి కనిపిస్తాయి. చేయాల్సిన పనుల్ని To do Listట్యాబ్‌లో పెట్టుకోవచ్చు. క్యాలెండర్‌లో రోజువారీగా ముఖ్యమైన ప్రొగ్రాంలను సెట్‌ చేసుకోవాలంటే Newలోకి వెళ్లి 'ఈవెంట్‌'ని సెలెక్ట్‌ చేస్తే సరి. నెట్‌వర్క్‌ సభ్యులతో క్యాలెండర్‌ని షేర్‌ చేసుకోవచ్చు.
ఇదో బుల్లి హార్డ్‌డ్రైవే!
చివరి థంబ్‌నెయిల్‌ ఐకానే 'స్కైడ్రైవ్‌'. 7 జీబీ స్టోరేజ్‌ మెమొరీని ఉచితంగా పొందొచ్చు. డాక్యుమెంట్‌లు, ఫొటోలు, వీడియోలు... ఏదైనా డ్రైవ్‌లో భద్రం చేసుకోవచ్చు. విండోస్‌లో మాదిరిగా అప్‌లోడ్‌ చేసిన ఫైల్స్‌ని వివిధ రకాలుగా బ్రౌజ్‌ చేసుకోవచ్చు. ఫోల్డర్లు క్రియేట్‌ చేసుకుని వేటికవే సేవ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ డ్రైవ్‌ నుంచి ఏవైనా ఫైల్స్‌ని తొలగిస్తే 'రీసైకిల్‌ బిన్‌' ఉంది. డిలీట్‌ చేసినవి అన్నీ దాంట్లో భద్రంగా ఉంటాయి. డ్రైవ్‌ నుంచే ఆయా ఫైల్స్‌ని నెట్‌వర్క్‌ సభ్యులతో షేర్‌ చేసుకోవచ్చు. అప్‌లోడ్‌పై క్లిక్‌ చేసి ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్‌ని ఒకేసారి అప్‌లోడ్‌ చేసుకునే వీలుంది. కీబోర్డ్‌లోని కంట్రోల్‌ కీని నొక్కి ఉంచి ఫైల్స్‌ని సెలెక్ట్‌ చేయాలి. కొత్త ఫోల్డర్లను క్రియేట్‌ చేయడానికిCreateఉంది. 'సెర్చ్‌' ద్వారా డ్రైవ్‌లోని కావాల్సిన ఫైల్స్‌ని వెతికి పట్టుకునే వీలుంది. 'మేనేజ్‌' ఆప్షన్‌తో డ్రైవ్‌లోని ఫైల్స్‌, ఫోల్డర్లను Rename, Delete, Move చేయవచ్చు. ఏదైనా ఫైల్స్‌ని Embed కోడ్‌తో సైట్‌ల్లో నిక్షిప్తం చేసుకోవచ్చు. Sort by తో ఫైల్స్‌ అన్నింటినీ క్రమపద్ధతిలో చూడొచ్చు. డ్రైవ్‌లో మరింత ఎక్కువ స్పేస్‌ కావాలనుకుంటే Manage Storage లోకి వెళ్లాలి. ఏదాదికి రూ.520 చెల్లించి 20 జీబీ పొందొచ్చు. మరిన్ని ప్లాన్లు ఉన్నాయి. స్కైడ్రైవ్‌ని సాఫ్ట్‌వేర్‌ మాదిరిగా ఇన్‌స్టాల్‌ చేసుకుని ఫైల్స్‌ని ఇట్టే సింక్రనైజ్‌ చేసుకోవచ్చు. http://goo.gl/6HgFq
వెనువెంటే 'ఆఫీస్‌'
వాడుకోవడానికి స్పేస్‌ ఉంటే సరిపోతుందా? సాఫ్ట్‌వేర్‌ లేకుండా ఎలా అనుకుంటే ఆఫీస్‌ సూట్‌ని ఉచితంగా వాడుకోవచ్చు. వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌, వన్‌నోట్‌.... అప్లికేషన్స్‌ని యాక్సెస్‌ చేయవచ్చు. అందుకు స్కైడ్రైవ్‌లోని Create పైన క్లిక్‌ చేయాలి. వర్డ్‌ డాక్యుమెంట్‌ని క్రియేట్‌ చేయాలంటే word document పై క్లిక్‌ చేసి టైటిల్‌ ఎంటర్‌ చేయగానే మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ ఓపెన్‌ అవుతుంది. అన్ని హంగులతో వర్డ్‌ డాక్యుమెంట్‌ని క్రియేట్‌ చేసి సేవ్‌ చేసుకోవచ్చు. అన్ని రకాలుగా టెక్స్ట్‌ డాక్యుమెంట్‌ని ఫార్మెట్‌ చేయవచ్చు. Docxఎక్స్‌టెన్షన్‌తో ఫైల్‌ సేవ్‌ అవుతుంది. ఇదే మాదిరిగా ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌లను కూడా క్రియేట్‌ చేయవచ్చు. ఒకవేళ అప్‌లోడ్‌ చేసిన డాక్యుమెంట్‌ ఫైల్స్‌ని ఎడిట్‌ చేయాలంటే ఫైల్‌ని ఓపెన్‌ చేసి Edit in Browserపై క్లిక్‌ చేయాలి. ఇతరులతో పంచుకోవడానికి Shareఉంది. మైక్రోసాఫ్ట్‌ 'వన్‌నోట్‌'తో చేయాల్సిన పనులతో రోజువారీ షెడ్యూల్‌ని సులువుగా క్రియేట్‌ చేసుకోవచ్చు. పొరబాటున డిలీట్‌ చేసిన వాటిని Undo all తో తిరిగి పొందొచ్చు.
కావాల్సిన వాటినే!
క్విక్‌ వ్యూలోని ఏర్పాటు చేసిన ఆప్షన్లతో కావాల్సిన మెయిల్స్‌ని సులభంగా వెతికి పట్టుకోవచ్చు. ఉదాహరణకు ఫొటోలతో కూడిన మెయిల్స్‌ మాత్రమే కావాలనుకుంటే 'ఫొటోస్‌'పై క్లిక్‌ చేస్తే చాలు. డాక్యుమెంట్‌ ఎటాచ్‌మెంట్స్‌తో కూడిన మెయిల్స్‌ కావాలంటే 'డాక్యుమెంట్స్‌' ఉంది. మరేదైనా కొత్త అంశంతో వెతకాలంటే 'న్యూ కేటగిరి'లో అంశాన్ని ఎంటర్‌ చేయాలి.
సెట్టింగ్స్‌ గుర్తుపై క్లిక్‌ చేసి మెయిల్‌ని మారిన్ని మార్పులు చేసుకోవచ్చు. ప్రధానంగా కనిపించే టైటిల్‌బార్‌కి మీకు నచ్చిన రంగుని అప్త్లె చేయవచ్చు.Reading Pane ని మీకు అనువుగా సెట్‌ చేసుకోవచ్చు. మరిన్ని సెట్టింగ్స్‌ కోసం More mail Settings ఉంది. మరెందుకాలస్యం www.outlook.comలోకి వెళ్లండి.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు