గూగుల్‌ గూటిలో...అలరించే పది! (Eenadu Thursday_11/10/12)

నెట్‌ ఓపెన్‌ చేస్తే...గూగుల్‌లే ముఖద్వారం! మీకు తెలుసా?నిత్యం వాడే గూగుల్‌ గూటిలో...ఎక్కువగా వెలుగులోకిరాని...పది విలువైన సర్వీసులున్నాయి!
గూగుల్‌లోకి వెళ్లగానే సమాచారమో... ఇమేజ్‌లో... వీడియోలో... వార్తలో ఇలా కావాల్సినవి వెతుక్కుని విహారాన్ని కొనసాగిస్తాం. ఇవేం కాకుండా గూగుల్‌లో స్థావరంలో మరికొన్ని ఆకట్టుకునే సర్వీసులు ఉన్నాయి. ఒక్కసారి మీ జీమెయిల్‌లోకి లాగిన్‌ అయితే చాలు. అన్ని సర్వీసుల్ని ఉచితంగా వాడుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వంటల వివరాల్ని ఒకేచోట పొందొచ్చు. గూగుల్‌ మ్యాపింగ్‌తో వేర్వేరు ప్రాంతాల్ని ఎక్స్‌ప్లోర్‌ చేసి మరిన్ని వివరాల్ని మ్యాపింగ్‌లో పొందుపరచొచ్చు. మీ ఆసక్తుల మేరకే బ్రౌజింగ్‌ చేయడం, మెయిల్‌ ఐడీ నుంచి చేసిన పనులను తెలుసుకోవడం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మరి, ఆయా సర్వీసుల సంగతులేంటో వివరంగా తెలుసుకుందాం!క్లిక్‌ చేస్తే ఘుమఘుమలు!
ఏదైనా ప్రత్యేక రెసిపీ గురించి తెలుసుకోవాలన్నా, వంటకానికి సంబంధించిన వీడియో చూడాలన్నా... గూగుల్‌ సెర్చ్‌లోకి వెళ్లి కనిపించే లింక్‌లన్నీ వెతకాల్సిన అవసరం లేదు. గూగుల్‌ అందించే ప్రత్యేక అడ్డాలోకి వెళితే సరి. అందుకుhttp://goo.gl/0oCeaలింక్‌లోకి వెళ్లండి. సర్వీసు పేరు Cookin with Google. సెర్చ్‌బాక్స్‌లో హోం పేజీ కనిపిస్తుంది. మీకు కావాల్సిన వంటకాన్ని టైప్‌ చేసి ఎంటర్‌ కొడితే అనవసర లింక్స్‌ రిజల్ట్స్‌లో కనిపించవు. కేవలం వెతికిన వంటకి సంబంధించిన సెర్చ్‌ రిజల్ట్స్‌ మాత్రమే వస్తాయి. ప్రఖ్యాతి పొందిన వంటల వెబ్‌ సర్వీసుల్ని గూగుల్‌ సెర్చ్‌లో నిక్షిప్తం చేశారు. foodview, Cooks, Yumyum, fooddownunder, netcooks... సర్వీసుల్లోని వంటకాలన్నీ కనిపిస్తాయి. సెర్చ్‌ ఫలితాల్ని web, Imageట్యాబ్‌ల్లో పొందొచ్చు. అలాగే, LowFatతక్కువ కొవ్వుతో కూడిన వంటల వివరాల్ని ప్రత్యేకంగా తెలుసుకోవచ్చు. Diabeticవిభాగంలో కేవలం మధుమేహంతో బాధపడే వారు తినే వంటల విశేషాల్ని తెలుసుకునే వీలుంది. కేవలం శాఖాహార వంటకాల కోసం Vegetarian ఉంది.
మీరూ భాగస్వాములే!
గూగుల్‌ మ్యాపింగ్‌లో ఏదైనా ప్రాంతానికి సంబంధించి అదనపు సమాచారాన్ని పొందుపరచాలంటే చాలా సులువు. Google Map Makerలోకి వెళితే సరి. సుమారు 200 దేశాలకు సంబంధించిన గూగుల్‌ మ్యాప్‌, గూగుల్‌ ఎర్త్‌ వివరాల్ని అప్‌డేట్‌ చేసేందుకు ఇదో వారధి. గూగుల్‌ ఐడీతో లాగిన్‌ అయ్యాక ఏ ప్రాంతానికి సంబంధించిన అదనపు వివరాలనైనా పొందుపరచవచ్చు. మీకు తెలిసిన ప్రాంతాన్ని గూగుల్‌ మ్యాపింగ్‌లో పొందుపరచాలంటే Add Place పై క్లిక్‌ చేయండి. ముందే ఉన్న వాటిని ఎడిట్‌ చేయడానికి Edit Place ఉంది. యూజర్లు అప్‌లోడ్‌ చేసిన వివరాల్ని గూగుల్‌ మ్యాపింగ్‌ నిపుణులు రివ్యూ చేసి సరైన సమాచారమేనని తేల్చుకున్నాక అందరికీ అందుబాటులో ఉంచుతారు. మరిన్ని వివరాలకుwww.google.com/mapmaker
ఆసక్తి మేరకే!
గూగుల్‌లో మీరుంటున్న ప్రాంతానికి అనుగుణంగా మీ ఆసక్తుల మేరకు ఎలాంటి అప్‌డేట్స్‌ చోటు చేసుకుంటున్నాయో తెలుసుకోవాలంటే అందుకు గూగుల్‌ ప్రత్యేక సర్వీసుని అందిస్తోంది. అదేSchemer.ఐడీలో లాగిన్‌ అయ్యి లొకేషన్‌ ఎంటర్‌ చేయాలి. తర్వాత వచ్చిన పేజీలో మీకు ఆసక్తికరమైన వాటిని చెక్‌ చేయవచ్చు. దీంతో ఆయా ఆప్‌లేడ్స్‌తో హోం పేజీ వస్తుంది.Find Stuff to doట్యాబ్‌లో అప్‌డేట్స్‌ అన్నీ కనిపిస్తాయి. వాటిల్లో ఆసక్తిగా అనిపించిన వాటిని Your Schemes లో పెట్టుకోవచ్చు. ఇలా స్కీమ్స్‌లో భద్రం చేసుకున్న అప్‌డేట్స్‌ని గూగుల్‌ ప్లస్‌ నెట్‌వర్క్‌ సభ్యులతో పంచుకునే వీలుంది. ఉదాహరణకు కొత్తగా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన గ్యాడ్జెట్‌ వివరాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఆసక్తుల్లో 'గ్యాడ్జెట్‌'లను చెక్‌ చేయాలి. Accomplicesతో వెళ్లి స్నేహితులకు ఆహ్వానాల్ని పంపి నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. స్నేహితులు బ్రౌజ్‌ చేస్తున్న విభాగాల్ని కూడా తెలుసుకోవచ్చు. www.schemer.com
వారికి ప్రత్యేకం!
ఏదైనా అంశానికి సంబంధించి వ్యాసాలు, పుస్తకాల వివరాలు తెలుసుకోవాలంటే ప్రత్యేక వేదిక సిద్ధంగా ఉంది. అదే http://scholar.google.com. హోం పేజీలోని సెర్చ్‌బాక్స్‌లో టాపిక్‌ని ఎంటర్‌ చేసి సెర్చ్‌ చేయండి. వచ్చిన ఫలితాల్ని గమనిస్తే ఆయా వ్యాసాలు, పుస్తకాలకు సంబంధించిన పేటెంట్స్‌, వ్యాసకర్తలు, అందుబాటులో ఉన్న అధికారిక లింక్‌ల వివరాలు కనిపిస్తాయి. పీడీఎఫ్‌ డాక్యుమెంట్‌లను సులభంగా గుర్తించొచ్చు. 'క్రియేట్‌ అలర్ట్‌'తో వాటిని మెయిల్‌కి అందేలా చేయవచ్చు.
రిపోర్ట్‌ కావాలంటే?
నెట్‌లో మీ కార్యకలాపాల గురించి అన్ని వివరాలను తెలుసుకోవాలంటే Google Account Activity సిద్ధంగా ఉంది. ఐడీ వివరాలతో లాగిన్‌ అయితే చాలు. మీ మెయిల్‌ ఎకౌంట్‌ నుంచి మీరు చేసిన మొత్తం బ్రౌజింగ్‌ వివరాల్ని పొందొచ్చు. మెయిల్‌ ఐడీతో మీరు వాడే సర్వీసుల్లో చేసిన అప్‌డేట్స్‌ని రికార్డ్‌ చేస్తుంది. ఉదాహరణకు గూగుల్‌ డ్రైవ్‌ నుంచి ఏదైనా డేటాని డిలీట్‌ చేసినా రికార్డ్‌ చేస్తుంది. మీరు ఎక్కువగా చేసిన సెర్చ్‌లను 'టాప్‌ సెర్చ్‌' జాబితాగా అందిస్తుంది. మరిన్ని వివరాలకు http://goo.gl/niMGv
వెబ్‌సైట్‌ ఉందా?
మీరేదైనా వెబ్‌సైట్‌ను నిర్వహిస్తుంటే అందుకు కావాల్సిన చిట్కాలు తెలిపేందుకు గూగుల్‌ ఉచితంగా వెబ్‌ సర్వీసుని అందిస్తోంది. అందుకు Google WebMasters లో సభ్యులైతే సరి. గూగుల్‌ ర్యాంకింగ్‌లో ఇక పోటీకి సిద్ధం కావచ్చు. సైట్‌ ఇండెక్సింగ్‌, ర్యారింగ్‌,Search Engine Optimisation విభాగాలపై అవగాహన లేకపోయినప్పటికీ 'వెబ్‌మాస్టర్స్‌'తో సైట్‌ని పాపులర్‌ చేయవచ్చు. సైట్‌ వ్యూస్‌ని ఎలా పెంచుకోవచ్చనేది చిట్కాల ద్వారా తెలుసుకునే వీలుంది. సైట్‌ ట్రాఫిక్‌ వివరాలు, ఇతర రిపోర్ట్‌లను ఉచితంగా పొందొచ్చు.www.google.com/webmasters
వీడియో ఛాటింగ్‌
వీడియో ఛాటింగ్‌ని మరింత సులువుగా చేయాలంటే గూగుల్‌ ప్లస్‌లో అందుబాటులో ఉన్న Hangoutలోకి వెళ్లాల్సిందే. ఒకేసారి 10 మంది స్నేహితులతో ఛాట్‌ చేయవచ్చు. డెస్క్‌టాప్‌, ఫోన్‌, ట్యాబ్లెట్‌ల్లో సపోర్ట్‌ చేస్తుంది. ఒకటికంటే ఎక్కువ మందితో ఛాట్‌ చేస్తున్నప్పుడు గ్రూపులో ఏ వ్యక్తి మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని ఆటోమాటిక్‌గా గుర్తించి మెయిన్‌ విండోలో చూపిస్తుంది. మీ వీడియో ఛాటింగ్‌ని యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా లైవ్‌గా అందుబాటులో ఉంచొచ్చు. ప్రముఖల హ్యాంగ్‌అవుట్‌ వీడియోలను కూడా చూడొచ్చు.http://plus.google.com/hangouts
ఇదో కమ్యూనిటీ!
ఏదైనా అంశంపై చర్చలు జరిపే ఓపెన్‌ ఫారం లాంటిదే Google Moderator. పేరు, లోకేషన్‌తో లాగిన్‌ అయ్యి చర్చని ప్రారంభించొచ్చు. ప్రశ్న, టాపిక్‌ రూపంలో ఏదైనా అంశాన్ని పోస్ట్‌ చేసి చర్చకు ఆహ్వానించొచ్చు. Visitorsమీరు పోస్ట్‌ చేసిన ప్రశ్నపై వారి అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పోస్ట్‌ చేస్తారు. ఈమెయిల్‌ ద్వారా కామెంట్‌ని పంపొచ్చు.www.google.com/moderator
అవి ఒక్కటే!
ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యే అప్‌డేట్స్‌లో ఏదైనా ప్రత్యేక అంశానికి సంబంధించిన వాటిని మాత్రమే తెలుసుకోవాలంటే అందుకు Google Alerts ఉంది. లింక్‌లోకి వెళ్లి ఐడీతో లాగిన్‌ అయ్యాక Search Query, Result Type, How often, How many... మెనూలను సెలెక్ట్‌ చేసుకుని అలర్ట్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు.www.google.com/alerts
అన్ని అక్కడే!
సందర్భానికి అనుగుణంగా మారే గూగుల్‌ లోగోలనుDoodlesఅని పిలవడం తెలిసిందే. అవన్నీ ఒకేచోట చూడాలంటే www.google.com/doodles లో చూడొచ్చు. 1998 నుంచి డిజైన్‌ చేసిన అన్ని Doodlesని జాబితాగా పొందుపరిచారు. మన దేశానికి సంబంధించినవి చూడాలంటే ఫిల్టర్‌ మెనూలోకి వెళ్లి మన దేశాన్ని ఎంపిక చేస్తే సరి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు