అయ్యే ఆంధ్రప్రదేశ్
అన్నింటా వెనుకబడ్డ రాష్ట్రం వృద్ధిరేటులో రాష్ట్రానిది 11వ స్థానం వృద్ధిరేటు, తలసరి ఆదాయం పెరుగుదలలో అగ్రపథాన బీహార్ ఆయుర్దాయంలో కేరళ, తమిళనాడు, కర్ణాటకలు నిగ్గుతేల్చిన ఆర్థిక సర్వే అక్షర క్రమంలో అగ్రభాగాన ఉన్నాం... హైటెక్ హంగులతో ముందుకెళుతున్నామంటూ ఇన్నాళ్లూ మన రాష్ట్రం గురించి గొప్పలు చెప్పుకున్నాం. వాస్తవాలు మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉన్నాయి. ఉపాధి హామీలో తప్ప... ఇతర అనేక కీలకాంశాలు, రంగాల్లో ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడి ఉందన్నది... బుధవారం పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వే చెప్పిన చేదు నిజం. మన వెనుకబాటు స్థాయి ఎంతంటే... అనేక రంగాల్లో దక్షిణాది రాష్ట్రాలతోనే కాకుండా బీహార్, మధ్యప్రదేశ్‌ల కన్నా తక్కువగా ఉంది. వృద్ధిరేటు, తలసరి ఆదాయాల్లో బీహార్ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ సగటుల్లోనూ వెనుకబాటే మన పాట. రాష్ట్రం.. తిరోగమనం అన్నింటా వెనకబాటే ఉపాధి హామీ పనుల కల్పనలోనే మెరుగు ఆరోగ్య కేంద్రాల్లో ముందున్న తమిళనాడు, కర్ణాటకలు నిజాలు నిగ్గుతేల్చిన ఆర్థిక సర్వే 2012-13 ఈనాడు - హైదరాబాద్ వృ ద్ధిరేటు, తలసరి ఆదాయంలో పెరుగుదల, గ్రామీణ, పట్టణ పేదరికం, నిరుద్యోగం, స్త్రీ- పురుషుల...