చోటు ఒక్కటే...సర్వీసులెన్నో! (Eenadu Thursday_07/02/13)
వివిధ క్లౌడ్ స్టోరేజ్ సర్వీసుల్ని వాడుతున్నారా? అన్నింటినీ ఒకేదాంట్లో పొందవచ్చు! అనేక ఫొటో షేరింగ్ సర్వీసులు ఉన్నాయా? వాటన్నిటినీ అనుసంధానం చేయవచ్చు! వార్తా వేదికలెన్నో చూస్తున్నారా? వాటిని ఒకే చోట చూడవచ్చు! వేర్వేరు ఛాటింగ్ సర్వీసులున్నాయా? అన్నింటినీ ఒక దగ్గరే చేర్చవచ్చు! - అందుకు అనువైన మార్గాలున్నాయి! అవేంటో చూద్దామా?ఒక్కో అవసరానికి ఒక్కో వెబ్ సర్వీసుని వాడడం సర్వసాధారణం. ఈ క్రమంలో అనేక సర్వీసుల్లోకి లాగిన్ అవుతుంటాం. ఉదాహరణకు ఎక్కడైనా... ఎప్పుడైనా ఫైల్స్, ఫొటోలను పొందేందుకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న క్లౌడ్ స్టోరేజ్‌లను వాడుతుంటాం. ఒక్కో దాంట్లో అందిస్తున్న ఉచిత స్పేస్‌ని వాడుకుని పెద్ద క్లౌడ్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాం. కానీ, ఆయా సర్వీసుల్ని విడి విడిగా వాడుకోవాలంటే కాస్త కష్టమే. అన్నింటినీ ఒకే చోట పొందేందుకు మార్గం ఉంది. అందుకు అనువైన వెబ్ సర్వీసులు, మొబైల్ ఆప్స్ సిద్ధంగా ఉన్నాయి. ఉచితంగా వాడుకోవచ్చు.ఒకటి కంటే ఎక్కువే... అవసరం మేరకు అందుబాటులో ఉన్న క్లౌడ్ స్టోరేజ్ సర్వీసుల్ని ఒకే మార్గం ద్వారా పొందాలంటేwww.otixo.comలో సభ్యులైపోండి. డ్రాప్‌బాక్స్, గూగుల్ డ్రైవ్, బాక్స్, స్కైడ్రైవ్, షుగర్‌సింగ్, పికాసా, ఉబుంటుఒన్, వోన్‌క్లౌడ్, ఆమెజాన్ ఎస్3, ఫేస్‌బుక్, ఇతర ఎఫ్‌టీపీ సర్వర్లను దీన్నుంచే పొందొచ్చు. ఉచిత సభ్యులుగా లాగిన్ అవ్వగానే అన్ని క్లౌడ్ స్లోరేజ్ సేవల్ని ప్రత్యేక ఇంటర్ఫేస్‌లో చూపిస్తుంది. అన్ని ఎకౌంట్‌ల్లోని ఫైల్స్‌ని సిస్టంలోని డ్రైవ్‌ల్లో మాదిరిగా చూడొచ్చు. ఒక సర్వీసు నుంచి మరో దాంట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో ఫైల్స్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. ఆయా సర్వీసుల్లోని ఫైల్స్‌ని రీనేమ్, డిలీట్, అప్‌లోడ్ చేయవచ్చు. ఫైల్స్‌ని అక్కడే ప్రివ్యూ చూసుకునే వీలుంది. డాక్యుమెంట్స్‌ని 'గూగుల్ డాక్స్'లో ఓపెన్ అవుతాయి. కస్టమ్ లింక్‌లను క్రియేట్ చేసి ఫైల్స్‌ని స్నేహితులకు షేర్ చేయవచ్చు. అందరికీ అందుబాటులో ఉండేలా 'పబ్లిక్' వ్యూలో కూడా పెట్టొచ్చు. అందుబాటులో అన్ని క్లౌడ్ సర్వీసుల్ని 'సెర్చ్'తో వెతకొచ్చు. ప్రీమియం ఎకౌంట్‌తో మరిన్ని సేవల్ని పొందొచ్చు.సాఫ్ట్‌వేర్ మాదిరిగా సిస్టంలోని ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. * ఆప్ రూపంలో మొబైళ్లలో ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ స్టోర్ నుంచి పొందొచ్చు. సుమారు 20 క్లౌడ్ సర్వీసులు మునివేళ్లపైనే. ఫొటో ఆల్బమ్స్ నుంచి ఫొటోలను ఆప్‌లోడ్ చేసుకుని భద్రం చేసుకోవచ్చు.http://goo.gl/MBQSw * యాపిల్ యూజర్లు ఐట్యూన్స్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోండి. http://goo.gl/VA7ee ఫొటో అడ్డాలా? ఫొటోలను భద్రం చేయడానికి ఆన్‌లైన్ స్థావరాలు అనేకం. ఇప్పటికే మీరు వాడే వేర్వేరు ఫొటో షేరింగ్ సర్వీసులను ఒకే స్థావరం నుంచి పొందాలంటే,www.everpix.com వెబ్ సర్వీసులో సభ్యులైపోండి. 30 రోజుల ట్రయల్ వెర్షన్ని పొందొచ్చు. లాగిన్ అవ్వగానే ఫేస్‌బుక్, ట్విట్టర్,ఫ్లిక్కర్, పికాసా, Instagram... లాంటి ఫొటో షేరింగ్ నెట్‌వర్క్‌ల్లోని ఫొటోలను ఒకేచోట చూడొచ్చు. ఆయా సోషల్ నెట్‌వర్క్‌ల్లో మీరు టాగ్ చేసిన వాటిని కూడా చూడొచ్చు. అన్ని ఫొటోలను ఆటోమాటిక్‌గా Service, Yearఆధారంగా సర్ది చూపిస్తుంది. 'కస్టమ్ ఆల్బమ్స్'ని క్రియేట్ చేసుకుని షేర్ చేయవచ్చు. 'సోషల్' కలయిక... రెండు... మూడు సోషల్ నెట్‌వర్క్‌ల్లో సభ్యులై ఉంటే వాటిని ఒకే వారధి ద్వారా పొందడానికి మార్గం ఉంది. అదే www.grabinbox.com. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ పేజెస్,LinkedIn...నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. ఒకే క్లిక్కుతో అన్ని నెట్‌వర్క్‌ల్లోనూ ఒకేసారి పోస్టింగ్స్ చేయవచ్చు. 'షెడ్యూల్ మెసేజ్'ల ద్వారా ముందే మేసేజ్‌లు పంపొచ్చు. * ఇలాంటిదే మరోటి http://hootsuite.com. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5 మిలియన్ల యూజర్లు వాడుతున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్, మైస్పేస్, Fouresquare, mixi,LinkedIn, wordpress, యూట్యూబ్, ఫ్లిక్కర్... లాంటి మరిన్ని ఆప్స్‌ని మేనేజ్ చేయవచ్చు. * ఆన్‌లైన్‌లో మాత్రమే కాదు. ఆప్ రూపంలో స్మార్ట్ మొబైళ్లలో ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ స్టోర్ నుంచి ఉచితంగా నిక్షిప్తం చేసుకోండి. http://goo.gl/Bi7tg * యాపిల్ యూజర్లు ఐట్యూన్స్ నుంచి పొందొచ్చు.http://goo.gl/GdW2w * బ్లాక్‌బెర్రీ యూజర్లు ఆప్‌వరల్డ్‌కి వెళ్లండి. http://goo.gl/WZF5A వార్తా వారధి! ఆన్‌లైన్‌లో న్యూస్ సర్వీసులు, వార పత్రికలు, బ్లాగుల్ని చూసే అలవాటుంటే వాటిని ఒకే వేదిక నుంచి పొందవచ్చు. అందుకు www.pulse.me వెబ్ సర్వీసులో సభ్యులైపోండి. Art & Design, Politics, Technology, Business, Science...అంశాలు కనిపిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా 750 వార్తా ప్రచురణ కర్తలు (పబ్లిషర్స్) వారి 'న్యూస్ సర్వీసుల్ని' ప్లస్‌తో జతపరిచారు. ఒక రోజుకి సుమారు 10 మిలియన్ల కథనాల్ని దీంట్లో బ్రౌజ్ చేస్తున్నారు. 20 మిలియన్ల యూజర్లు ప్లస్ సర్వీసుని యాక్సెస్ చేస్తున్నారు. మీరు ఏదైనా బ్లాగు, వెబ్‌సైట్ లాంటివి నిర్వహిస్తున్నట్లయితే దీంట్లో జతచేయవచ్చు. * ఆప్ రూపంలో స్మార్ట్ మొబైళ్లలో వాడుకోవచ్చు కూడా. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే నుంచి నిక్షిప్తం చేసుకోండి. http://goo.gl/y5O6i * ఐఫోన్ యూజర్లు ఐట్యూన్స్ నుంచి పొందొచ్చు.http://goo.gl/mGxPS * విండోస్ ఫోన్ వాడుతున్నట్లయితే http://goo.gl/jeafQ * బ్లాక్‌బెర్రీ యూజర్లు ఆప్‌వరల్డ్‌లోకి వెళ్లండి.http://goo.gl/XbELg ముచ్చటించండి! స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆన్‌లైన్ ముచ్చట్లు పెడుతున్నారా? ఒక్కో సర్వీసులోకి విడి విడిగా లాగిన్ అయ్యి మెస్సెంజర్‌లను చెక్ చేయడం కష్టంగా ఉందా? అయితే, http://imo.imలోకి లాగిన్ అయితే సరి. ఒకే వేదికపై ఎమ్మెస్‌ఎన్, స్కైప్, ఫేస్‌బుక్ ఛాట్, జీటాక్, యాహూ, స్టీమ్, ఏఐఎం, VKontakte, Jabber, ICQ... సర్వీసుల్ని వాడుకోవచ్చు. గ్రూపు ఛాట్‌లు చేయవచ్చు. 'ఛాట్ హిస్టరీ'ని సులభంగా చూడొచ్చు. వాయిస్ మెసేజ్‌లను పంపొచ్చు. * మొబైల్‌లోనూ వాడుకునేందుకు ఆప్ రూపంలో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ స్టోర్ నుంచి పొందొచ్చు. http://goo.gl/PMR2c * యాపిల్ యూజర్లు ఐట్యూన్స్‌లోకి వెళ్లండి.http://goo.gl/umlHn * బ్లాక్ బెర్రీ వినియోగదారులు http://goo.gl/UrtRm లింక్ నుంచి పొందొచ్చు. అన్నీ ఒకేచోట! వాడుతున్న సోషల్ నెట్‌వర్క్‌లనే కాకుండా ఈమెయిల్ లాంటి ఇతర వెబ్ సర్వీసుల్ని ఒకే అడ్డాలో పొందుపరచుకోవాలంటే www.alternion.com వారధిని వేదిక చేసుకుంటే సరి. సుమారు 220 సోషల్ నెట్‌వర్క్‌లను దీంట్లో అనుసంధానం చేయవచ్చు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఫ్లిక్కర్, పికాసా... లాంటి సోషల్ నెట్‌వర్క్‌లనే కాకుండా జీమెయిల్, హాట్‌మెయిల్, ఏఓఎల్... లాంటి మెయిల్ సర్వీసుల్ని యాక్సెస్ చేయవచ్చు. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాగిన్ వివరాలతో సభ్యులవ్వొచ్చు. అడ్రస్‌బుక్‌గానూ దీన్ని వాడుకునే వీలుంది. ఫొటోలు, వీడియోలను బ్రౌజ్ చేసి చూడొచ్చు. సెర్చ్ ద్వారా ఆయా ఛానల్స్‌ని వీడియోలను వెతకొచ్చు. * సాఫ్ట్‌వేర్ రూపంలో సిస్టంలో ఇన్‌స్టాల్ చేసుకుని ముచ్చట్లు పెట్టేందుకు Pidginవాడితే సరి. సుమారు 16 ఛాట్ సర్వీసుల్ని పొందొచ్చు. ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీ దీన్ని రూపొందించారు. డౌన్‌లోడ్, ఇతర వివరాలకుwww.pidgin.im/download * ఇలాంటిదే మరోటి Trillian.వివిధ రకాల ఛాట్ నెట్‌వర్క్‌లను దీంట్లో పొందొచ్చు. www.trillian.im/download/ * ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే నుంచి పొందొచ్చు.http://goo.gl/sSM3E * యాపిల్ యూజర్లు http:// goo.gl/9kfQK |
Eenadu article link; http://eenadu.net/Specialpages/e-eenadu/e-eenaduinner.aspx?qry=sp-eenadu1
Like our facebook page: http://www.facebook.com/pages/Electronic-Security-Systems-and-Solar-Products/245701395548462
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి