మ్యూజిక్ మస్తీ! (Eenadu_31/01/13)

పాట...గాయపడిన మనస్సుకి ఓదార్పవుతుంది! ట్యూన్‌...అలసటని ఆమడ దూరంలో ఉంచుతుంది!మ్యూజిక్‌...మ్యాజిక్‌ చేసినట్టుగా మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది!కావాలంటే... ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ అడ్డాల్లో లాగిన్‌ అయిపోండి!కంప్యూటర్‌.. ల్యాపీ.. మొబైల్‌... ఐప్యాడ్‌ పరికరం ఏదైనా..!

* పనిలో పూర్తిగా నిమగ్నమై కూడా మహేష్‌ కూని రాగం తీస్తూ... 'ఆహా..! ఎంత గొప్ప ట్యూన్‌. కానీ, నేను సేకరించిన పాటల్లో ఆ ఒక్కటే లేదు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో వెతకాలంటే సమయం వృథా. ఆ పాట వినాలంటే ఎలా?'
* చెవులకు పెట్టుకున్న హెడ్‌సెట్‌ సరి చేసుకుంటూ విజయ్‌... 'హర్డ్‌డిస్క్‌ మెమొరీ ఫుల్‌. నా ఫేవరెట్‌ పాటల్ని డౌన్‌లోడ్‌ చేసుకుని వినడానికి లేదు. ఇష్టమైన పాటల్ని ఆల్బమ్‌గా పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు వినడం ఎలా?'
* చేతిలోకి స్మార్ట్‌ మొబైల్‌ తీసుకుని కృష్ణవేణి... 'ఆధునిక మొబైల్‌ చేతిలో ఉంది. కానీ, ఏం లాభం? ఎస్‌కార్డ్‌లో స్టోరేజ్‌ స్పేస్‌ లేదు. ఇంకా నా ఫేవరేట్‌ సాంగ్స్‌ చాలానే ఉన్నాయి. వినేందుకే మార్గం లేదు!'
- ఇదే కోవలోకి మీరు వస్తారా? అయితే, సిస్టంలో స్టోరేజ్‌ స్పేస్‌... మొబైల్‌లో ఎస్‌కార్డ్‌ని మర్చిపోండి. క్షణం సమయం కూడా వృథా కాకుండా కావాల్సిన పాటల్ని వినేందుకు ఆన్‌లైన్‌లోనే చాలానే వేదికలు సిద్ధంగా ఉన్నాయి. పీసీ, మొబైల్‌ అనే తేడా లేకుండా మ్యూజిక్‌ మ్యాజిక్‌లో సేదతీరొచ్చు. నచ్చిన పాటల్ని సోషల్‌ నెట్‌వర్కుల్లోని స్నేహితులతో పంచుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, మరాఠీ, తమిళ్‌.... దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లోని పాటల్ని బ్రౌజ్‌ చేసుకుని మరీ వినొచ్చు. సందర్భానికి సరిపడే పాటల్ని ఆల్బమ్‌లుగా పొందే వీలుంది. చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నాయి. మరెందుకాలస్యం... హెడ్‌సెట్‌ పెట్టుకుని సిద్ధం అయిపోండి.
ప్రాంతీయ భాషల్లోనూ..
దేశంలోని ఇంచుమించు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ పాటలు వినేందుకు ప్రత్యేక మ్యూజిక్‌ స్థావరమేwww.dhingana.com. తెలుగు, హిందీ, తమిళ్‌ పాటలే కాకుండా పంజాబీ, భోజ్‌పురి, ఒరియా, తుళు, రాజస్థానీ, అరబ్బీ... ట్రాక్స్‌ని కూడా వినొచ్చు. దైవ కీర్తనాలు వినేవారికి 'భజన్స్‌' అల్బమ్స్‌ని పొందుపరిచారు. మెడిటేషన్‌కి అనువైన మ్యూజిక్‌ అల్బమ్స్‌ని బ్రౌజ్‌ చేసి వినొచ్చు. కేవలం వినేందుకు సైట్‌లో సభ్యులవ్వాల్సిన అవసరం లేదు. అదే నచ్చిన ట్రాక్స్‌ని స్నేహితులతో పంచుకోవాలంటే కచ్చితంగా రిజిస్టర్‌ అవ్వాల్సిందే. ప్లే లిస్ట్‌లను క్రియేట్‌ చేసి షేర్‌ చేయవచ్చు. నచ్చిన పాటలపై సైట్‌లోనే కామెంట్‌ పోస్ట్‌ చేయవచ్చు. సెర్చ్‌బాక్స్‌తో కావాల్సిన పాటల్ని వెతకొచ్చు. 'టాప్‌ ఛార్ట్‌' మెనూలోకి వెళ్లి ఎక్కువ ఆదరణ పొందిన అల్బమ్స్‌ని చూడొచ్చు. 
* ఇదే వెబ్‌ సర్వీసుని మొబైల్‌లో ఆప్‌ మాదిరిగా ఇన్‌స్టాల్‌ చేసుకుని వినొచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా పొందొచ్చు. సులువైన ఇంటర్ఫేస్‌తో తాకేతెరపై కావాల్సిన ట్రాక్స్‌ని బ్రౌజ్‌ చేయవచ్చు. http://goo.gl/HNwps 
* ఐఫోన్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. http://goo.gl/Kpvr0 
* బ్లాక్‌బెర్రీ యూజర్లు ఆప్‌వరల్డ్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. http://goo.gl/f2O9W 
* సింబియాన్‌ ఓఎస్‌ యూజర్లు ఒవీ స్టోర్‌ నుంచి పొందొచ్చు. http://goo.gl/i4gml
'హంగామా' కోసం...
పాటలే కాకుండా వీడియోలు, రింగ్‌టోన్లు, వాల్‌పేపర్లు కూడా పొందాలంటే www.hangama.com లో సభ్యులైతే సరి. సుమారు 4,50,000 పాటల్ని సైట్‌లో నిక్షిప్తం చేశారు. ఎంచుకున్న పాట వేగంగా 'బఫర్‌' అవుతుంది. వీడియో పాటల నాణ్యత తగ్గకుండా స్ట్రీమింగ్‌ చేసి చూడొచ్చు. 'మూవీస్‌' మెనూలోకి వెళ్లి సినిమాలు కూడా చూడొచ్చు. వాడుతున్న సిస్టం కాన్ఫిగరేషన్‌ ఆధారంగా 'హెచ్‌డీ'లో సినిమాల్ని చూసే వీలుంది. సైట్‌లో సభ్యులై కావాల్సిన పాటల్ని, రింగ్‌టోన్లు, వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
* ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యూజర్లు హంగామా ప్లేయర్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని వినొచ్చు. ఆకట్టుకునే మొబైల్‌ వాల్‌పేపర్లను పొందొచ్చు కూడా. http://goo.gl/hDmbt 
* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు.http://goo.gl/0EkCa 
* బ్లాక్‌బెర్రీ యూజర్లు http://goo.gl/DPfuH 
* సింబియాన్‌ యూజర్లు http://goo.gl/lgP4s
'రాగా'ల లోకం...
మొత్తం 18 భాషల పాటల్ని వినేందుకు www.raaga.comవెబ్‌ సర్వీసు ఉంది. వినాలంటే ముందుగా సైట్‌లో సభ్యులవ్వాల్సిందే. కొత్త ఎకౌంట్‌తో పని లేకుండా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఎకౌంట్‌లతో లాగిన్‌ అవ్వొచ్చు. నచ్చిన ట్రాక్స్‌ని పంచుకునే వీలుంది. రివ్యూలు, కామెంట్‌లు పోస్ట్‌ చేయవచ్చు. నచ్చిన వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సైట్‌లోకి కొత్తగా అందుబాటులోకి వచ్చే ఆల్బమ్స్‌ని మ్యూజిక్‌ అలర్ట్‌లా పెట్టుకోవచ్చు. మ్యూజిక్‌ డైరెక్టర్ల జాబితా నుంచి పాటల్ని సెలెక్ట్‌ చేసుకుని వినొచ్చు. 
* మొబైల్‌లోనూ ఆండ్రాయిడ్‌ యూజర్లు రాగా ప్లేయర్‌ని పొందొచ్చు. అందుకు గూగుల్‌ ప్లేలోని http://goo.gl/wclsaలింక్‌ నుంచి పొందొచ్చు. 
* ఐఫోన్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. http://goo.gl/zzWXj 
* సింబియాన్‌ యూజర్లు ఒవీ స్టోర్‌ నుంచి నిక్షిప్తం చేసుకోండి. http://goo.gl/DKEbQ
ఓ పదిహేను...
వారాంతంలో మ్యూజిక్‌ మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన 15 పాటల్ని డీఫాల్ట్‌గా ఆల్బమ్‌గా మార్చేసి అందిస్తోందిwww.saavn.com. మెనూల్లోకి వెళ్లి ప్రాంతీయ భాషల్లో పాటల్ని బ్రౌజ్‌ చేయవచ్చు. సెర్చ్‌బాక్స్‌లో కావాల్సిన వాటిని వెతికే వీలుంది.
* ఆండ్రాయిడ్‌ యూజర్లు http://goo.gl/Pg7mK నుంచి పొందొచ్చు.
* బ్లాక్‌బెర్రీ యూజర్లు ఆప్‌వరల్డ్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. http://goo.gl/J6tpm 
* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి ఉచితంగా పొందొచ్చు. http://goo.gl/omWsM
'గానా' బజానా!
మొత్తం 24 భాషలు... డేటాబేస్‌లో మిలియన్‌కు పైగా పాటలు. అదే http://gaana.com. బీటా వెర్షన్‌తో నెటిజన్లను మ్యూజిక్‌ సాగరంలో ముంచేస్తోంది. ఒక్కసారి సైట్‌లో సభ్యులయ్యాక క్రియేట్‌ చేసిన ప్లేలిస్ట్‌లను వాడుతున్న అన్ని డివైజ్‌ల్లోకి సింక్రనైజ్‌ చేయవచ్చు. కొత్తగా విడుదలైన అల్బమ్స్‌లోని పాటల్ని 'టాప్‌ 20'లో పొందొచ్చు. కొన్ని ఎఫ్‌ఎం స్టేషన్లు కూడా పొందే వీలుంది. 
* ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు.http://goo.gl/My4Vx 
* ఐఫోన్‌ యూజర్లు http://goo.gl/mTTfB
'ఇన్‌' అవ్వండి
మెయిల్‌, న్యూస్‌, గేమ్స్‌... లాంటివే కాకుండా In.comమ్యూజిక్‌ అల్బమ్స్‌ని కూడా అందిస్తోంది. అందుకుwww.in.com/music/ లింక్‌లోకి వెళ్లండి. హోం పేజీలోకి 'సాంగ్స్‌'పై క్లిక్‌ చేసి హిందీ, తెలుగు, తమిళ్‌ పాటల్ని బ్రౌజ్‌ చేసి వినొచ్చు. POP, INDIPOP, Dance.... మెనూల్లో ఇంగ్లీష్‌ ట్రాక్స్‌ ఉన్నాయి. రేడియో స్టేషన్స్‌ని ట్యూన్‌ చేసి వినొచ్చు.
'సరిగమా' స్థావరం!
మ్యూజిక్‌ అల్బమ్స్‌ని మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌ రేడియో స్టేషన్‌తో సందడి చేస్తోంది www.saregama.com. ఆర్టిస్టులు, ఆల్బమ్స్‌ మెనూల్లో కావాల్సిన పాటల్ని బ్రౌజ్‌ చేసి వినొచ్చు. 'ఇంటర్నెట్‌ రేడియో'లోకి వెళ్లి స్టేషన్లను ట్యూన్‌ చేసి వినొచ్చు.
గూగుల్‌ గూటిలో...
సెర్చ్‌ ఇంజన్‌లా సమాచారాన్ని వెతికి తెస్తూనే నెటిజన్లను పాటల ప్రపంచంలో విహరించేలా 'మ్యూజిక్‌' విభాగాన్ని అందిస్తోంది. అందుకు www.google.co.in/musicలింక్‌లోకి వెళ్లండి. వివిధ ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ సర్వీసుల్ని కలుపుని వేల పాటల్ని ఒకేచోట అందిస్తోంది.
మరికొన్ని...
* మార్కెట్‌లో విడుదలైన అన్ని భాషల పాటల్ని వినేందుకు http://smashits.com సిద్ధంగా ఉంది. విభాగాల వారీగా పాటలు, వీడియోలు, రేడియోలను బ్రౌజ్‌ చేసి వినొచ్చు.
* పాటలు మాత్రమే కాకుండా లిరిక్స్‌, మూవీ ట్రైలర్లు, వాల్‌పేపర్లతో మ్యూజిక్‌ ప్రియుల్ని ఆకట్టుకుంటోందిhttp://sangeethouse.com. సభ్యులై ఇతర భాషల ఆల్బమ్స్‌ని కూడా బ్రౌజ్‌ చేసి వినొచ్చు.
* సులభమైన ఇంటర్ఫేస్‌తో పాటల్ని వినేందుకు మారో మార్గం http://mio.to హోం పేజీ నుంచే సుమారు 20 భాషల ఆల్బమ్స్‌ని బ్రౌజ్‌ చేయవచ్చు. ఎక్కువగా ఆకట్టుకున్న పాటల్ని 'టాప్‌ ఆల్బమ్స్‌'లో చూడొచ్చు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, మై స్పేస్‌, ఆర్కుట్‌... నెట్‌వర్క్‌ల్లో షేర్‌ చేయవచ్చు. రేడియో స్టేషన్ల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
* హందీ పాటల్ని మాత్రమే వినేందుకు www.hindisongs.net
* నెట్‌లో అందుబాటులో ఉన్న రేడియోలను ట్యూన్‌ చేసి వినేందుకు www.tunein.com ఉంది. దేశంలో నెటిజన్లను అలరిస్తున్న ప్రాంతీయ ఎఫ్‌ఎంలకు ఇది ప్రత్యేకం. పాప్‌ రేడియో ఛానళ్లను కూడా బ్రౌజ్‌ చేసి వినొచ్చు.
* పాత, కొత్త పాటల మరో మ్యూజిక్‌ స్థావరంwww.indiamp3.com సందర్భానికి సరిపదే మ్యూజిక్‌ ట్రాక్స్‌ని మెనూల వారీగా పొందొచ్చు

Eenadu direct link: http://eenadu.net/Specialpages/e-eenadu/e-eenaduinner.aspx?qry=sp-eenadu1


Advertisement:








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు