కసి పెట్టారు..కని పెట్టారు! (Eenadu eetaram_08/06/13)
సెల్‌ఫోన్‌లో ఎడతెగని కబుర్లు... ఆన్‌లైన్‌లో తెమలని చాటింగ్‌లు... సరదాలు, స్వీట్‌నథింగ్స్... ఎప్పుడూ ఉండేవేగా! ఈసారి కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నారు కొందరు యూత్... ప్రాజెక్టులంటూ ప్రయోగాలు మొదలెట్టారు... దిగాక అవాంతరాలు అడ్డుపడ్డాయ్... అయినా మధ్యలోనే కాడి వదిలేయలేదు... పట్టుపట్టి ముందుకెళ్లారు. ఎట్టకేలకు సాధించారు... అవార్డులూ వరించాయ్... ఇంతకీ ఆ విజేతలేం చేశారు? ఆలోచన ఎగిరింది! పరికరం: ఆర్నిథాప్టర్ (పక్షి, హెలికాప్టర్ పోలికలున్న విహంగం) రూపకర్తలు: వి.ఎన్.జశ్వంత్, ఎస్.ఎన్.వి.ఆంజనేయప్రసాద్, కాటం శ్రీనివాస్ ప్రత్యేకతలు: శత్రు స్థావరాలపై పక్షిలా ఎగురుతూ ఫొటోలు తీస్తుంది. 26/11 లాంటి ఉగ్రవాద సంఘటనల్లో శత్రువుల ఆనుపానులు గుర్తిస్తుంది. కారు రేసుల్ని పైనుంచి వీడియోలు తీస్తుంది. ప్రేరణ: ఇంజినీరింగ్ ప్రాజెక్టులో భాగంగా. చేసే ఆవిష్కరణ దేశానికి ఉపయోగపడాలనే తలంపు. సాధించారిలా: ముగ్గురూ హైదరాబాద్‌లోని ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులే. కోర్సులో భాగంగా ఏదైనా భిన్నమైన ప్రాజెక్టు చేయాలనుకున్నారు. అంతర్జాలంలో వెతికితే పక్షిని పోలిన హెలి...