సకల సౌకర్యాల బజార్! (Eenadu_07/06/13)

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ కొన్నారా?ఇన్‌బిల్ట్‌గా ఉండే సౌకర్యాలు కొన్నే! అదనంగా కావాలంటే? స్టోర్‌లోకి వెళ్లండి...ఆప్స్‌తో పాటు ఇంకా అనేకం!
ఏదైనా ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో ఇన్‌బిల్ట్‌గా ఫేస్‌బుక్‌, స్కైప్‌, ఒపేరా, సోషల్‌హబ్‌, యూట్యూబ్‌, డ్రాప్‌బాక్స్‌, వాట్స్‌అప్‌... లాంటి అప్లికేషన్లు ఉండనే ఉంటాయి. మరి, కొత్త ఆప్స్‌ని ప్రయత్నించాలని ఉందా? గూగుల్‌ ప్లేలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆప్స్‌ని అప్‌లోడ్‌ చేస్తున్నారు. అవొక్కటే కాదు. స్టోర్‌ నుంచి ఈ-బుక్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అంతేనా... బోరింగ్‌ అనిపిస్తే సినిమాలు చూడొచ్చు. వాటన్నింటినీ అందిపుచ్చుకోవాలంటే మీరూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవ్వాల్సిందే. 'ప్లే' స్టోర్‌లో ఆప్స్‌తో ఆడుకోవాల్సిందే. మరెందుకాలస్యం... వాటి సంగతులేంటో చూద్దాం!టైపింగ్‌ కష్టమైతే.. * * *
తాకేతెర స్మార్ట్‌ ఫోన్‌లోని క్వర్టీ కీబోర్డ్‌లో టైప్‌ చేయడం కష్టంగా అనిపిస్తే, Swiftkey Keyboard ఆప్‌ని ప్రయత్నించొచ్చు. టైపింగ్‌లో పదాల్ని ఆటోమాటిక్‌గా కరెక్ట్‌చేయడంతో పాటు 'వర్డ్‌ ఆల్గరిథమ్‌'ని చూపిస్తుంది. జీమెయిల్‌, ఫేస్‌బుక్‌ల్లాంటి ఆన్‌లైన్‌ సర్వీసుల్లోనూ సపోర్ట్‌ చేస్తుంది. ఉచిత వెర్షన్ని పరిమిత సౌకర్యాలతో వాడుకోవచ్చు. ప్రీమియం వెర్షన్‌లో అదనపు సౌకర్యాల్ని పొందొచ్చు. http://goo.gl/1NQky
కొత్త ఎక్స్‌ప్లోరర్‌ * * *
ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా అందుబాటులో ఉన్న దానికి భిన్నంగా మరేదైనా కొత్తది వాడాలనుకుంటే File Explorer వాడండి. ఐస్‌క్రీం శాండ్‌విచ్‌ వెర్షన్‌లో వాడుకోవచ్చు. ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీ రూపొందించింది. ఒక ఫోల్డర్‌ నుంచి మరో ఫోల్డర్‌లోకి ఫైల్స్‌ని కాపీ, డిలీట్‌, మూవ్‌ చేయడం చాలా సులభం. రాబోయే వెర్షన్లలో ఇన్‌బిల్ట్‌గా జీమెయిల్‌, మల్టీ సెలెక్ట్‌ సదుపాయాల్ని పరిచయం చేయనున్నారు. మేనేజ్‌ చేయాలనుకునే ఫోల్డర్‌, ఫైల్‌ని సెలెక్ట్‌ చేయగానే కట్‌, కాపీ, డిలీట్‌ ఆప్షన్లు వరుసగా కనిపిస్తాయి. http://goo.gl/LSMTo 
అదనపు సొగసులు * * *
ఫొటోలను మరింత ఆకట్టుకునేలా మొబైల్‌లోనే ఎడిట్‌ చేసుకునేందుకు Pixlr Express సిద్ధంగా ఉంది. ఇదో ఉచిత ఫొటో ఎడిటర్‌. క్రాప్‌, రీసైజ్‌ చేయడంతో పాటు ఫొటోలోని Red-eye ని తొలగించొచ్చు. సుమారు 600 ఫొటో ఎడిటింగ్‌ ఎఫెక్ట్‌లున్నాయి. ఎడిట్‌ చేసిన ఫొటోలను ఆప్‌ నుంచే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నెట్‌వర్క్‌ల్లో షేర్‌ చేయవచ్చు.http://goo.gl/1kQLX
ఓ కన్నేయండి * * *
వాతావరణ వివరాలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేయాలంటే Eye In Sky ఆప్‌ని వాడితే సరి. మీరున్న ప్రదేశంలోని జీపీఎస్‌ లొకేషన్‌ డేటా ఆధారంగా వాతావరణ వివరాల్ని అందిస్తుంది. మీరేదైనా ప్రాంతానికి టూర్‌ వెళ్లాలనుకున్నప్పుడు ఆ ప్రాంతాన్ని సెర్చ్‌ చేసి ముందే అక్కడ వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేయవచ్చు. 13 రకాల Weather icon sets ఉన్నాయి. ఆప్‌ హోం స్క్రీన్‌పై విజువల్స్‌లో ఉష్ణోగ్రత వివరాల్ని క్రమపద్ధతిలో చూపిస్తుంది. http://goo.gl/r4X4C
లైట్‌లా మార్చేయండి * * *
స్మార్ట్‌ మొబైల్‌ కెమెరా ఫ్లాష్‌ లైట్‌ని టార్చ్‌లైట్‌లా మార్చేయాలంటే మొబైల్‌లో Tiny Flashlight ఆప్‌ని నిక్షిప్తం చేయండి. దీంతో ఫ్లాష్‌లైట్‌ సామర్థ్యాన్ని మరింత పెంచొచ్చు. ఆప్‌లోని హోం స్క్రీన్‌పై కనిపించే బటన్‌ని నొక్కగానే ఫ్లాష్‌ లైట్‌ టార్చ్‌లైట్‌ మాదిరిగా ప్రకాశవంతంగా వెలుగుతుంది. బ్రైట్‌నెస్‌ని మార్పు చేసుకునే వీలుంది. మీ మొబైల్‌లో ఫ్లాష్‌లైట్‌ లేకుంటే స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ని పెంచుతుంది. వెలుగు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫొటోలు తీసుకునేప్పుడు ఆప్‌ మరింత ప్రయోజనకరం. http://goo.gl/lKusu 
ట్రాక్‌ చేస్తుంది * * *
రోజులో ఎంత దూరం జాగింగ్‌, వాకింగ్‌, రన్నింగ్‌, సైక్లింగ్‌ చేస్తున్నారు? మీ ఫిట్‌నెస్‌ ఏ మేరకు ఉంది?... లాంటి విషయాల్ని తెలియజేస్తూ వ్యక్తిగత శిక్షకుడిగా పని చేస్తోంది RunKeeper.ఆప్‌ జీపీఎస్‌తో అనుసంధానమై పని చేస్తుంది. మీరు పరిగెత్తిన దూరం ఆధారంగా ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయో తెలియజేస్తుంది. ఎంత వేగంతో జాగింగ్‌ చేశారో కూడా చెబుతుంది. మొత్తం డేటాని ఫోన్‌లో భద్రం చేసి ఛార్ట్‌ రూపంలో మీ ఫిట్‌నెస్‌ సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తుంది. http://goo.gl/9gRYC * చేయాల్సిన పనుల్ని జాబితాగా ఏర్పాటు చేసుకుని సరైన సమయానికి పూర్తి చేయాలంటే Any.Doఉండల్సిందే.http://goo.gl/H4c1Q 
ప్లేయర్‌ ఉందా? * * *
స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉందంటే వినోదానికి కొదవలేనట్టే. అందుకు MX Player ఉదాహరణ. ఫోన్‌లోని సినిమాలు, ఇతర వీడియోలను సులువైన పద్ధతిలో ప్లే చేసి చూడొచ్చు. Pinch to Zoom, Kids Lock అదనపు సౌకర్యాలు. http://goo.gl/tRR9x *మొబైల్‌లోనే ఆన్‌లైన్‌ వేదికపై కావాల్సిన పాటల్ని వినేందుకు gaanaఆప్‌ని పొందండి. భాషని ఎంపిక చేసుకుని వినొచ్చు. http://goo.gl/YDuPo * ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 70,000 లైవ్‌ రేడియో స్టేషన్లను ఫోన్‌, ట్యాట్లెట్‌లో వినాలనుకుంటే TuneIn Radio ఆప్‌ని పొందండి. http://goo.glifJ1* మీకు నచ్చిన పాటకి లిరిక్స్‌ తెలియడం లేదా? అయితే, SoundHoundఆప్‌ని పొందండి. దీంట్లో విన్న పాట ట్రాక్స్‌ని పొందే వీలుంది. http://goo.gl/54kVY
ఇక గ్రంథాలయమే! * * *
ఇంగ్లిష్‌ సాహిత్యంపై ఆసక్తి ఉంటే గూగుల్‌ ప్లే అందిస్తున్న ఈ-పుస్తకాలతో మొబైల్‌, ట్యాబ్లెట్‌ని గ్రంథాలయంగా మార్చేయవచ్చు. ఉచిత జాబితాలోకి వెళ్లి కావాల్సిన పుస్తకాన్ని చిటికెలో సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ రచయితలు రాసిన పుస్తకాల్ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. పుస్తకాల్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. బ్యూటీ టిప్స్‌ పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇక ప్రీమియం బుక్స్‌లోకి వెళితే లెక్కకు మిక్కిలే. http://goo.gol/ekxFW
సినిమా థియేటర్‌ కూడా! * * *
నిన్న మొన్న విడుదలైన కొత్త సినిమాల దగ్గర్నుంచి పాత వాటి వరకూ అన్నింటినీ గూగుల్‌ ప్లేలోని My Movies ద్వారా పొందొచ్చు. హోం పేజీలో విభాగాలుగా ఏర్పాటు చేసిన సినిమాల్ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. మొత్తం యానిమేషన్‌ సినిమాల్ని చూడాలనుకుంటే Animaitonమెనూలోకి వెళ్లొచ్చు. మార్కెట్‌ ధర ఆధారంగా రూ.500 వరకూ చెల్లించి నచ్చిన మూవీలను చూడొచ్చు. Puss In Boots, Ice Age 3, Kung fu Panda... లాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి.https://play.google.com/movies 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు