అడవిలో..అవ్వ
అడవిలో..అవ్వ 25 ఏళ్లుగా అక్కడే ఆవాసం భర్త, కుమారుల మరణం తర్వాత ఒంటరి జీవనం దైవమే తోడుగా..ఆదివాసీ వృద్ధురాలి జీవిత ప్రయాణం ‘ఈనాడు-ఈటీవీ’ ప్రత్యేక కథనం ఈనాడు-ఆదిలాబాద్: గంటపాటు టీవీ ఆగితే ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. ఒక రోజు మనుషులెవరూ తారస పడకుంటే ఏకాకినైపోయానన్న భయం వెంటాడుతుంది. ఓ రాత్రి చిమ్మచీకట్లో గడిపితే వెన్నులో వణుకు మొదలవుతుంది. అలాంటిది 70 ఏళ్ల వృద్ధురాలు పాతికేళ్లుగా అడవే ఆవాసంగా కాలం వెళ్లదీస్తుందంటే ఓ పట్టాన నమ్మలేం. ఇది మాత్రం అక్షరాలా నిజమే. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ అటవీ ప్రాంతంలో ఓ అవ్వ చేస్తున్న అరణ్యవాసంపై ‘ఈనాడు-ఈటీవీ’ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కన్నాపూర్-రాజులగూడ గ్రామాల మధ్యలోని అటవీప్రాంతంలో పూసం గిరుజుభాయి ఓ పూరిగుడిసెను ఆధారంగా చేసుకుని జీవిస్తోంది. ఆమె కుటుంబంతో సహా దాదాపు 50 ఏళ్ల కిందట నార్నూర్ మండలం ఖైర్‌దాట్వా గ్రామం నుంచి ఉట్నూర్ మండలం కన్నాపూర్‌కు వలసొచ్చింది. సమీపంలోని రెండెకరాల అటవీ భూమిని సాగుయోగ్యంగా మార్చుకుని జీవనం వెళ్లదీస్తుండేది. 30 ఏళ్ల క్రితం భర్త జైతు, ఆ తర్వాత కొంతకాలానికి కుమారుడు రాము మరణించడంతో ఆమ...