పోస్ట్‌లు

ఏప్రిల్, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆయుర్వేదం - వేసవికాలం

చిత్రం
ఆయుర్వేదం - వేసవికాలం ఎండల్లో... వెన్నెల్లా..! ‘అబ్బ.. ఏం ఎండరా బాబూ! కాసేపటికే చొక్కంతా చెమటతో తడిసిపోయింది’ ‘మార్చిలోనే ఎండలిలా మండిపోతుంటే ఇక మేలో ఎలా ఉంటాయో.. ఏమో?’ మధ్యాహ్నం వేళ పది నిమిషాలు బయటకు వెళ్లివచ్చినా ఇప్పుడు చాలామంది నోట ఇలాంటి మాటలే వినబడుతున్నాయి. అవును.. వేసవి ఆదిలోనే అదరగొడుతోంది. వేడి, ఉక్కపోతలతో పజలను బెంబేలెత్తిస్తోంది. నిజానికి ఇవే కాదు.. వడదెబ్బ, విరేచనాలు, కామెర్ల వంటి పలు సమస్యలనూ వేసవి మోసుకొస్తుంది. అయితే ఆహార, విహార నియమాలతో ఇలాంటి ఇబ్బందులను తప్పించుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఇవి నివారణ చర్యగానే కాదు.. చికిత్సలుగానూ ఉపయోగపడగలవని భరోసా ఇస్తోంది. మరి ఈ వేసవిలో     ఆయుర్వేదం నీడలో చల్లచల్లగా ఎలా గడపాలో తెలుసుకుందాం. ఎండకాలంలో పిత్తదోషం తీవ్రంగా ఉంటుంది. అందువల్ల ఈ కాలం పిత్తదోషం గలవారికి మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది. భా రతీయ సంప్రదాయంలో వాతావరణ పరంగానే కాదు.. ఆరోగ్యపరంగానూ రుతువులకు ప్రత్యేక ప్రాధాన్యముంది. మనకు సంవత్సరానికి 6 రుతువులు, 2 ఆయణాలు. శిశిర, వసంత, గ్రీష్మ రుతువులతో కూడిన కాలాన్ని ఉత్తరాయణంగానూ.. వర్ష, శరద్‌, హే...