ఉపాధికి కొత్త ఎనర్జీ!
ఉపాధికి కొత్త ఎనర్జీ! జీవజాతికి ప్రాణాధారమైన సూర్యుడు ఇప్పుడు ఉద్యోగాలకూ ప్రధాన మార్గమవుతున్నాడు. సౌరశక్తికి సంబంధించి వెలువడుతున్న అనేక ఆవిష్కరణల వల్ల విద్యుత్తు రంగంలో సోలార్ ఎనర్జీ తప్పనిసరి అవసరం అవుతోంది. భారత ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేక విభాగంగా గుర్తించింది. ఎన్నో రకాల కోర్సులను, పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసి ఉన్నత విద్యకు, ఉపాధికీ¨ బాటలు వేస్తోంది. ఆయా కోర్సులు చేసిన వారికి సౌరశక్తి ఉత్పత్తి, దాంతో పనిచేసే వివిధ పరికరాల తయారీ, వాటి నిర్వహణ వంటి ఎన్నో రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ద శాబ్ద కాలంగా సోలార్ ఎనర్జీ రంగంలో పరిశ్రమలు వృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇవి దేశానికి కావాల్సిన విద్యుత్తు శక్తిని అందించడంతోపాటు విద్యావంతులకూ ఉపాధిని కల్పిస్తున్నాయి. మన ప్రభుత్వం 2022 నాటికి 100 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు పరిశ్రమలు మూడు విధానాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తికి తోడ్పడుతున్నాయి. మొదటిది రూఫ్ టాప్ సోలార్, రెండోది గ్రౌండ్ బేస్డ్ సోలార్ ఫొటో వోల్టాయిక్, మూడోది వాటర్ ఫ్లోటింగ్ సోలార...