ఉపాధికి కొత్త ఎనర్జీ!

ఉపాధికి కొత్త ఎనర్జీ!
జీవజాతికి ప్రాణాధారమైన సూర్యుడు ఇప్పుడు ఉద్యోగాలకూ ప్రధాన మార్గమవుతున్నాడు. సౌరశక్తికి సంబంధించి వెలువడుతున్న అనేక ఆవిష్కరణల వల్ల విద్యుత్తు రంగంలో సోలార్‌ ఎనర్జీ తప్పనిసరి అవసరం అవుతోంది. భారత ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేక విభాగంగా గుర్తించింది. ఎన్నో రకాల కోర్సులను, పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసి ఉన్నత విద్యకు, ఉపాధికీ¨ బాటలు వేస్తోంది. ఆయా కోర్సులు చేసిన వారికి సౌరశక్తి ఉత్పత్తి, దాంతో పనిచేసే వివిధ పరికరాల తయారీ, వాటి నిర్వహణ వంటి ఎన్నో రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
శాబ్ద కాలంగా సోలార్‌ ఎనర్జీ రంగంలో పరిశ్రమలు వృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇవి దేశానికి కావాల్సిన విద్యుత్తు శక్తిని అందించడంతోపాటు విద్యావంతులకూ ఉపాధిని కల్పిస్తున్నాయి. మన ప్రభుత్వం 2022 నాటికి 100 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు పరిశ్రమలు మూడు విధానాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తికి తోడ్పడుతున్నాయి. మొదటిది రూఫ్‌ టాప్‌ సోలార్‌, రెండోది గ్రౌండ్‌ బేస్డ్‌ సోలార్‌ ఫొటో వోల్టాయిక్‌, మూడోది వాటర్‌ ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌.
సోలార్‌ ఎనర్జీకి కావాల్సిన పరికరాల రూపకల్పన, నిర్వహణల్లో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, మెటీరియల్‌ సైన్స్‌ ఇంజినీర్లు ప్రముఖపాత్ర వహిస్తున్నారు. సోలార్‌ పానెల్‌ను తయారు చేయడం, దాని నిర్వహణ బాధ్యతలకు సంబంధించి రూఫ్‌టాప్‌ సోలార్‌ విభాగంలో ఒక మెగావాట్‌కి 25 ఉద్యోగాలు, నేలమీద ఏర్పాటు చేసిన సోలార్‌ ప్లాంట్‌కి ఒక మెగావాట్‌కు నాలుగు ఉద్యోగాల కల్పన జరుగుతోంది. ఈ విధంగా 2022 నాటికి 3 లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నారని ఒక అంచనా.
వివిధ కోర్సులు
సోలార్‌ ఎనర్జీపై ఆసక్తి ఉన్న విద్యార్థులు బీటెక్‌ స్థాయిలో ఎలక్ట్రికల్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదవొచ్చు. ఆ తర్వాత ఆసక్తిని బట్టి ఎంటెక్‌లో ఎనర్జీ సిస్టమ్స్‌ను ప్రత్యేక అంశంగా ఎంచుకోవచ్చు. ఈమధ్య కాలంలో కొన్ని యూనివర్సిటీలు బీటెక్‌ స్థాయిలోనే ఎనర్జీ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ను అందిస్తున్నాయి.
మన దేశంలో బీటెక్‌లో ఎనర్జీ ఇంజినీరింగ్‌ చదవడానికి కనీస అర్హత 10+2. ప్రవేశం జేఈఈ ఆధారంగా జరుగుతుంది. కొన్ని సంస్థలు వాటి ప్రత్యేక పరీక్ష ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి.
ఉద్యోగాలు
సౌరశక్తి రంగంలో ప్రధానంగా ఇన్‌స్టాలేషన్‌ ఇంజినీర్లు, మెయింటెనెన్స్‌ ఇంజినీర్లు, డేటా మానిటరింగ్‌ ఇంజినీర్లు, ఫొటో వోల్టాయిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీర్లు, సోలార్‌ రిసెర్చర్లు తదితర ఉద్యోగాలు లభిస్తాయి. 
ఎనర్జీ సిస్టమ్‌లో ఉన్నత విద్యను అభ్యసించినవారు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ నిర్వహించే పరీక్షలు ఉత్తీర్ణులైతే ఎనర్జీ ఆడిటర్‌/ మేనేజర్‌ చేరవచ్చు. వివిధ పరిశ్రమలకు, సంస్థలకు ఎనర్జీ ఆడిట్‌ నిర్వహించవచ్చు. సౌరశక్తి రంగంలో ఉద్యోగాలు అందిస్తున్న ప్రధాన సంస్థల్లో కొన్ని...
ఐసీఎఫ్‌ ఇంటర్నేషనల్‌  దీ ఇండియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 
ట్రైడెంట్‌ లిమిటెడ్‌ దీ సీమ్‌ ఇంటర్నేషనల్‌ దీ బిగేటర్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌
హనీవెల్‌ 
ఆర్వీ ఎన్‌కాన్‌ (Aarvi encon)
కొరేడ్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
ఎనర్జీ ఇంజినీరింగ్‌లో బీటెక్‌తో.. 
గ్లోబస్‌ పవర్‌ జనరేషన్‌ లిమిటెడ్‌ దీ ఎపిక్‌ ఎనర్జీ   దీ హిందుస్థాన్‌ డొమెస్టిక్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 
గోల్డ్‌విన్‌ లిమిటెడ్‌ దీ ఎన్‌సీఎంఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 
ఎస్‌ఈ పవర్‌ లిమిటెడ్‌ దీ టీడీ పవర్‌ సిస్టమ్స్‌
సీమెన్స్‌ ఎనర్జీ (Siemens energy) సుజ్లాన్‌ ఎనర్జీ (Suzlon energy)
ఎంటెక్‌ స్థాయిలో ఎనర్జీ సిస్టమ్స్‌ను అందిస్తున్న సంస్థలు
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - ఖరగ్‌పూర్‌
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - ముంబయి
విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్‌ యూనివర్సిటీ - బెళగవీ
అమిటీ యూనివర్సిటీ - నోయిడా
నోయిడా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ - నోయిడా
అలయన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్స్‌ డిజైన్‌ - బెంగళూరు
యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ - డెహ్రాడూన్‌
మనదేశంలో దాదాపు అన్ని యూనివర్సిటీలు గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంటెక్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
ఎంటెక్‌ స్థాయిలో ప్రత్యేకమైన వివిధ కోర్సులను అందిస్తున్న సంస్థలు
ఎంటెక్‌/ ఎంఈ ఇన్‌ ఎనర్జీ ఇంజినీరింగ్‌/ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌
ఏవీసీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, తమిళనాడు
అన్నా యూనివర్సిటీ - చెన్నై
పీఎస్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ - కోయంబత్తూర్‌
వెల్‌టెక్‌ డాక్టర్‌ ఆర్‌ఆర్‌ అండ్‌ డాక్టర్‌ ఎస్‌ఆర్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ, తమిళనాడు.
డాక్టర్‌ కేఎన్‌ మోడీ యూనివర్సిటీ, రాజస్థాన్‌
డాక్టర్‌ ఎంఓఆర్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నై
జైన్‌ యూనివర్సిటీ,  బెంగళూరు.
జేఎన్‌టీయూ,  హైదరాబాద్‌
విజ్ఞాన్‌ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌ నీ శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - ముంబయి
యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ - డెహ్రాడూన్‌
యూనివర్సిటీ ఆఫ్‌ పుణె.
టీఈఆర్‌ఐ స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, న్యూదిల్లీ
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - దిల్లీ
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - తిరుచిరాపల్లి
పండిత్‌ దీన్‌ దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ - గాంధీనగర్‌
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - కాలికట్‌
గుజరాత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ, గుజరాత్‌.
వీటిలోని కొన్ని సంస్థలు ఎంటెక్‌తోపాటు బీటెక్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను కూడా అందిస్తున్నాయి.
భవిష్యత్తు!
రాబోయే రోజుల్లో సోలార్‌ ఎనర్జీని ఎలక్ట్రిక్‌ కార్లు, ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌, ఎలక్ట్రిక్‌ బైక్‌లు తదితర ఎన్నో రంగాల్లో విస్తృతంగా వినియోగించనున్నారు. దీంతో సౌరశక్తి ఉపయోగం మరింత అభివృద్ధి చెంది ఎక్కువగా ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుంది.
Reference: http://www.eenadu.net/special-pages/chaduvu/chadhuvu-inner.aspx?featurefullstory=24859 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు