పోస్ట్‌లు

సెప్టెంబర్, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

అడవిలో..అవ్వ

చిత్రం
అడవిలో..అవ్వ 25 ఏళ్లుగా అక్కడే ఆవాసం భర్త, కుమారుల మరణం తర్వాత ఒంటరి జీవనం దైవమే తోడుగా..ఆదివాసీ వృద్ధురాలి జీవిత ప్రయాణం ‘ఈనాడు-ఈటీవీ’ ప్రత్యేక కథనం ఈనాడు-ఆదిలాబాద్‌: గంటపాటు టీవీ ఆగితే ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. ఒక రోజు మనుషులెవరూ తారస పడకుంటే ఏకాకినైపోయానన్న భయం వెంటాడుతుంది. ఓ రాత్రి చిమ్మచీకట్లో గడిపితే వెన్నులో వణుకు మొదలవుతుంది. అలాంటిది 70 ఏళ్ల వృద్ధురాలు పాతికేళ్లుగా అడవే ఆవాసంగా కాలం వెళ్లదీస్తుందంటే ఓ పట్టాన నమ్మలేం. ఇది మాత్రం అక్షరాలా నిజమే. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ అటవీ ప్రాంతంలో ఓ అవ్వ చేస్తున్న అరణ్యవాసంపై ‘ఈనాడు-ఈటీవీ’ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలంలోని కన్నాపూర్‌-రాజులగూడ గ్రామాల మధ్యలోని అటవీప్రాంతంలో పూసం గిరుజుభాయి ఓ పూరిగుడిసెను ఆధారంగా చేసుకుని జీవిస్తోంది. ఆమె కుటుంబంతో సహా దాదాపు 50 ఏళ్ల కిందట నార్నూర్‌ మండలం ఖైర్‌దాట్వా గ్రామం నుంచి ఉట్నూర్‌ మండలం కన్నాపూర్‌కు వలసొచ్చింది.  సమీపంలోని రెండెకరాల అటవీ భూమిని సాగుయోగ్యంగా మార్చుకుని జీవనం వెళ్లదీస్తుండేది. 30 ఏళ్ల క్రితం భర్త జైతు, ఆ తర్వాత కొంతకాలానికి కుమారుడు రాము మరణించడంతో ఆమ...

అన్నం ‘మలి’ బ్రహ్మం!

చిత్రం
అన్నం ‘మలి’ బ్రహ్మం! అన్నం ఆరోగ్య స్వరూపం! పుట్టినప్పట్నుంచీ.. మరణించేవరకూ మనకు ఆహారమే ఆధారం. అందుకే ‘కలౌ అన్నగతాః ప్రాణాః’ అని నిర్వచించారు శాస్త్రకారులు. మన శరీర స్థితికీ, శరీర వృద్ధికీ ఆహారమే ప్రధానం. ఆరోగ్యవంతులు ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నా.. రోగులు వ్యాధుల బారి నుంచి విముక్తం పొందాలన్నా ఆహారమే కీలకం. జీవితంలో అన్నిదశల్లోనూ అడుగడుగునా శక్తినిస్తూ.. మనల్ని వెన్నంటి నడిపించే ఈ ఆహారం గురించి ఆయుర్వేదం విపులంగా చర్చించింది. ఎలా తినాలి? ఎంత తినాలి? ఏయే వయసులో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనేవీ వివరించింది. ముఖ్యంగా వార్ధక్యంలో ఆహార నియమాల ప్రాముఖ్యతను విస్పష్టంగా పేర్కొంది. వయసు మీద పడుతున్నకొద్దీ మందగించే జఠరాగ్ని, జీర్ణక్రియలను పెంచుకోవటానికి మార్గాలనూ సూచించింది. ‘ధ ర్మ, అర్థ, కామ, మోక్ష సాధనకు ఆరోగ్యమే అత్యావశ్యకం. ఇది మనఆహార, విహారాల మీదే ఆధారపడి ఉంది. అందుకే ఆయుర్వేదం ఆహారానికి విశిష్టమైన ప్రాధాన్యమిస్తుంది. ‘ఆహార సంభవం వస్తు, రోగాశ్చాహార సంభవా’ అనీ నొక్కి చెబుతుంది. అంటే మన శరీరం.. అలాగే మనల్ని పీడించే వ్యాధులూ ఆహారం నుంచే పుట్టుకొస్తాయని అర్థం. సక్రమమైన పద్ధతిలో తీసుకుంటే ...