పోస్ట్‌లు

‘బెస్ట్‌’ స్మార్ట్‌ఫోన్‌ కోసం..!

చిత్రం
‘బెస్ట్‌’ స్మార్ట్‌ఫోన్‌ కోసం..!  వికాస్‌ గత రెండు మూడు నెలలుగా స్మార్ట్‌ ఫోన్‌ కొనాలనుకుంటున్నాడు. కానీ, తాను చూసిన మోడళ్లో దేనిని ఎంపిక చేసుకోవాలో తెలియడం లేదు. నారాయణ రూ.10,000లతో ఓ మొబైల్‌ కొన్నాడు. కానీ,  తాను ఊహించినంత స్థాయిలో అది పని చేయడం లేదు. కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నవాళ్లలో చాలా మందికి ఇదే సమస్య. ఫోన్‌ ధర ఎంత? ఇది ఏ కంపెనీది? ఒకప్పుడు ఫోన్‌ కొనాలంటే ఆలోచించే అంశాల్లో ముఖ్యమైనవి ఇవే. వాటికి తగ్గట్టే చాలా తక్కువ ఫోన్లు ఉండేవి.. చూసుకొని కొనేవాళ్లు. స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తొలినాళ్లలోనూ ఇలాగే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో వారానికో స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది. దీంతో ఏ ఫోన్‌ కొనాలా? అనే విషయంపై చాలా మంది సతమతమవుతుంటారు.  దీని నుంచి బయటపడి మనం కోరుకున్న ధరలో వీలైనన్ని ఎక్కువ ఫీచర్లు ఉండే ఫోన్లను ఎలా ఎంపిక చేసుకోవాలి? స్మార్ట్‌ఫోన్‌ కొనేటప్పుడు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో.. ఓ లుక్కేద్దామా? ప్రాసెసర్‌ కీలకం: మొబైల్‌ పనిచేసే విధానం అ...

పరమ చెత్త సవాల్‌!

చిత్రం
పరమ చెత్త  సవాల్‌! ఎన్నెన్నో రకాలు..అంతరిక్ష వ్యర్థాల్లో రాకెట్‌ ఉపరితల నిర్మాణాలు 17% ఉండగా.. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వస్తువులు 19% వరకూ ఉన్నాయి. ఇక విఫలమైన ఉపగ్రహాలు 22% కాగా.. చిన్న చిన్న శకలాలు 42% వరకూ భూకక్ష్యలో తిరుగుతున్నాయి. ఇందుకలదందులేదని చెత్త సర్వత్రా వ్యాపిస్తోంది. ఇప్పటికే భూమిని, సముద్రాలను ముంచెత్తిన ఇది అంతరిక్షాన్నీ వదలటం లేదు. ఉపగ్రహాలు, రాకెట్లు, వ్యోమనౌకల ప్రయోగాలతో అద్భుతమైన విజయాలను సాధిస్తున్నామని పొంగిపోతున్న మనకిప్పుడు నిజంగా ‘చెత్త’ సవాలే ఎదురవుతోంది. రాకెట్ల విడిభాగాల దగ్గర్నుంచి కాలం చెల్లిన ఉపగ్రహాల వరకూ అన్నీ అంతరిక్షంలోనే ఉండిపోతూ.. అనంత వేగంతో తిరుగుతూ పెనుముప్పును తెచ్చిపెడుతున్నాయి. ఇవి ఎప్పుడే ఉపగ్రహాన్ని ఢీకొంటాయో, దేన్ని గతి తప్పిస్తాయో తెలియని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అందుకే శాస్త్రవేత్తలంతా ప్రస్తుతం ‘చెత్త పరిష్కారం’ దిశగానే దృష్టి సారిస్తున్నారు. అవును నిజంగా మనకిది ‘వ్యర్థ’ సమయమే! స్పస్‌ డెబ్రిస్‌. ఇటీవలికాలంలో తరచుగా వినబడుతున్న పదమిది. ఆర్బిటల్‌ డెబ్రిస్‌.. స్పేస్‌ జంక్‌.. స్పేస్‌ వేస్ట్‌.. ఇలా ఏ పేరుతో పిలుచుకున...