Helping Hands
ఎన్నో పక్షులు ఆహారం కోసం విదేశాల నుంచి మనదేశానికి వలస వస్తాయి. కొన్నాళ్లు ఉండి తిరిగి వెళ్లిపోతాయి. అదే మనదేశంలో వలస జీవులు... ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఎన్నాళ్లు ఉంటారో లెక్కలేదు. అలాంటి వారి బాగోగుల కోసం కృషిచేస్తోంది 'ఎయిడ్ ఎట్ యాక్షన్.' ప్యా రిస్ కేంద్రంగా పనిచేసే 'ఎయిడ్ ఎట్ యాక్షన్' సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. దక్షిణాసియాలో మనదేశంతో పాటు శ్రీలంక, నేపాల్‌లలో సేవలందిస్తోంది. మనదేశంలో ప్రధానంగా వలస కార్మికుల పిల్లల చదువులు, యువతకు స్థానికంగా ఉపాధి... అనే అంశాలపై ఈ సంస్థ దృష్టిపెట్టింది. ఉపాధి కల్పనలో భాగంగా ఎయిడ్ ఎట్ యాక్షన్ 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ లైవ్లీహుడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఐలీడ్)' కార్యక్రమం చేపడుతోంది. దీన్లో 18-25 ఏళ్ల మధ్య వయసు యువత వివిధ పరిశ్రమల్లో పనిచేసేందుకు కావాల్సిన నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. అలా గత పదేళ్లలో దేశవ్యాప్తంగా యాభైవేల మందికి వీరు శిక్షణ ఇచ్చారు. విప్రో, టాటా బీపీవో విభాగాలు, పిజ్జాకార్నర్, యమహా, నోకియా... వంటి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని వారి అవసర...