Food
'వెుక్కజొన్నలు తియ్యగా ఉంటే ఏం బాగుంటాయి... కాల్చి తింటే బాగుంటాయి కానీ'... ... ఇదీ సుమారు పదిహేనేళ్ల క్రితం అప్పుడే కొత్తగా మార్కెట్లోకి వస్తోన్న స్వీట్‌కార్న్ గురించిన అభిప్రాయం. కానీ ఇప్పుడు అదే స్వీట్‌కార్న్ చాలామంది ఇళ్లలో మధ్యాహ్నం స్నాక్‌ఫుడ్డులా మారిపోయింది.థియేటర్లు, బస్టాండ్లు, మార్కెట్లు... ఎక్కడచూసినా పాప్‌కార్న్ మెషీన్లే. వెుక్కజొన్నలు కాలి పేలి వచ్చే ఆ మధురమైన వాసనకు తెలియకుండానే అడుగులు అటువైపుగా సాగుతాయి. ఇప్పుడు పాప్‌కార్న్‌కు తోడుగా ఆ పక్కనే స్వీట్‌కార్న్ బండ్లూ కనిపిస్తున్నాయి. అంత రేటా అనుకుంటూ వెుదట్లో ఆ బండి దగ్గరకు వెళ్లడానికి కాస్త సంశయించేవారు. అయితే ఆ మసాలా స్వీట్‌కార్న్ వాసన ఆ రుచిని ఆస్వాదించకుండా ఉంచలేకపోయింది. క్రమంగా పాప్‌కార్న్‌కే పోటీగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే చేసుకుని తినేంతగా స్వీట్‌కార్న్ మసాలా పాపులర్ అయిపోయింది. మామూలు వెుక్కజొన్నకంకుల మాదిరిగానే ఇవి సూపర్‌మార్కెట్లు, రైతుబజార్లలో విరివిగా లభ్యమవుతున్నాయి. వంటిల్లో...
స్వీట్‌కార్న్... పేరుని బట్టే ఇందులో షుగర్ శాతం ఎక్కువ అని తెలిసిపోతుంది. ఇండియన్‌కార్న్, షుగర్‌కార్న్, పోల్‌కార్న్... ఇలా రకరకాలుగా పిలుస్తారు. నిజానికి ఇది అనుకోకుండా పుట్టిన రకం. స్థానిక అమెరికన్లు సహజంగా పెంచే వెుక్కజొన్నల్లో జరిగిన జన్యుమార్పుల కారణంగా ఈ రకం పుట్టుకొచ్చింది. అది క్రమంగా వెజిటబుల్ స్నాక్‌గా ప్రాచుర్యం పొందింది. పైగా ఇది సంకరీకరణకు అనుకూలంగా ఉండటంతో అంతటా ఆదరణ పొందింది. లాటిన్ అమెరికన్ దేశాల్లో దీన్ని బీన్స్‌తో కలిపి తింటారు. దాంతో సమతులాహారం సమకూరినట్లే. ఇండొనేషియాలో దీన్ని పాలల్లో నానబెట్టి తింటుంటారు. సూపుల్లో ఎక్కువగా వాడుతుంటారు. వీటిని కోయకుండా అలాగే చెట్టుకే ఎండనిచ్చి, తీసి వేయిస్తే పాప్‌కార్న్‌లా పేలకుండా రెట్టింపుసైజులోకి ఉబ్బుతాయి. వీటినే కార్న్‌నట్స్ అని పిలుస్తారు. చాలామంది వీటితో పుడ్డింగ్స్ తయారుచేస్తారు. ఈ కార్న్‌మీల్‌ను అనేక వంటల్లోనూ వాడతారు.
జ్ఞాపకశక్తికీ...
ఉడికించిన స్వీట్‌కార్న్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హృద్రోగాలు, క్యాన్సర్లు తగ్గించేందుకు దోహదపడతాయి. సాధారణంగా కూరగాయలు, పండ్లు తాజాగా ఉన్నప్పటికన్నా ఉడికించినవాటిలో పోషకాలు తగ్గుతాయి. అయితే స్వీట్‌కార్న్ విషయానికొస్తే తాజా వాటికన్నా ఉడికించినప్పుడే వీటిల్లో యాంటీఆక్సిడెంట్ల శాతం పెరుగుతుందట. తియ్యగా ఉండటంతోబాటు ఇతర కార్బొహైడ్రేట్ల ద్వారా వచ్చే క్యాలరీలకన్నా స్వీట్‌కార్న్ తినడంవల్ల వచ్చే క్యాలరీలు ఆరోగ్యరీత్యా మంచివన్న కారణంతో కూడా వీటి వాడకం పెరిగింది. ఇందులో బి1, బి5, సి-విటమిన్, ఫోలేట్లు, ఫాస్ఫరస్, పీచు, మాంగనీస్ వంటి పోషకాలతోపాటు ఖనిజాలు కూడా ఎక్కువగా లభ్యమవుతాయి. పైగా ఇందులో క్యారెట్లలో మాదిరిగా బీటాకెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. అది ఊపిరితిత్తుల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. పొగతాగేవాళ్లు రోజూ స్వీట్‌కార్న్ తినడంవల్ల లంగ్‌క్యాన్సర్ వచ్చే శాతం 37 శాతం తగ్గుతుందట. వీటిని ఎక్కువగా తినడంవల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందట. ఎందుకంటే జ్ఞాపకశక్తికి కారణమైన థైమీన్ ఇందులోని బి-విటమిన్‌లో దొరుకుతుంది. పిల్లలు సమపాళ్లలో వీటిని తినడంవల్ల జ్ఞాపకశక్తీ, తెలివితేటలూ పెరుగుతాయట. మరో ముఖ్యమైన అంశం ఏమంటే బి-విటమిన్లలో ఎక్కువగా ఉండే పాంథోథెనిక్ ఆమ్లం కూడా స్వీట్‌కార్న్‌లో పుష్కలంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలకు లోనయిన సందర్భాల్లో శక్తిని విడుదల చేసేందుకు ఈ ఆమ్లం దోహదపడుతుంది. అయితే దీన్ని ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యం. వెన్న ఎక్కువగా వేసి ఉడికించడంకన్నా తాజా కార్న్‌కే కాస్త ఉప్పు, మిరియాలపొడి రాసి గ్రిల్ చేసి తింటే పోషకరీత్యా ఎంతో మంచిదట. లేదంటే ఉడికించిన వాటిని సలాడ్స్‌లోనూ కూరల్లోనూ వాడుకోవచ్చు. సో... కాల్చిన వెుక్కజొన్నకండెలే కాదు... వేయించిన వెుక్కజొన్నగింజలు కూడా ఎంతో రుచి మరి!
(100గ్రా. తాజా గింజల్లో)
శక్తి | | 86 కిలో క్యాలరీలు |
పిండిపదార్థాలు | | 19.02 గ్రా. |
కొవ్వులు | | 1.18గ్రా. |
పీచు | | 2.7గ్రా. |
ప్రొటీన్లు | | 3.2గ్రా. |
నీరు | | 75.96గ్రా. |
థైమీన్ | | 0.2 మి.గ్రా. |
విటమిన్-సి | | 6.8 మి.గ్రా. |
ఐరన్ | | 0.52 మి.గ్రా. |
మెగ్నీషియం | | 37మి.గ్రా. |
పొటాషియం | | 270మి.గ్రా. |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి