బుల్లి అప్లికేషన్లు.. భలే సౌకర్యాలు! (Eenadu_22/11/12)
ఇంట్లో ల్యాపీ... పీసీ ఉందా? ఉన్న టూల్స్‌నే వాడితే... అవసరాలు అరుదుగా తీరతాయి... మరి కొత్తవేంటో తెలుసుకుంటే? ఇట్టే పనులైపోతాయి! కం ప్యూటర్‌లో పనిని మరింత సులువు చేసేందుకు ఎప్పటి కప్పుడు వచ్చే సరికొత్త అప్లికేషన్లను తెలుసుకోవలసిందే. ఉచితమైనా, అరుదైనవైనా ఇన్‌స్టాల్ చేసుకుంటే ఎన్నో సౌకర్యాలను వేళ్లతో నడిపించవచ్చు. అలాంటి వాటిపై ఓ కన్నేద్దామా! కొత్తగా కొన్ని... ఏదైనా ఇమేజ్ రిజల్యుషన్ తగ్గించాలంటే ఏదో ఒక ఫొటో ఎడిటింగ్ టూల్‌పై ఆధారపడాల్సిందే. అలా కాకుండా ఫొటో ఫైల్‌పై రైట్‌క్లిక్ చేసి రిజల్యుషన్ తగ్గించే మార్గం ఒకటుంది. అలాగే ఫైల్ సేవ్ చేసిన లొకేషన్ పాత్‌ని టెక్స్ట్ ఫైల్ కూడా పొందవచ్చు. ఫైల్‌పై రైట్‌క్లిక్ చేసి పాత్‌ని కాపీ చేస్తే చాలు. వీటిని సాధ్యం చేసేదే Shell Tools . ఇన్‌స్టాల్ చేయగానే రైట్‌క్లిక్ మెనూలో అదనపు ఆప్షన్లు కనిపిస్తాయి. 'ఫైల్ నోట్' ఆప్షన్‌తో నోట్స్ రాసుకోవచ్చు. http://goo.gl/yW5i2 తాళం వేయవచ్చు! ఇంట్లో... ఆఫీస్ సిస్టంలో ముఖ్యమైన ఫైల్స్‌ని ఇతరులెవరూ చూడకూడదనుకుంటే డెస్క్‌టాప్‌ని 'పేటరన్ లాక్'తో సురక్షితం చేయవచ్చు. Eusing Maze Lock తో...