ట్విట్టర్ హిట్ అవ్వాలంటే..(Eenadu_01/11/12)
సెలబ్రిటీలే కాదు... సామాన్యులు కూడా... ట్విట్టర్‌ని వాడేస్తున్నారు! అప్‌డేట్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు! మరి మీరు వెనకబడితే ఎలా? అదనపు హంగులతో అదరగొట్టండి! అందుకు ఇవిగో మార్గాలు!ట్విట్టర్‌లో పోస్టింగ్ అంటే మొబైల్ ఎసెమ్మెస్ మాదిరిగా కేవలం 140 అక్షరాల్ని మాత్రమే పోస్ట్ చేయగలమనో... విశాలమైన భావాల్ని సంక్షిప్తంగా చెప్పాలనో... అనుకుంటే పొరబాటే. కొన్ని ప్రత్యేక యాడ్‌ఆన్స్‌తో ట్విట్టర్‌ని హిట్ చేయవచ్చు. అనేక వెబ్ సర్వీసులతో పరిధుల్ని చెరిపేయవచ్చు. అదేం పెద్ద క్లిష్టమైన ప్రక్రియేం కాదు. ఎలాగో కాస్త వివరంగా తెలుసుకుందాం!క్రియేట్ చేస్తే సరా! సోషల్ నెట్‌వర్క్‌ల్లోనో.. మైక్రో బ్లాగింగ్‌లోనో ఎకౌంట్ క్రియేట్ చేస్తే సరి కాదు. వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుండాలి. అప్పుడే మీ ఎకౌంట్‌ని సురక్షితం చేసుకోగలరు. అందుకే మీ ట్విట్టర్ ఎకౌంట్‌ని ట్రాక్ చేసేందుకు http://twittercounter.comలో సభ్యులైపోండి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 61 మిలియన్ల యూజర్లు వాడుతున్నారు. దీంట్లో సభ్యులవ్వగానే మీ ఎకౌంట్ పోస్టింగ్ వివరాల్ని, ఫాలోయర్స్‌ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. రోజువారీ నివేదికల్ని పొందొచ్చు. కమర్షియల్స్ వెర్షన్లలోకి లాగిన్ అయ్యి రిపోర్ట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కూడా. ఎంతైనా సరే! ట్విట్టర్‌లో సంక్షిప్త సందేశాల్నే కాదు, పెద్ద వ్యాసాల్ని కూడా షేర్ చేయవచ్చని తెలుసా? అందుకుwww.twitlonger.comవెబ్ సర్వీసులో లాగిన్ అవ్వండి. హోం పేజీలో కనిపించే Sign in with Twitter పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. పోస్ట్ చేయాలనుకునే అంశాల్ని టైప్ చేసి లింక్ రూపంలో ట్విట్టర్ వాల్‌పై పోస్ట్ చేయవచ్చు. సర్వీసుని వాడే ముందు ప్రైవసీ పాలసీని పూర్తిగా చదవండి. ముందే సాధ్యం చెప్పాలనుకునే విషయాన్నో... స్నేహితుడి పుట్టిన రోజు శుభాకాంక్షల్నో... మరేదైనా అప్‌డేట్‌ని ముందే సెట్ చేసి అది అనుకున్న తేదీలో మాత్రమే పోస్ట్ అయ్యేలా చేయాలంటే అందుకు ప్రత్యేక సర్వీసు సిద్దంగా ఉంది. అదే http://twuffer.com. సైట్‌లోకి లాగిన్ అయ్యి క్యాలెండర్ ఆధారంగా ముందే ట్వీట్‌లను కంపోజ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసి పెట్టుకున్న జాబితా ఆయా తేదీల్లో ఆటోమాటిక్‌గా పోస్ట్ అయిపోతాయి. ఎపాయింట్‌మెంట్స్, డెడ్‌లైన్ వివరాల్ని రిమైండర్‌గా పెట్టుకోవచ్చు. * ఇలాంటిదే మరోటి http://futuretweets.com రెండూ ఒకేసారి! బ్రౌజర్‌లో ఒకవైపు సోషల్‌నెట్‌వర్క్‌ని వాడుతూనే మరోపక్క బ్రౌజింగ్ చేసుకోవాలంటేhttp://twitbin.comలోకి వెళితే సరి. ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని వాడుతున్న బ్రౌజర్‌లో ట్విట్టర్‌ని యాక్సెస్ చేస్తూనే మరోపక్క నెట్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు. విండోస్, లినక్స్, మ్యాక్ ఓఎస్‌లో వాడుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేయగానే బ్రౌజర్‌కి ఎడమ వైపు సైడ్‌బార్‌లా ట్విట్టర్ కనిపిస్తుంది. బ్రౌజింగ్‌లో తారసపడిన వెబ్‌లింక్స్‌ని ఒకే క్లిక్కుతో ట్విట్టర్‌పై పోస్ట్ చేయవచ్చు. ఫైర్‌ఫాక్స్ 4 తర్వాత అందుబాటులోకి వచ్చిన వెర్షన్లలో దీన్ని వాడుకోవచ్చు. ఇదో ప్రత్యేక 'సూట్' ఉద్యోగం.. వ్యాపారాల్లో కూడా ట్విట్టర్‌ని భాగస్వామిని చేసి పూర్తిస్థాయిలో వాడుకోవచ్చు. దీన్నే సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ అని పిలుస్తున్నారు. అందుకు ప్రత్యేక వేదికలు సిద్ధంగా ఉన్నాయి. వాటిల్లోhttp://marketmesuite.com ఒకటి. మీరు వాడుతున్న సోషల్‌నెట్‌వర్క్ వివరాలతో లాగిన్ అయ్యి మార్కెట్ ట్రెండ్స్‌ని రియల్ టైంలో తెలుసుకోవచ్చు. కస్టమర్లతో సులువైన పద్ధతిలో కమ్యూనికేట్ చేయవచ్చు. ట్విట్టర్, ఫేస్‌బుక్, LinkedInసోషల్ నెట్‌వర్క్‌ల్లో పోస్ట్ చేయాల్సిన మెసేజ్‌లను ఒకేసారి షెడ్యూల్ చేయవచ్చు. నెట్‌వర్క్ అప్‌డేట్స్‌ని ఇట్టే ట్రాక్ చేసే వీలుంది. ఇది మరోటి మీ ఎకౌంట్‌లో ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉండి వేలల్లో ట్విట్స్ పోస్ట్ అవుతున్న సందర్భాల్లో ముఖ్యమైన వాటినే ట్రాక్ చేసి స్పందించాలంటే అందుకు ప్రత్యేక వారధి ఉంది. అదే www.tweriod.com. ట్విట్టర్ ఎకౌంట్‌లో లాగిన్ అయ్యి ఎప్పటికప్పుడు మీ ఎకౌంట్‌కి చేరుతున్న ట్వీట్స్, ఫాలోయర్స్ స్టేటస్‌లను తెలుసుకోవచ్చు. దీంతో సరైన సమయానికి ట్విట్టర్ వాల్‌పై మీ స్పందనని తెలియజేయవచ్చు. నిర్ణీత సమయానికి ట్రాక్ చేసిన వివరాల్ని పొందే వీలుంది. ఈమెయిల్ రూపంలో రిపోర్ట్‌లు ఇన్‌బాక్స్‌ని చేరతాయి. ఫిల్టర్ చేయవచ్చు లెక్కకు మిక్కిలిగా చేరుతున్న ట్వీట్స్ నుంచి మీ ఆసక్తుల మేర కావాల్సిన వాటిని మాత్రమే బ్రౌజ్ చేసి చూడాలంటే అందుకు అనువుగా మీ ట్విట్టర్ వాల్‌ని మార్చుకోవచ్చు. అందుకు www.tweetwally.comవెబ్ సర్వీసులోకి వెళ్లాల్సిందే. కీవర్డ్స్, యూజర్‌నేమ్స్,Hashtagsట్యాబ్ విండోలతో వాల్ కనిపిస్తుంది. మేనేజ్ చేయండి వేలల్లో ఫాలోయర్స్‌లో చురుగ్గా ఉండేవారెవరు, ఫ్రొఫైల్ ఫొటో లేకుండా ఎకౌంట్‌ని వాడే వారెవరు లాంటి వివరాల్ని తెలుసుకోవాలంటే http://manageflitter.com లో సభ్యులైతే సరి. లాగిన్ అయ్యి ట్రాక్ చేసిన సమాచారం ఆధారంగా అక్కర్లేని ఫాలోయర్స్‌ని వెతికి తొలగించొచ్చు. షెడ్యూల్ ట్వీట్స్‌ని సెట్ చేసుకుని నిర్ణీత సమయానికి పోస్ట్ అయ్యేలా చేయవచ్చు. అలర్ట్ చేస్తుంది! మీ ఉద్యోగం... వ్యాపారం.. చదువు అంశాలకు సంబంధించిన ఏదైన అప్‌డేట్ నెట్‌వర్క్‌లో పోస్ట్ అవ్వగానే మీకో రిమైండర్ వచ్చేస్తే! అందుకు ప్రత్యేక సర్వీసు ఉంది. http://tweetalarm.comలో సభ్యులైతే సరి. మీరు ఎంచుకున్న కీవర్డ్స్ ఆధారంగా ఆయా అప్‌డేట్స్ నోటిఫికేషన్స్ రూపంలో మెయిల్ ఇన్‌బాక్స్‌ని చేరిపోతాయి. అలర్ట్‌లను రోజువారీ లేదా వారాంతాల్లో చేరేలా సెట్ చేసుకోవచ్చు. రోబో అసిస్టెంట్ ట్విట్టర్ ఎకౌంట్‌తో వర్చువల్ ఛాట్ రూంలను క్రియేట్ చేసుకోవాలంటే http://nurph.com వెబ్ సర్వీసులో సభ్యులవ్వండి. సభ్యులై క్రియేట్ చేసిన ఛాట్ రూంల్లో ఫాలోయర్స్ మీ వాల్‌పై ట్విట్ చేయవచ్చు. అంతేనా! మీతో ఛాట్ కూడా చేయవచ్చు. రోబో అసిస్టెంట్‌ని పెట్టుకుని వాల్‌పై వచ్చే ట్విట్స్‌కి ఆటోమాటిక్‌గా రిప్త్లె ఇవ్వొచ్చు. వారిని తెలుసుకోవాలంటే? మీరు ట్విట్టర్‌లోకి లాగిన్ అవ్వగానే మీ నెట్‌వర్క్ నుంచి ఎంత మంది అన్‌ఫాలోయర్స్‌గా మారారో తెలుసుకోవాలంటే అందుకు http://useqwitter.com ఉంది. ఫ్రీ ఎకౌంట్‌లోకి లాగిన్ అయ్యి ఒక ట్విట్టర్ ఎకౌంట్‌ని ట్రాక్ చేయవచ్చు. వారాంతంలో అప్‌డేట్స్‌ని పొందొచ్చు. ఒకేసారి అన్నీ! ఒకటి కంటే ఎక్కువ ట్విట్టర్ ఎకౌంట్‌లను వాడుతుంటే వాటిని ఒకేసారి యాక్సెస్ చేసేందుకు సులువైన మార్గంhttp://splitweet.com . వాడుతున్న ఎకౌంట్స్‌లోకి లాగిన్ అయ్యాక అన్నింటిలోని ట్వీట్స్‌ని సులువుగా మేనేజ్ చేయవచ్చు. ఆయా నెట్ వర్క్‌ల్లో సభ్యులకు మీ స్పందనని తెలియజేయడానికి ప్రత్యేక మార్గాలున్నాయి. పోల్చి చూడండి మీ ట్విట్టర్ ఎకౌంట్‌ని ఇతరులతో పోల్చి చూడాలంటేhttp://twitchamp.comలోకి వెళ్లండి. మీది, స్నేహితుడి ట్విట్టర్ యూజర్ పేర్లను ఎంటర్ చేసి Fightబటన్‌పై క్లిక్ చేయండి. ఇలా పంచేయండి! ఎక్కువ మెమొరీ ఉన్న ఫైల్స్‌ని ట్విట్టిర్ వాల్‌పై షేర్ చేయాలంటే అందుకూ ఓ మార్గం ఉంది. అదేhttp://tweetcube.comదీంట్లోకి లాగిన్ అయ్యి 10 ఎంబీ ఫైల్స్‌ని షేర్ చేయవచ్చు. అన్ని ఫైల్ ఫార్మెట్‌లను సపోర్ట్ చేస్తుంది. వెబ్ సర్వీసు ద్వారా పోస్ట్ చేసిన ఫైల్ 30 రోజుల తర్వాత తొలగిపోతుంది. స్టేటస్ కావాలా? సైట్‌లో మీరు ట్విట్టర్ యూజర్‌నేమ్ ఎంటర్ చేసి ఎకౌంట్ స్టేటస్‌ని అప్పటికప్పుడే తెలుసుకోవాలంటేwww.tweetstats.comలోకి వెళితే సరి. హోం పేజీలోకి టెక్స్ట్ బాక్స్‌లో పేరు టైప్ చేసి Graph My Tweets పై క్లిక్ చేస్తే సరి.Tweets per hour, Tweets per month... లాంటి వివరాల్ని పొందొచ్చు. కావాల్సినవే..! ఏదైనా ప్రత్యేక కీవర్డ్‌తో ట్విట్టర్‌లో పోస్ట్ అవుతున్న ట్వీట్స్‌ని యానిమేషన్‌తో పొందాలంటేhttp://visibiletweets.com వెబ్ సర్వీసు ఉంది. సెర్చ్‌బాక్స్‌లో కీవర్డ్, hashtagటైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఒక్కో ట్విట్ యానిమేషన్‌తో కనిపిస్తుంది. భాష ఏదైనా! వివిధ భాషల్లో మీ ట్వీట్స్‌ని పోస్ట్ చేయవచ్చు. అందుకు http://tweetrans.comసిద్ధంగా ఉంది. సుమారు 40 భాషల్ని సైట్ సపోర్ట్ చేస్తుంది. * మీ నెట్‌వర్క్‌లో ఉన్న ఫాలోయర్స్ ఏయే దేశాలకు చెందిన వారో తెలుసుకోవాలంటేhttp://tweepsmap.comలోకి వెళ్లండి. అదే టాప్ ట్వీట్! మీరు పోస్ట్ చేసిన ట్వీట్స్‌లో ఎక్కువ ఆదరణ పొందిన ట్వీట్‌ని 'టాప్ ఒన్'గా ఎంపిక చేసి తెలుసుకోవాలంటేhttp://mytoptweet.comలోకి వెళ్లండి. ట్విట్టర్ ఐడీలో సైన్‌ఇన్ అవ్వాలి. మరింత ఆకట్టుకునేలా! మీరు చేస్తున్న పోస్టింగ్స్‌ని మరింత ఆకట్టుకునేలా మార్చేయాలంటే www.twylah.comలోకి వెళ్లండి. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఆహ్వానాన్ని పంపడం ద్వారా సర్వీసుని వాడుకోవచ్చు. వాల్‌పై పోస్ట్ చేసిన ట్విట్స్‌లోని ఫొటోలు, లింక్స్, ఇతర వివరాల్ని ప్రత్యేక వెబ్ పేజీలో చూడొచ్చు. |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి