కెమెరా కన్నుకి...కొత్త చూపు! (Eenadu_07/11/12)
ఆండ్రాయిడ్ మార్కెట్లో ఉచితంగా దొరికే Pudding Camera ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీ మొబైల్ కెమెరా ప్రొఫెషనల్ కెమెరా మాదిరిగా మారిపోతుంది. 72 స్పెషల్ ఎఫెక్ట్‌లతో ఫొటోలు తీయొచ్చు. మల్టీఫ్రేమ్ షాట్స్, ఫిష్ ఐ, టోయ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. Face Recognition, Grid Feature, Self Camera mode...లాంటి ఆప్షన్లు చాలా ఉన్నాయి. ఎక్కువ ఫొటోలను ఒకేసారి షేర్ చేసే వీలుంది. డేట్, టైం, ఇమేజ్ సైజ్... వివరాలతో ఫొటోలను ప్రివ్యూ చూడొచ్చు. 472, 700, 1280 పిక్సల్ సైజుల్లో ఫొటోలు తీసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న ఫొటోలను మెయిల్ చేసే వీలుంది.http://goo.gl/GSgZv రెండిటిలోనూ..! ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందిందే Camera 360. ముందు, వెనకా ఏర్పాటు చేసిన రెండు కెమెరాల్ని ఇది సపోర్ట్ చేస్తుంది. ఫుల్‌స్క్రీన్ మోడ్‌లో హై రిజల్యుషన్‌తో ఫొటోలు తీసుకోవచ్చు. కెమెరా 360 క్లౌడ్ స్టోరేజ్‌లో ఆన్‌లైన్‌లోనే ఫొటోలను భద్రం చేయవచ్చు. 'మ్యాజిక్ కలర్స్' ఫీచర్‌తో ఫొటో క్వాలిటీని మరింత పెంచొచ్చు. ఫొటోలను గీసిన బొమ్మలా మార్చే 'స్కెచ్' సౌకర్యం ఉంది. హెచ్‌డీఆర్ ఎఫెక్ట్‌తో ఫొటో రిజల్యుషన్‌ని పెంచొచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లుhttp://goo.gl/HVvstలింక్ నుంచి ఉచితంగా పొందొచ్చు. ఐఫోన్ యూజర్లు ఐట్యూన్స్ నుంచి పొందొచ్చు. http://goo.gl/EmZ8y 'పవర్' పెంచండి! డిజిటల్ కెమెరాలో మాదిరిగా క్వాలిటీ ఫొటోలను తీసేందుకు PowerCamటూల్‌ని నిక్షిప్తం చేసుకోండి. వివిధ రకాల ఫిల్టర్లు, ఎఫెక్ట్‌లను సెలెక్ట్ చేసుకునే వీలుంది. Tilt-Shift, Panorama, Collage... లాంటివి ప్రత్యేకం. వైడ్ యాంగిల్‌లో ఫొటోలను తీసేందుకు 'పనోరమా' ఆప్షన్ ఉంది. Color Splashతో అక్కర్లేని రంగుల్ని తొలగించొచ్చు. లేని రంగుల్ని కలపచ్చు కూడా. ఫొటోలను సోషల్ నెట్‌వర్క్‌ల్లో షేర్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లుhttp://goo.gl/4fMW9నుంచి పొందొచ్చు. ఐఫోన్ వెర్షన్‌ని ఐట్యూన్స్‌ని పొందే వీలుంది. http://goo.gl/494Uu నోకియా వాడుతున్నారా? సింబియాన్ ఓఎస్‌తో నోకియా వాడుతుంటే ఓవీ స్టోర్‌లో ప్రత్యేక అప్లికేషన్స్ సిద్ధంగా ఉన్నాయి. అందుకు ఉదాహరణే CameraPro. తాకేతెర మొబైళ్లలో మాత్రమే కాకుండా సాధారణ మొబైళ్లలోనూ దీన్ని వాడుకోవచ్చు.ISO Setting, AutoFocus, HDR, timer... లాంటి మరిన్ని సౌకర్యాలు ఉన్నాయి. సెల్ఫ్‌టైమర్‌తో ఫొటోలు తీసుకోవచ్చు. యాంటీషేక్, ఫేస్‌డిటెక్షన్ కూడా ఉన్నాయి. http://goo.gl/TdihI*ఇలాంటిదే మరోటి Camera Plus. సులువైన ఇంటర్ఫేస్‌తో రూపొందించారు. http://goo.gl/aQKIW వారికి ప్రత్యేకం విండోస్ ఓఎస్‌తో మొబైల్ వాడితే కెమెరా సదుపాయాలకు ప్రత్యేక ల్యాబ్‌ని సెట్‌అప్ చేసుకోవచ్చు. అందుకు Pictures Lab ఇన్స్‌స్టాల్ చేసుకుంటే సరి. విండోస్ ఫోన్ 7 వెర్షన్‌కి సరిపడేలా ఆకట్టుకునే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్‌తో ఆప్‌ని క్రియేట్ చేశారు. మొత్తం 30 రకాల ఎఫెక్ట్‌లను జాబితాగా పొందొచ్చు. హెచ్‌డీఆర్, Soften, Auto Adjust, Sharpen, Comic, Sepia, Dynamic Previews... లాంటి ఆప్షన్లు ఉన్నాయి. http://goo.gl/ozj4A ఇవేమో అదనం! మరింత ఫ్రొఫెషనల్‌గా వాడుతున్న ఐఫోన్‌తో ఫొటోలు తీయాలనుకుంటే అదనపు లెన్స్‌ని ఫోన్‌కి యాడ్ చేయవచ్చు. అదే Olloclip. ఐఫోన్ 4/4ఎస్‌లకి లెన్స్‌ని క్లిప్ చేసి వాడుకోవచ్చు. మూడు రకాల లెన్స్‌ని పొందుపరిచారు. అవే ఫిష్‌ఐ, వైడ్ యాంగిల్, మాక్రో లెన్స్. ధర సుమారు రూ.3,850. వీడియో, ఇతర వివరాలకుwww.olloclip.com/product/* ప్రత్యేక స్టాండ్‌పై మొబైల్‌ని క్లిప్ చేసి స్టిల్ ఫొటోలు తీసుకోవాలంటే? అందుకో ప్రత్యేక స్టాండ్ సిద్ధంగా ఉంది. అదే GorillaPod ClampStand. మీరు వాడేది ఏ మొబైల్ అయినా స్టాండ్‌పై కావాల్సినట్టుగా అమర్చుకోవచ్చు. స్టాండ్‌కి ఏర్పాటు చేసిన కాళ్లను ఎటైనా ఒంచుకునే వీలుంది. ధర సుమారు రూ.1,650. మరిన్ని వివరాలకు http://joby.com/gorillapod/video మరికొన్ని చిట్కాలు.. * లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు హెచ్‌డీఆర్ మోడ్ వాడడం మంచిది. లెన్స్‌పైన చేరిన దుమ్ము, వేలి ముద్రలతో కొన్ని సార్లు ఫొటోల నాణ్యత తగ్గుతుంది. అందుకే షూటింగ్ చేసేముందు కెమెరా లెన్స్‌ని క్లిన్ చేయాలి. * జూమ్ సదుపాయాన్ని వీలైనంతవరకూ వాడకుండా ఉంటేనే మంచిది. కెమెరా సెట్టింగ్స్‌లోకి వెళ్లి ISO of 200 or Lower ని సెలెక్ట్ చేయండి. దీంతో ఇమేజ్ క్వాలిటీ పెరుగుతుంది. * ఫొటో తీసిన తర్వాత ఎడిటింగ్ టూల్స్‌ని స్కెచ్‌గా మార్చడం మామూలే. అదే ఫొటో తీసేప్పుడే ఆ పని చేయాలంటే Camera Fun టూల్‌తో సాధ్యమే. http://goo.gl/TwLhw * రాత్రి సమయంలో ఫొటోలు తీసుకునేందుకు అనువుగా రూపొందించిందే Night Vision Camera. http://goo.gl/9h5sf * మొబైల్‌కి ఉన్న లెన్స్‌ని నాలుగు లెన్స్‌లుగా మార్చాలంటే 'మల్టీ లెన్స్ కెమెరా'తో సాధ్యమే. దీంతో ఒకేసారి నాలుగు ఫొటోలు తీసుకోవచ్చు. http://goo.gl/Yrjd2
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి