బుల్లి అప్లికేషన్లు.. భలే సౌకర్యాలు! (Eenadu_22/11/12)
ఇంట్లో ల్యాపీ... పీసీ ఉందా? ఉన్న టూల్స్‌నే వాడితే... అవసరాలు అరుదుగా తీరతాయి... మరి కొత్తవేంటో తెలుసుకుంటే? ఇట్టే పనులైపోతాయి!కంప్యూటర్‌లో పనిని మరింత సులువు చేసేందుకు ఎప్పటి కప్పుడు వచ్చే సరికొత్త అప్లికేషన్లను తెలుసుకోవలసిందే. ఉచితమైనా, అరుదైనవైనా ఇన్‌స్టాల్ చేసుకుంటే ఎన్నో సౌకర్యాలను వేళ్లతో నడిపించవచ్చు. అలాంటి వాటిపై ఓ కన్నేద్దామా!కొత్తగా కొన్ని... ఏదైనా ఇమేజ్ రిజల్యుషన్ తగ్గించాలంటే ఏదో ఒక ఫొటో ఎడిటింగ్ టూల్‌పై ఆధారపడాల్సిందే. అలా కాకుండా ఫొటో ఫైల్‌పై రైట్‌క్లిక్ చేసి రిజల్యుషన్ తగ్గించే మార్గం ఒకటుంది. అలాగే ఫైల్ సేవ్ చేసిన లొకేషన్ పాత్‌ని టెక్స్ట్ ఫైల్ కూడా పొందవచ్చు. ఫైల్‌పై రైట్‌క్లిక్ చేసి పాత్‌ని కాపీ చేస్తే చాలు. వీటిని సాధ్యం చేసేదే Shell Tools. ఇన్‌స్టాల్ చేయగానే రైట్‌క్లిక్ మెనూలో అదనపు ఆప్షన్లు కనిపిస్తాయి. 'ఫైల్ నోట్' ఆప్షన్‌తో నోట్స్ రాసుకోవచ్చు.http://goo.gl/yW5i2 తాళం వేయవచ్చు! ఇంట్లో... ఆఫీస్ సిస్టంలో ముఖ్యమైన ఫైల్స్‌ని ఇతరులెవరూ చూడకూడదనుకుంటే డెస్క్‌టాప్‌ని 'పేటరన్ లాక్'తో సురక్షితం చేయవచ్చు. Eusing Maze Lock తో ఇది సాధ్యమే. అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసి రన్ చేయగానేPattern మౌస్‌తో లాక్‌ని క్రియేట్ చేయాలి. ఒకవేళ డ్రా చేసిన పేటరన్ మర్చిపోతారేమో అనుకుంటే బ్యాక్‌అప్‌ని ఫైల్ మాదిరిగా సేవ్ చేయవచ్చు. ఇక ఎప్పుడైనా పీసీని వదిలి వెళ్లాల్సివస్తే సిస్టం ట్రేలో కనిపించే ఐకాన్ గుర్తుపై క్లిక్ చేస్తే పేటరన్ లాక్ అవుతుంది. తిరిగి డెస్క్‌టాప్‌ని యాక్సెస్ చేయాలంటే మౌస్‌తో పేటరన్‌ని డ్రా చేయాల్సిందే. ఇతరులెవరైనా తప్పుగా మూడుసార్లు డ్రా చేస్తే నిమిషం సమయం అలారం మోగిస్తూ అప్రమత్తం చేస్తుంది. స్క్రీన్‌సేవర్ మాదిరిగా ఆటోమాటిక్‌గా కూడా లాక్ అవుతుంది. వద్దనుకుంటే ట్రేలో ఐకాన్‌పై రైట్‌క్లిక్ చేసి Disable Autolock పై క్లిక్ చేయండి.http://goo.gl/lQQay 'ఎనిమిది' మాటేంటి? విండోస్ 8 ఓఎస్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలంటే మీ సిస్టం సహకరిస్తుందా? అందుకు సిస్టం కాన్ఫిగరేషన్ ఎంతుండాలి?... లాంటి విషయాల్ని తెలుసుకోవాలంటేWindows 8 Upgrade Assistant టూల్‌ని ఇన్‌స్టాల్ చేయండి. రన్ చేయగానే పీసీ మొత్తాన్ని స్కాన్ చేసి వివరాలు అందిస్తుంది. http://goo.gl/nZOsr రెండిటికీ ప్రత్యేకం ఫొటోలను మరింత అందంగా, సౌకర్యంగా మార్చుకోవాలంటే GoodFrame టూల్‌ని నిక్షిప్తం చేస్తే సరి. రకరకాల బోర్డర్లను పెట్టుకునే వీలుంది. 'ఇమేజ్ పేరామీటర్స్' ఆప్షన్స్‌తో ఫొటోలను క్రాప్, రీసైజ్ చేసే వీలుంది. మీరెంచుకున్న లోగోని వాటర్‌మార్క్ రూపంలో ఫొటోలో పెట్టుకోవచ్చు కూడా. http://goo.gl/8Vz37 ఇది మరోలా... సిస్టంలోని ఫైల్స్, ఫోల్డర్లను ఒకచోటి నుంచి మరో చోటకి కాపీ చేయాలంటే Shadow Copy టూల్‌ని ప్రయత్నించండి. విండోస్‌లో లాక్ చేసిన ఫైల్స్‌ని కాపీ చేసుకుని పేస్ట్ చేయవచ్చు. డ్రైవ్ మొత్తాన్ని మరో డ్రైవ్‌లోకి కాపీ చేసుకునే వీలుంది. కాపీ చేయాల్సిన ఫైల్స్‌ని Copy fromనుంచి సెలెక్ట్ చేయాలి. వైల్డ్‌కార్డ్ క్యారెక్టర్లను కూడా వాడుకోవచ్చు. ఎక్కడికి కాపీ చేయాలనేది Copy to లో సెలెక్ట్ చేయాలి. http://goo.gl/yhMlA ఒకేసారి అన్నీ.. ఒక్క క్లిక్కుకే విండోస్‌లో నాలుగైదు అప్లికేషన్లు, ఫైల్స్, ఫోల్డర్లను ఓపెన్ చేయాలనుకుంటే Batchrunటూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అప్లికేషన్‌ని రన్ చేసి విండోలోని 'కమాండ్' మెనూ ద్వారా రన్ చేయాల్సిన ఫైల్స్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు సెలెక్ట్ చేసుకోవాలి. Add పై క్లిక్ చేస్తూ జాబితాగా సెట్ చేయాలి. మొత్తం జాబితాని Save Batchfile on desktop ఆప్షన్‌తో సేవ్ చేయవచ్చు. ఇక ఎప్పుడైనా ఆయా అప్లికేషన్స్‌ని రన్ చేయాలంటే తెరపై కనిపించే ఐకాన్‌ని డబుల్‌క్లిక్ చేస్తే సరి. Copy, Killprocess, Rename... లాంటి ఇతర విండోస్ కమాండ్స్‌ని కూడా రన్ చేయవచ్చు.http://goo.gl/yPtjC కావాల్సినవి మాత్రమే! ఫైర్‌ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, క్రోమ్... ఇలా ఏదోక బ్రౌజర్ వాడుతూనే ఉంటాం. అవసరానికి తగిన యాడ్‌ఆన్స్, టూల్‌బార్స్, ఎక్స్‌టెన్షన్స్‌ని లోడ్ చేస్తుంటాం. మరి, వాటిల్లో అక్కర్లేని వాటిని ఒకేసారి సెలెక్ట్ చేసి తొలగించాలంటే చిన్న అప్లికేషన్‌తో తొలగించొచ్చు. అదేToolbar Cleaner. బ్రౌజర్స్‌ని క్లోజ్ చేసి టూల్‌ని రన్ చేయగానే మొత్తం వివరాలతో విండో వస్తుంది. ఆయా బ్రౌజర్లలో అక్కర్లేని వాటిని చెక్‌బాక్స్‌ల ద్వారా సెలెక్ట్ చేసి Remove Selected Toolbar తో డిలీట్ చేయవచ్చు. విండోస్‌లో రన్ అయ్యే స్టార్ట్‌అప్ ప్రోగ్రాంను కూడా మోనిటర్ చేయవచ్చు.http://goo.gl/vaRsr ఇదో మార్గం! అక్కర్లేని ఫైల్స్‌ని డిలీట్ చేస్తున్న క్రమంలో కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వకుండా మొరాయిస్తుంటాయి. అవి లాక్ అయ్యి ఉండడమో లేదా మరేదైనా ఇతర ప్రోగ్రామ్స్‌లో రన్ అవుతూ ఉండడమే అందుకు కారణం. ఇలాంటి సందర్భాల్లో ఫైల్స్‌ని అన్‌లాక్ చేసి డిలీట్, రినేమ్ చేయాలంటే LockHunter టూల్‌ని నిక్షిప్తం చేయండి.http://goo.gl/Ul6Bh * పీసీలో గతంలో ఏయే అప్లికేషన్లు, ఫైల్స్, ఫోల్డర్లు... ఓపెన్ చేశారో చూడాలంటే LastActivityView టూల్ ఉంది. ఎక్స్‌ట్రాక్ట్ చేసి ఫోల్డర్‌లోని EXE ఫైల్‌ని రన్ చేయగానే రికార్డ్స్ మొత్తం జాబితాగా కనిపిస్తాయి. డేట్, టైం, ఫైల్ పాత్... వివరాలు కూడా కనిపిస్తాయి. ఫైల్ సమాచారాన్ని టెక్స్ట్ ఫైల్‌గా సేవ్ చేసుకోవచ్చు. http://goo.gl/tAFQNs Eenadu link : http://eenadu.net/Specialpages/e-eenadu/e-eenaduinner.aspx?qry=sp-eenadu1 |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి