నడుస్తున్న చరిత్ర.. నగిషీలు (Article about Lepakshi Temple, Source: Eenadu, Date: 24-02-16)
నడుస్తున్న చరిత్ర.. నగిషీలు హిందూపురం, లేపాక్షి: అద్భుత కళలలకు నిలయమైన లేపాక్షి గత చరిత్రకే కాదు.. నడుస్తున్న చరిత్రకూ సాక్షిగా వెలుగొందుతోంది. విజయనగర రాజుల కాలంలో అచ్యుత రాయల వద్ద కోశాధికారిగా పనిచేసిన విరూపణ్ణ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షిలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడి శాసనాలను బట్టి తెలుస్తోంది. ఈ ఆలయం క్రీ.శ 1533లో నిర్మించినట్లు శాసనాల్లో ఉంది. విజయనగర రాజుల కాలంలో లేపాక్షి గొప్ప వాణిజ్య కేంద్రంగాను, పర్యాటక ప్రాంతంగాను పేరొందినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడే రతనాలను రాశులుగా పోసి అమ్మినట్లు లిఖించబడింది. మహాభారతం, రామాయణ గాథలను భావితరాలకు అందించేందుకు ఎన్నో శిల్పాలు, తైలవర్ణ చిత్రాలను ఇక్కడ అబ్చురపరిచేలా చెక్కి చూపారు. నాటి చరిత్ర నేటికీ నడుస్తూనే ఉంది. లేపాక్షి కళాఖండాలను నలుదిశలా చాటేందుకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చింది. ఎన్నో సినిమాలు, లఘు చిత్రాలు, నాటికలు, కథలు, వాణిజ్య ప్రకటనలను లేపాక్షిలో చిత్రీకరించారు. వీటిలో లేపాక్షి అందాలను కళ్లకు కట్టినట్లు చూపారు. వాటిలో కొన్నింటిని పరికిస్తే... లేపాక్షిలో ఒక్క మగాడు.. లేప...