వన దేవతలకు... వందనాలు! (07/02/2017_Sunday magazine)
బండెనక బండి...వేలాది బండ్లు! కార్ల వెనుక కార్లూ, బైకుల వెనుక బైకులూ, బస్సుల వెనుక బస్సులూ, పల్లెల వెనుక పల్లెలూ...తెలంగాణ కుంభమేళా దిశగా, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర వైపుగా! వనంలో జనసందోహం, జనంలో భక్తిపారవశ్యం...
సమ్మక్క తల్లీ! దండాలంటూ.
సారలమ్మ తల్లీ! వందనాలంటూ.
ముక్కు మూసుకుని తపస్సు చేసో, త్రిమూర్తుల్ని పొగడ్తల్లో ముంచెత్తో సాధించేదే అమరత్వం కాదు. నమ్మిన జనం కోసం, నమ్ముకున్న విలువల కోసం, జాతి ఆత్మాభిమానం కోసం...ప్రాణాల్ని త్యజించి కూడా దైవత్వాన్ని సాధించవచ్చు. మరణం తర్వాతా, జనం గుండెల్లో గుడికట్టుకుని బతకొచ్చు. సమ్మక్క సారలమ్మలు - అలానే జనదేవతలయ్యారు, వనదేవతలయ్యారు. మీరే దిక్కంటూ మొక్కిన అమాయక గిరిజనుల కోసం...దిక్కులు పిక్కటిల్లేలా రణన్నినాదం చేశారు. కాకలుతీరిన కాకతీయ యోధుడూ శౌర్యప్రతాపాలకు మారుపేరూ అయిన ప్రతాపరుద్రుడితో యుద్ధానికి సిద్ధపడ్డారు. ఆ రోజుల్లో...మేడారం ప్రాంతాన్ని కాకతీయుల సామంతుడు పగిడిద్ద రాజు పాలించేవాడు. ఎనగందులను (ప్రస్తుత కరీంనగర్‌జిల్లా) పాలించిన మేడరాజుకు ఇతడు మేనల్లుడు. పగిడిద్దరాజు భార్యపేరు సమ్మక్క. ఆ వీరమాతకు సంబంధించి ఓ ఐతిహ్యం ప్రచారంలో ఉంది. ఆ తల్లి అయోనిజ. దట్టమైన అటవీ ప్రాంతంలో, దివ్యకాంతులతో భాసిల్లుతూ పులులతో సింహాలతో ఆడుకుంటూ ఓ బిడ్డ కనిపించిందట. మేడరాజు ఆ పసిపిల్లను తీసుకొచ్చి అల్లారుముద్దుగా పెంచుకున్నాడట. పెద్దయ్యాక మేనల్లుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడట. పగిడిద్దరాజు-సమ్మక్క దంపతులకు ముగ్గురు సంతానం...సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. సారలమ్మ మనువు గోవిందరాజులుతో జరిగింది. గిరిజనులు ఆత్మాభిమానులు, నిజాయతీపరులు. ఆ అమాయకుల మీద కరవు రాకాసి కక్షగట్టింది. ఏడాదీ రెండేళ్లూ కాదు...మూడేళ్ల పాటూ ముప్పుతిప్పలు పెట్టింది. కడుపు నింపుకోడానికే దిక్కులేని పరిస్థితిలో కప్పమేం కడతారు. కాటకాలతో కటకటలాడుతూ కానుకలేం సమర్పిస్తారు. ఆ విన్నపం ప్రభువులకు ధిక్కార స్వరంలా అనిపించింది. ఆ నిస్సహాయత ఏలినవారికి రాజద్రోహంలా కనిపించింది. తండోపతండాల సైన్యం తండాలవైపు కదిలింది. ఓవైపు మత్తగజాలతో, జాతి గుర్రాలతో కాకతీయ సేనలు. మరోవైపు డొక్కలెండిన గిరిజన దండు. ములుగు సమీపంలోని లక్నవరం సరస్సు వద్ద కాకతీయ సేన గుడారాలు వేసుకుంది. గుండెనిండా ధైర్యంతో, గిరిజనులు ఎదురొడ్డి పోరాడారు. పగిడిద్ద రాజూ అతని కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు...మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద శత్రువుల్ని నిలువరించే ప్రయత్నంలో...నేలకూలారు. ఓటమి భారాన్ని తట్టుకోలేక...పగిడిద్దరాజు తనయుడు జంపన్న...సంపెంగ వాగులో ఆత్మార్పణ చేసుకున్నాడు. ఆ యోధుడి రక్తంతో సంపెంగ వాగు...వీరతిలకాన్ని దిద్దుకున్నట్టు ఎర్రబారిపోయింది. ఆ వీరుడి స్మృతి చిహ్నంగా జంపన్నవాగని పేరు మార్చుకుంది.

ఆ దుర్వార్తలు సమ్మక్కను కుంగదీశాయి. గుండెలు బాదుకుంది. కన్నీళ్లు పెట్టుకుంది. ఆ నిస్పృహా తాత్కాలికమే. మరునిమిషం, ఆ వీరమాత రౌద్రమూర్తిలా మారింది. కత్తిబట్టి కాళికాంబను తలపించింది. ఆ తల్లి ధాటికి శత్రుమూకలు తల్లడిల్లిపోయాయి. యోధానయోధులకు మారుపేరైన కాకతీయ సేనలు కరవాలాన్ని జారవిడిచే పరిస్థితి వచ్చింది. అంతగొప్ప సామ్రాజ్యాధీశులు అడవి బిడ్డల ముందు తలవంచడమంటే, ఓటమిని అంగీకరించడమంటే ఎంత అప్రతిష్ఠ! సరిగ్గా ఈ దశలోనే...రణక్షేత్రంలో కుట్రలూ కుతంత్రాలూ మొదలయ్యాయి. ప్రలోభాలు ప్రవేశించాయి. ఓ పిరికి సైనికుడు సమ్మక్కను వెన్నుపోటు పొడిచి పారిపోయాడు. రక్తమోడుస్తూ...మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ల వైపు వెళ్లి, మలుపు ప్రాంతంలో సమ్మక్క తల్లి మాయమైపోయింది. ఆ విషయం తెలిసి కోయగూడెం కన్నీళ్లు పెట్టుకుంది. దివిటీలు పట్టి దిక్కుదిక్కూ గాలించింది. అంతిమంగా ఓ ఆనవాలు - గుట్టమీదున్న నెమలినార చెట్టువద్ద, పుట్ట దగ్గర...ఒక కుంకుమ భరిణె! అది సమ్మక్క ఆదేశమని భావించారు, అదే సమ్మక్క ఆనవాలని స్వీకరించారు. అంతలోనే, ‘కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీరభోజ్యం కానేకాదు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తీ వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలి. ఈ స్థలంలో రెండు గద్దెలు కట్టించి రెండేళ్లకోసారి ఉత్సవం జరిపిస్తే, భక్తుల కోరికలు నెరవేరుస్తా’ అంటూ అశరీరవాణి నుడివింది. అమ్మ ఆదేశాల్ని శిరసావహించారు గిరిజనులు. కొంతకాలానికి, ప్రతాపరుద్రుడు అహాన్ని పక్కనపెట్టి ఆత్మావలోకనం చేసుకున్నాడు. కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేశాడు. సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. సమ్మక్క-సారలమ్మల త్యాగాలు మాత్రం గద్దెలై నిలిచి ఉన్నాయి, కథలై వినిపిస్తున్నాయి, మహత్యాలై కనిపిస్తున్నాయి.
వరంగల్ జిల్లా కేంద్రానికి నూటపది కిలోమీటర్ల దూరంలో ఉంది మేడారం. తాడ్వాయి మండల పరిధిలోకి వస్తుందా ప్రాంతం. వరంగల్ నుంచి జాతీయ రహదారి మీదుగా సుమారు తొంభై కిలోమీటర్లు ప్రయాణిస్తే తాడ్వాయి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో పద్నాలుగు కిలోమీటర్లు వెళ్తే మేడారం. అక్కడే వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువుదీరారు. మేడారానికి చుట్టూ ఖమ్మం, కరీంనగర్ జిల్లాలున్నాయి. పొరుగున చŒత్తీస్‌గఢ్ ఉంది. రెండు దశాబ్దాల క్రితమే సర్కారువారు, మేడారం జాతరని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించారు. ఈ సారి, సంబురానికో ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత...సమ్మక్క-సారలమ్మ జాతర జరగడం ఇదే తొలిసారి. కేసీఆర్ ప్రభుత్వం...భారీస్థాయిలో రూ.174 కోట్ల నిధులు కేటాయించింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గిరిజన సంప్రదాయం ప్రకారం...ప్రతి రెండేళ్లకోసారీ నాలుగు రోజుల పాటూ నిర్వహించే ఈ మహా జాతర ఫిబ్రవరి 17, 18, 19, 20 తేదీల్లో జరుగనుంది. పదిహేడో తేదీన సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దె మీదికి ఎక్కుతారు. పద్దెనిమిదిన సారలమ్మ గద్దె ఎక్కుతుంది. పందొమ్మిదిన, భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. ఇరవైన అధికారిక లాంఛనాలతో అమ్మలు వనప్రవేశం చేస్తారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, బిహార్, ఒడిశా తదితర రాష్ట్రాలనుంచి వచ్చే లక్షలాది భక్తులతో మేడారం జనసంద్రంలా మారుతుంది. చెంచులూ వడ్డెలూ గోండులూ కోయలూ లంబాడీలూ భిల్లులూ రఫీస్తార్ గోండులూ సవర ఆదివాసులూ...ఇలా సమస్త గిరిజనమూ తరలివస్తుంది.
జాతరకు వచ్చే భక్తులు, తొలుత పొలిమేరలోని జంపన్నవాగులో స్నానం చేస్తారు. ఆతర్వాతే సమ్మక్క-సారలమ్మల దర్శనానికి బయల్దేరతారు. వాగు ఒడ్డునే జంపన్న గద్దె ఉంది. జాతర సమయంలో వాగు నుంచి గద్దెల ప్రాంగణం వరకూ సుమారు కిలోమీటరున్నర మేర కాలినడకనే వెళ్లాలి. అంత రద్దీగా ఉంటుందా ప్రాంతం. ప్రభుత్వం జంపన్నవాగుకు ఇరువైపులా స్నానఘట్టాలు నిర్మించింది. జల్లు స్నానాలకూ ఏర్పాటు చేసింది. సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుంచి గద్దెకు తీసుకువస్తున్నప్పుడు...జిల్లా కలెక్టర్, ఎస్పీ అక్కడే ఉంటారు. తల్లి సమ్మక్క గద్దె మీదికి వస్తున్నప్పుడు...జిల్లా పోలీసు ఉన్నతాధికారి గౌరవసూచకంగా గాలిలో కాల్పులు జరుపుతారు. మేడారం పరిసరాల్లో...నాలుగు కిలోమీటర్ల మేర బస చేసిన భక్తులకు అదే సంకేతం - అమ్మ గద్దె ఎక్కుతున్నట్టు. వెనువెంటనే జయజయధ్వానాలు మిన్నంటుతాయి.
అమ్మలకు...బంగారం
హుండీలో గలగలలు!
* తాడ్వాయి-వరంగల్ మార్గంలో చల్వాయి గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో లక్నవరం సరస్సు ఉంది. దీనిపై ఏర్పాటు చేసిన...వేలాడే వంతెన పర్యటకులకు ప్రత్యేక ఆకర్షణ. దట్టమైన అటవీప్రాంతంలో అందమైన కాటేజీలూ రెస్టారెంట్లూ ఉన్నాయి. హుషారుగా బోటు షికార్లూ చేసుకోవచ్చు.
* తాడ్వాయి-వరంగల్ మార్గంలో ములుగు కంటే కాస్త ముందే, జంగాలపల్లి క్రాసింగ్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం...ఎడమ వైపు వెళితే రామప్పగుడి కనిపిస్తుంది. ఇది ప్రపంచ ప్రసిద్ధ ఆలయం. అక్కడి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో గణపురం మండలంలో కాకతీయుల కాలం నాటి ‘కోటగుళ్లు’ ఆలయ సముదాయం ఉంది. ఇక్కడి నుంచి నేరుగా పరకాల రోడ్డుకు చేరుకుని, వరంగల్ వెళ్లిపోవచ్చు.
* వరంగల్‌లో ప్రసిద్ధ వేయిస్తంభాల గుడి, కాకతీయుల రాజధాని ప్రాంతమైన ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయం చూడదగినవి.
* మంగపేట ప్రాంతం నుంచి వచ్చే వారు...మల్లూరులోని హేమాచల లక్ష్మీనరసింహస్వామిని కళ్లారా దర్శించుకోవచ్చు.
* చŒత్తీస్‌గఢ్‌తో పాటు ఖమ్మం జిల్లా వెంకటాపురం, పేరూరు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు... ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన సుమారు రెండు కిలోమీటర్ల భారీ వంతెన కూడా పర్యటక ప్రదేశమే.
పూజారుల సంఘం...
- జంగిలి కోటేశ్వర్‌రావు, న్యూస్‌టుడే, ములుగు
- బండారి లక్ష్మయ్య, న్యూస్‌టుడే, తాడ్వాయి
ఫొటోలు: సంపత్
- బండారి లక్ష్మయ్య, న్యూస్‌టుడే, తాడ్వాయి
ఫొటోలు: సంపత్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి