ruchulu (ఘుమఘుమలు. Source: http://eenadu.net/Specialpages/ruchulu/Ruchuluinner.aspx?qry=nonveg03082015-1)

రొయ్యలతో..


కావల్సినవి: రొయ్యలు - అరకేజీ, అల్లం పేస్టు - టేబుల్‌స్పూను, వెల్లుల్లిపేస్టు - టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి - మూడు, సెనగపప్పూ - అరకప్పు (వేయించి పొడిలా చేసి పెట్టుకోవాలి), పసుపు - అరచెంచా, మిరియాలపొడి - చెంచా, కొత్తిమీర తరుగు - అరకప్పు, నిమ్మకాయ - ఒకటి (రసం తీసుకోవాలి), ఉప్పు - తగినంత, నూనె - అరకప్పు, గరంమసాలా - అరచెంచా.తయారీ: ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి పేస్టూ, తగినంత ఉప్పూ, గరంమసాలా వేసి రొయ్యలకు ఇవన్నీ పట్టేలా బాగా కలిపి మూత పెట్టేయాలి. ఈ రొయ్యలు కనీసం గంటసేపు పక్కన పెట్టేయాలి. తరవాత మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని ఇనుప చువ్వకు పొడుగ్గా వచ్చేలా అద్దాలి. ఇలాగే మిగిలిన మిశ్రమాన్ని కూడా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని గ్రిల్‌పద్ధతిలో లేదా ఓవెన్‌లో ఐదారు నిమిషాలు కాల్చి తీసుకుని తరవాత వాటిపై నూనె రాయాలి. లేదంటే పెనంమీద ఉంచి కాల్చుకున్నా సరిపోతుంది. వీటిని వేడివేడిగా టొమాటో సాస్‌తో కలిపి తింటే ఆ రుచే వేరు.


For more RUCHULU, visit: http://eenadu.net/Specialpages/ruchulu/Ruchulu.aspx



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు