ఇలా పేరు పెట్టారు! (07/02/2016)
పెప్సీ: ఆహారం జీర్ణమవడానికి ఉపయోగపడే ‘పెప్సిన్’ అనే రసాయనం ఉంటుంది కాబట్టి ఈ పేరొచ్చింది.
ఫేస్‌బుక్: అమెరికా యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు ఒకర్నొకరు తెలుసుకోవడానికి ‘ఫేస్‌బుక్’ అనే పుస్తకంలో అందరి వివరాలూ పొందుపరుస్తారు. దాన్నుంచే ఈ పేరు.
గూగుల్: నిజానికి googol అని దానికి పేరు పెట్టారు. దానర్థం 1 పక్కన వంద సున్నాలుండే అంకె. కానీ ఆ డొమైన్ అందుబాటులో లేకపోవడంతో అదే విధంగా పలికే google పేరు పెట్టారు.
బ్లాక్‌బెర్రీ: ఫోన్‌ని తయారు చేశాక, దాని మీద ఉన్న బటన్లు బెర్రీ పండు తొనల్లా కనిపించాయట. అలా సంస్థకు బ్లాక్ బెర్రీ అన్న పేరొచ్చింది.
కోకొకోలా: కోకొకోలా పానీయంలో రుచి కోసం ‘కోకొ’ ఆకులనూ, ‘కోలా’ విత్తనాలనూ ఉపయోగిస్తారు. అలా కోకొకోలా అని పేరు పెట్టారు.
స్కైప్: ‘స్కై పియర్ టు పియర్’... అంటే వ్యక్తులను ఆకాశంలోని తరంగాల ద్వారా అనుసంధానిస్తుందనే అర్థంలో ‘స్కైపర్’ అని పెట్టారు. ఆ పేరును మరొకరు రిజిస్టర్ చేయించడంతో, ‘ఆర్’ని తొలగించి స్కైప్‌గా కుదించారు.
నైక్: విజయానికి గుర్తుగా భావించే గ్రీకు దేవత పేరు అది. తమ వినియోగదారులూ అన్నింట్లో విజయం సాధించాలని ఆ పేరు పెట్టారు.
వొడాఫోన్: వాయిస్, డేటా, టెలిఫోన్... ఈ మూడింటి కలయికే వొడాఫోన్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి